వేధింపులపై వివాహిత ఫిర్యాదు | Husband Parents Murder Attempt ion Woman In Visakhapatnam | Sakshi
Sakshi News home page

వేధింపులపై వివాహిత ఫిర్యాదు

Published Wed, Apr 24 2019 12:09 PM | Last Updated on Sat, Apr 27 2019 12:04 PM

Husband Parents Murder Attempt ion Woman In Visakhapatnam - Sakshi

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న నెల్లి భాగ్యలక్ష్మి, పక్కన ఆమె కుమార్తె

అక్కిరెడ్డిపాలెం (గాజువాక): తనతో పాటు తన కుమార్తెను హతమార్చేందుకు అత్తమామలు, మరిది, తోటికోడలు, ఆడపడుచు యత్నించారని ఆరోపిస్తూ నెల్లి భాగ్యలక్ష్మి అనే మహిళ గాజు వాక పోలీసులను ఆశ్రయించింది. గాజు వాక డ్రైవర్స్‌ కాలనీ ఎల్‌బీ నగర్‌లో చోటు చేసుకున్న సంఘటనకు సంబం ధించి గాజువాక సీఐ కోరాడ రామారావు, బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం... పశ్చిమ గోదావరి జిల్లా ఏలేశ్వరానికి చెందిన నెల్లి భాగ్యలక్ష్మికి గాజు వాక ఎల్‌బీ నగర్‌కు చెందిన అవినాష్‌తో 2013లో వివాహం జరిగిం ది.

ఆ సమయంలో  అవినాష్‌ అమెరికాలో వెల్డర్‌గా పనిచేసేవాడు. అనంతరం నగరానికి వచ్చి వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భాగ్యలక్ష్మి నిలదీసింది. అప్పుడు పొంతన లేని సమాధానం చెప్పిన అవినాష్‌ మళ్లీ అమెరికా వెళ్లిపోయాడు. ఈ సంఘటన జరిగినప్పటి నుంచి భాగ్యలక్ష్మిని అత్తమామలతోపాటు ఆమె మరిది, తోటికోడలు, ఆడపడుచు మానసికంగా, శారీరకంగా వేధించడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో మంగళవారం మళ్లీ దాడి చేయడంతో బాధితురాలు భాగ్యలక్ష్మి గాయాలతో గాజువాక పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. తనతోపాటు తన కుమార్తెను హతమార్చేందుకు యత్నిం చారని ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి శరీరంపై గాయాలు ఉండటంతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపా రు. అనంతరం ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement