
పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విలియంకుమార్
విశాఖపట్నం,జి.మాడుగుల(పాడేరు): ఓ గిరిజన బాలిక ఆత్మహత్య చేసున్న విషయం ఆలస్యంగా తెలిసింది. మండలంలో లువ్వాసింగి పంచాయతీ సంగులోయ గ్రామానికి చెందిన మసాడ విలియంకుమార్(27)కు ఓ యువతితో కొన్నాళ్ల కిందట వివాహం జరిగింది. విలియం కుమార్ అదే గ్రామానికి చెందిన గిరిజన బాలిక కొండపల్లి లక్ష్మి(15)తో కొన్ని రోజులుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తెలిసింది. ఈ విషయంలో విలియంకుమార్, అతని భార్యకు మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి.
పలుమార్లు భార్యాభర్తలు గొడవపడినట్టు గ్రామస్తులు తెలిపారు. బుధవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. తన భర్తతో వివాహేతర సంబంధం వద్దని, మానుకోకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని విలి యంకుమార్ భార్య...లక్ష్మిని హెచ్చరిస్తూ గొడవ పడింది. దీంతో మనస్తాపానికి గురైన లక్ష్మి ఆత్మహత్య చేసుకుందని గ్రామస్తుల ద్వారా తెలిసింది. ప్రియరాలు ఆత్మహత్య చేసుకోవడంతో విలియంకుమార్ కూడా గురువారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. అపస్మారకస్థితిలో ఉన్న విలియంకుమార్‌ను స్థానికులు పాడేరు జిల్లా స్థాయి ఆస్పత్రికి తరలించారు. విలియంకుమార్‌కు ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనలపై ఎటువంటి ఫిర్యాదులు అందలేదని ఎస్‌ఐ రామారావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment