తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తనయుడు | A son set fire to his father | Sakshi
Sakshi News home page

తండ్రిపై కిరోసిన్ పోసి నిప్పంటించిన తనయుడు

Published Wed, Jun 1 2016 2:10 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

A son set  fire  to his father

తాగిన మైకంలో తండ్రిపైనే కిరోసిన్ పోసి నిప్పంటించాడో ఓ తనయుడు. ఈ సంఘటన నెన్నెల మండలం కొత్తూరు గ్రామంలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన శంకర్(70), లక్ష్మణ్(30)లు తండ్రీకొడుకులు. ఆరేళ్ల క్రితం తండ్రి శంకర్‌కు పక్షవాతం వచ్చింది.

ఇన్నేళ్లయినా నీకు చావు రావడం లేదు, ఇంకెన్ని రోజులు నీకు సేవలు చేయాలని తండ్రిపై కిరోసిన్ పోసి తానూ కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. స్థానికులు గమనించి మంటలను ఆర్పారు. అనంతరం 108 వాహనంలో గాయపడిన ఇద్దర్ని మంచిర్యాల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరి పరిస్థితి నిలకడగా ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement