
కవర్‌పై పిన్ నంబర్ రాసి ఉండటంతో..
తన బ్యాగును దొంగలించి అందులోని ఏటీఎం కార్డు నుంచి రూ. 40 వేలు డ్రా చేశారని శాటిలైట్ సిటీలో నివసిస్తున్న వాసుదేవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు శుక్రవారం తెలిపారు.
చెన్నూరు(వైఎస్ఆర్ జిల్లా): తన బ్యాగును దొంగలించి అందులోని ఏటీఎం కార్డు నుంచి రూ. 40 వేలు డ్రా చేశారని శాటిలైట్ సిటీలో నివసిస్తున్న వాసుదేవుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్‌కానిస్టేబుల్ శ్రీనివాసులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 8 న కడప నగర శివార్లలోని శాటిలైట్ సిటీ బ్లాక్–3లో నివసించే మాజీ సైనికుడు వాసుదేవుడు కడపకు వెళ్తూ ఇంటి గోడపై బ్యాగు పెట్టి ఫోన్‌లో మాట్లాడుతున్నాడు.
అదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు బ్యాగును అపహరించారు. అందులోని బ్యాంకు ఏటీఎం కార్డు కవర్‌పై పిన్ నంబర్ రాసి ఉండటంతో కడపలోని ఓ ఏటీఎం సెంటర్ నుంచి రూ. 40 వేలు అదే రోజు డ్రా చేశాడు. దీంతో ఆయన చెన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తాము కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామని వారు వివరించారు.