‘బ్యాగులో బాంబుందా’?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు | Air India Passenger Arrested At Cochin Airport For Bomb In My Bag Remark | Sakshi
Sakshi News home page

‘బ్యాగులో బాంబుందా?: ప్రశ్నించిన ప్రయాణికుడి అరెస్టు

Published Sun, Aug 11 2024 11:36 AM | Last Updated on Sun, Aug 11 2024 12:10 PM

Air India Passenger Arrested At Cochin Airport For Bomb In My Bag Remark

కొచ్చి: కేరళలోని కొచ్చి అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం(ఆగస్టు11) ఉదయం విచిత్ర ఘటన చోటుచేసుకుంది. మనోజ్‌కుమార్‌(42) అనే ప్రయాణికుడు సెక్యూరిటీ చెక్‌ వద్ద తన బ్యాగ్‌ తీసుకుంటూ అందులో బాంబేమైనా ఉందా అని ప్రశ్నించాడు. దీంతో ఎయిర్‌పోర్టు ఎక్స్‌రే బ్యాగేజ్‌ స్కాన్‌ పాయింట్‌ వద్ద ఉన్న సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

వెంటనే సీఐఎస్‌ఎఫ్‌ సిబ్బంది బాంబు స్క్వాడ్‌ను రప్పించి తనిఖీలు చేశారు.  మనోజ్‌కుమార్‌ క్యాబిన్‌ బ్యాగులతో పాటు చెకిన్‌ బ్యాగేజీని బాంబు డిటెక్షన్‌ మెషిన్‌తో జల్లెడ పట్టారు. తనిఖీల తర్వాత మనోజ్‌కుమార్‌ను పోలీసులకు అప్పగించారు. మనోజ్‌కుమార్‌ ఎయిర్‌ఇండియా విమానంలో కొచ్చి నుంచి ముంబై వెళ్లాల్సిఉంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement