సాక్షి, ముంబై : సెలబ్రిటీలు వాడే దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఏమైనా అందరి చూపులూ వాటిపైనే కేంద్రీకృతమవుతుంటాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో బ్లూకలర్ బెల్ట్ బ్యాగ్‌తో సందడి చేశారు. అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది.
స్కైబ్లూ టీ షర్ట్‌పై అదే రంగు డెనిమ్స్ ధరించిన అలియా భట్ సింపుల్‌గా కనిపించినా, ట్రెండీ లుక్ మెయింటెయిన్ చేసింది.1890 అమెరికన్ డాలర్ల ఖరీదైన ఈ బ్యాగ్ మన కరెన్సీలో రూ 1,39,170లు పలుకుతుంది. బ్యాగ్ సైతం నీలం రంగులో ఉండేలా చూసుకున్న అలియా ఆల్ బ్లూ కలర్‌లో స్టన్నింగ్ ఎయిర్‌పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది.
Comments
Please login to add a commentAdd a comment