costly material
-
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు
అసలు సబ్బు అంటే ఎలాగుండాలి.. మంచి కలర్ఫుల్గా ఉండాలి.. ఇది చూడండి.. ఇది కూడా సబ్బేనా.. చూశారుగా ఎలాగుందో.. అయితే.. ఇది చాలా ‘లక్ష’ణమైన సోప్ అట.. ఎందుకంటే.. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన సబ్బు. ధర కేవలం రూ.2.07 లక్షలు!! ఎందుకంత అని అడిగితే.. ఇందులో 17 గ్రాముల మేలిమి బంగారం, కొన్ని గ్రాముల వజ్రాల పొడి కూడా ఉందని దీన్ని తయారుచేసిన బడేర్ హసన్ అండ్ సన్స్ వాళ్లు చెప్పారు.. వీటితోపాటు అలీవ్ నూన్, ఆర్గానిక్ తేనె, ఖర్జూరం ఇలా చాలావాటిని వేసి.. దీన్ని తయారుచేశారట.. లెబనాన్‌లోని ట్రిపోలీకి చెందిన ఈ కుటుంబం హ్యాండ్ మేడ్ సోప్స్, ఖరీదైన సబ్బులు తయారుచేయడంలో పేరెన్నికగన్నవారు.. 15వ శతాబ్దం నుంచీ వీళ్లు ఇదే బిజినెస్‌లో ఉన్నారు. దీన్ని ఈ మధ్య కొందరు ప్రముఖులకు బహుమతిగా ఇచ్చారు.. ఇచ్చినప్పుడు వారి పేరును బంగారంతో ఈ సబ్బుపై చెక్కించి మరీ ఇచ్చారట.. ఇది కొంత మందికే ప్రత్యేకమా.. లేక అందరూ దీన్ని కొనొచ్చా అన్న దానిపై ఇంకా క్లారిటీ రాలేదు.. క్లారిటీ వస్తే.. కొనే ఉద్దేశం ఉందా ఏమిటి మీకు? చదవండి: (ఆ దేశాల్లో కరోనా రోగుల్ని గుర్తించే శునకాలు) -
అలియా బ్యాగ్‌పైనే అందరి చూపు..
సాక్షి, ముంబై : సెలబ్రిటీలు వాడే దుస్తులు, బ్యాగులు, యాక్సెసరీలు ఏమైనా అందరి చూపులూ వాటిపైనే కేంద్రీకృతమవుతుంటాయి. బాలీవుడ్ ముద్దుగుమ్మ అలియా భట్ ఇటీవల ముంబై విమానాశ్రయంలో బ్లూకలర్ బెల్ట్ బ్యాగ్‌తో సందడి చేశారు. అత్యంత ఖరీదైన ఈ బ్యాగ్ అందరి దృష్టినీ ఆకర్షించింది. స్కైబ్లూ టీ షర్ట్‌పై అదే రంగు డెనిమ్స్ ధరించిన అలియా భట్ సింపుల్‌గా కనిపించినా, ట్రెండీ లుక్ మెయింటెయిన్ చేసింది.1890 అమెరికన్ డాలర్ల ఖరీదైన ఈ బ్యాగ్ మన కరెన్సీలో రూ 1,39,170లు పలుకుతుంది. బ్యాగ్ సైతం నీలం రంగులో ఉండేలా చూసుకున్న అలియా ఆల్ బ్లూ కలర్లో స్టన్నింగ్ ఎయిర్పోర్ట్ లుక్‌తో అందరినీ ఆకట్టుకుంది. -
గ్రంథాలయాలకు కోరిన పుస్తకాలు
కర్నూలు(కల్చరల్), న్యూస్‌లైన్: పాఠకుల కోరిన పుస్తకాలను గ్రామాల్లోని గ్రంథాలయాలకు అందించేందుకు జిల్లా గ్రంథాలయ సంస్థ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. మారుమూల పల్లెల్లో ఉంటూ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ అభ్యర్థులు ఖరీదైన మెటీరియల్ కొనలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారి కోసం జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రస్తుతం ఆన్లైన్లో ఆన్‌డిమాండ్ అనే పుస్తక సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించింది. జిల్లాలోని ఏ ప్రాంతం నుంచైనా కంప్యూటర్ ద్వారా ఆన్లైన్లో అవసరమైన రెఫరెన్స్ పుస్తకాల పేర్లను నమోదు చేసుకోవచ్చు. ఇందుకోసం http://public libraries.ap.nic.in అనే వెబ్‌సైట్‌ను ప్రారంభించామని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చేగిరెడ్డి వెంకటరమణారెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వెబ్‌సైట్‌లోని ప్రొఫార్మాలో పాఠకులు తమకు అవసరమైన పోటీ పరీక్షల పుస్తకాలు, రెఫరెన్‌స పుస్తకాల వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. ఆయా పుస్తకాలను మండల కేంద్రాల్లోని శాఖా గ్రంథాలయాలకు ఎప్పటికప్పుడు సరఫరా చేయనున్నట్లు తెలిపారు. పాఠకులు, పోటీ పరీక్షల అభ్యర్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.