
ముంబై : నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేందుకు బాలీవుడ్ సెలబ్రిటీలు ఎంత ఖర్చుకైనా వెనుకాడరు. ఇక తమ లుక్ విషయంలో స్పెషల్ కేర్ తీసుకునే బాలీవుడ్ హీరోయిన్లు లగ్జరీ లైఫ్‌ను లీడ్ చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటారు. స్టైలింగ్‌లో తనదైన శైలిలో అందరినీ ఆకట్టుకునే బాలీవుడ్ బ్యూటీ సోనం కపూర్ ముంబై ఎయిర్‌పోర్ట్‌లో ట్రెండీ లుక్‌తో అదరగొట్టారు.
గ్రేకలర్ డ్రెస్, రెడ్ లెదర్ బెల్ట్, బ్లాక్ షూస్‌తో మెరిసిన సోనం లుక్‌లో ఆమె ధరించిన బ్యాగ్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. హెర్మెస్ బిర్కిన్ బ్రాండ్‌కు చెందిన ఈ బ్యాగ్ ఖరీదు రూ 18 లక్షలు కావడం గమనార్హం.