
సాక్షి, నిజాబాబాద్: ఓ దుండగుడు చిన్నారిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా పాపను సంచిలో మూట కట్టి తీసుకెళ్తుండగా.. పాప అదృష్టం కొద్ది ఆ సంచి జారి కింద పడింది. దాంతో ఆ చిట్టితల్లి పెద్ద ప్రమాదం నుంచి భయటపడింది. నిజామాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది ఈ ఘటన. జిల్లాలోని వేల్పూర్ మండలం నడుకుడా గ్రామంలో దుండగుడు బుధవారం ఓ పాపను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. దీనిలో భాగంగా పాపను సంచిలో మూట కట్టి సైకిల్‌పై పెట్టుకుని తీసుకెళ్తున్నాడు. అయితే అదృష్టం కొద్ది సంచి జారి కిందపడటంతో పాప బయటకు వచ్చింది. జారిపడ్డ చిన్నారిని గమనించిన గ్రామస్తులు కిడ్నాపర్‌ని పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment