సాక్షి, నిజామాబాద్: బిడ్డను ఎత్తుకుపోయినోడు వెతగ్గా వెతగ్గా దొరికాడు.అంతే చెట్టుకు కట్టి ఉతికి పారేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 11న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు.
బిడ్డ కోసం 15 రోజులు వెతికి వేసారి పోయిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద నాగరాజు కన్పించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. బిడ్డ జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు.
నిజామాబాద్‌లో కిడ్నాప్ కలకలం
Published Tue, Aug 25 2020 9:32 AM | Last Updated on Tue, Aug 25 2020 2:50 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment