Navipeta
-
సూసైడ్ స్పాట్..! ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు
సాక్షి, నిజామాబాద్: జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకునే వారికి యంచ గోదావరి బ్రిడ్జి స్పాట్‌గా మారిపోయింది. గలగల పారే గోదారమ్మలో దూకి ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబ కలహాలు, ఆర్థిక నష్టాలు, అనారోగ్యం, జీవితంపై విరక్తి.. కారణాలు ఏవైనా సూసైడ్ స్పాట్ బాసర గోదావరే గుర్తుకువస్తుంది. చదువులమ్మ సరస్వతి మాత అనుగ్రహం పొందాల్సిన వారు గోదావరిలో దూకి కాటికి పోతున్నారు. గత మూడేళ్లలో 20 మంది దానిపై నుంచి దూకి ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. మూడేళ్ల కాలంలో.. గోదావరి నదిలో దూకి గత మూడేళ్లలో 20 మంది బలవన్మరణం చెందారు. సాయంత్రం, రాత్రి వేళలో బాధితులు అక్కడికి వెళ్లి గోదావరిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. ఈ ఏడాది ఆరంభంలో ఇరిగేషన్ డీఈఈ వెంకటరమణారావ్ బలవన్మరణం చెందగా తాజాగా రెండు రోజుల కిందట హైదరాబాద్‌కు వ్యాపారి సందీప్ గోదావరి నదిలో దూకి సూసైడ్ చేసుకున్నాడు. ఇలా ఆత్మహత్యలకు పాల్పడే వారికి జిల్లా సరిహద్దులోని గోదావరి నది బ్రిడ్జి కేర్ ఆఫ్ అడ్రస్‌గా మారింది. ఆత్మహత్యకు పాల్పడిన సందీప్ వాహనం ఎత్తుపెంచాలని కలెక్టర్, సీపీలకు వినతి నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన గోదావరి బ్రిడ్జి ఇరువైపులా రక్షణ గోడ ఎత్తును పెంచాలని, కంచెతో రక్షణ కల్పించాలని యంచ గ్రామస్తులు ఇటీవల కలెక్టర్, సీపీలకు వినతిపత్రం సమర్పించారు. బ్రిడ్జికి ఇరువైపులా.. గోదావరిపై నవీపేట మండలం యంచ నుంచి బాసర వరకు గల వంతెనపై రక్షణ గోడ ఎత్తుగా లేకపోవడంతో ఆత్మహత్య చేసుకునే వారికి అనుకూలంగా మారింది. బ్రిడ్జికి ఇరువైపులా ఎత్తయిన రక్షణ గోడ లేదంటే ఫెన్సింగ్ ఏర్పాటుతో ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంది. అధికారులు ఇందుకోసం ప్రత్యేక చొరవ తీసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. బందోబస్తు ఏర్పాటు చేయాలి రాత్రి వేళలో జనసాంద్రత తక్కువగా ఉన్న యంచ గోదావరి బ్రిడ్జిపై పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయాలి. వంతెనపై రక్షణ గోడ ఎత్తు పెంచడంతో పాటు ఫెన్సింగ్ ఏర్పాటు చేయ డం వల్ల ఆత్మహత్యలు తగ్గే అవకాశం ఉంటుంది. – వినోద్‌కుమార్, యంచ నిఘా ఏర్పాటు చేశాం వంతెనపై ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడకుండా అక్కడ ప్రత్యేకంగా నిఘా ఏర్పాటు చేశాం. యంచ గ్రామస్తులతో పాటు పోలీస్ సిబ్బందితో ప్రత్యేక గస్తీ నిర్వహిస్తున్నాం. బ్రిడ్జికి ఇరువైపులా కంచె ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులకు నివేదికలు పంపాం. – రాజారెడ్డి, ఎస్సై, నవీపేట ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నిజామాబాదు: నవీపేటలో పెళ్లింట విషాదం
-
కవితపై అభిమానం.. బంగారంతో లాకెట్
సాక్షి, నిజామాబాద్ : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్థానం. ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తెగానే కాక తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, జాగృతి అధ్యక్షురాలిగా, ఓసారి ఎంపీగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కవిత.. నిత్య జీవితంలోనూ అదేస్థాయిలో అభిమానులు కలిగి ఉన్నారు. అయితే కొందరు అభిమానులు తాము అభిమానించే వ్యక్తి కోసం ఏం చేయడానికైన సిద్ధపడతారు. ఈ కోవకే చెందుతారు నవీపేట మండలం బినోల సొసైటీ చైర్మన్ మగ్గారి హన్మాండ్లు.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిమాని ఆయన. ఆమె బొమ్మను ఏడు గ్రాముల బంగారంతో చేయించుకొని మెడలో లాకెట్ వేసుకున్నారు. కవిత ఎమ్మెల్సీగా గెలుస్తుందన్న సంతోషంలో ఈ లాకెట్ చేయించుకున్నానని హన్మాండ్లు పేర్కొన్నారు. ఆయన గతంలో కవిత పేరును చేతిపై పచ్చబొట్టు సైతం వేయించుకున్నారు. నిజామాబాద్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి. -
దొరికాడు..ఉతికారు...
-
వెతగ్గా వెతగ్గా దొరికాడు.. ఉతికి ఆరేశారు
సాక్షి, నిజామాబాద్: బిడ్డను ఎత్తుకుపోయినోడు వెతగ్గా వెతగ్గా దొరికాడు.అంతే చెట్టుకు కట్టి ఉతికి పారేశారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లాలో సోమవారం చోటు చేసుకుంది. నవీపేట మండలం దండిగుట్టకు చెందిన లక్ష్మి అనే మహిళ ఈ నెల 11న బస్టాండ్‌లో వుండగా...బాసరకు చెందిన నాగరాజు అనే వ్యక్తి మాటలు కలిపాడు. ఆ తర్వాత ఆమె ఏడాదిన్నరబాబును ఎత్తుకుపోయాడు. బిడ్డ కోసం 15 రోజులు వెతికి వేసారి పోయిన లక్ష్మి, ఆమె కుటుంబ సభ్యులకు చివరికి నిజామాబాద్ మున్సిపల్ ఆఫీస్ వద్ద నాగరాజు కన్పించాడు. బిడ్డ ఎక్కడున్నాడో చెప్పమంటూ చెట్టుకు కట్టి గ్రామస్తులు నాగరాజును చితక్కొట్టారు. ఆ రోజే తన వద్ద బాబును ఎవరో ఎత్తుకెళ్లారంటూ సమాధానం చెప్పడంతో పోలీసులకు అప్పగించారు. బిడ్డ జాడ మాత్రం ఇంతవరకు దొరకలేదు. -
టాస్క్‌ఫోర్స్ మెరుపు దాడులు
నవీపేట(బోధన్): ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు గురువారం మెరుపు దాడి చేసి, రెండు టిప్పర్లు, ఒక కారును స్వాధీనం చేసుకున్నారు. గురువారం వేకువజామున నాళేశ్వర్ నుంచి నిజామాబాద్‌కు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్న రెండు టిప్పర్లను పట్టుకుని స్థానిక పోలీసులకు అప్పగించారు. మండలంలోని జన్నెపల్లి, నాళేశ్వర్, శాఖాపూర్, చిక్లి వాగుల నుంచి కొందరు ఇసుకాసురులు రాత్రి వేళల్లో నిజామాబాద్, ఆర్మూర్, నందిపేట, నవీపేటలకు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారని రెవెన్యూ, పోలీసులకు వివిధ గ్రామాల రైతులు, యువకులు పలుమార్లు ఫోన్లో ఫిర్యాదులు చేశారు. అయితే, వారు తూతూ మంత్రంగా స్పందిస్తున్నారని కొందరు ఇటీవల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఉన్నతాధికారులు పగడ్బందీగా దాడులు చేయాలని టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆదేశించారు. ఇసుక రవాణాలో ముదుర్లుగా పేరున్న గాంధీనగర్, చిక్లి క్యాంప్‌లకు చెందిన ఇరువురు ఎప్పటిలాగే నాళేశ్వర్ వాగు నుంచి నిజామాబాద్ వైపు రెండు టిప్పర్లలో ఇసుకను తరలిస్తున్నారు. పథకం ప్రకారం నిఘా వేసిన టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ వాహనాలను వెంబడించి పాల్దా సమీపంలో పట్టుకున్నారు. ఈ రెండు వాహనాలకు రక్షణగా ఉన్న కారును కూడా సీజ్ చేశారు. టిప్పర్లతో పాటు కారును స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, కారును సీజ్ చేసినట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
వీడియో: దళితులపై బీజేపీ నేత దాష్టీకం..
సాక్షి, నవీపేట : నిజామాబాద్ జిల్లా నవీపేటలో దారుణం చోటుచేసుకుంది. మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారని ప్రశ్నిస్తున్నందుకు ఇద్దరు దళితు వ్యక్తులపై ఓ బీజేపీ నేత భరత్ రెడ్డి దాడికి పాల్పడ్డారు. తాము ఎంత వేడుకున్నా వినిపించుకోని ఆ నేత కర్రతో బాధిత దళితులను బెదిరిస్తూ నీటి కుంటలో మునగాలంటూ ఆదేశించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. నవీపేట మండలంలోని ఎర్రగుంట్ల వద్ద గ్రామపంచాయతీ పర్మిషన్ లేకుండా బీజేపీ నేత మట్టిని అక్రమ రవాణా చేస్తున్నారు. అయితే ఈ అక్రమ రవాణాపై ఇద్దరు దళిత వ్యక్తులు భరత్ రెడ్డిని ప్రశ్నించారు. 'నన్నే ప్రశ్నిస్తారా.. మీకెంత ధైర్యమంటూ' బాధిత దళితులను దుర్భాషలాడాతూ వారిపై తన జులుం ప్రదర్శించినట్లు సమాచారం. దాడికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో విషయం వెలుగుచూసింది. అన్యాయం, అక్రమాలను ప్రశ్నించినందుకు ఇద్దరు దళితులపై దాడి జరగడాన్ని దళిత సంఘాలు తీవ్రంగా ఖండించాయి. దాడికి పాల్పడ్డ నేత భరత్ రెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. -
నిజామాబాద్ జిల్లాలో భారీ వర్షం
-
జోరు వాన
ఇందూరు : నిజామాబాద్ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. జిల్లా మొత్తం సగటున 36.6 మిల్లి మీటర్ల వర్షపాతన నమోదైంది. నవీపేట్, ఎడపల్లి, భీమ్‌గల్ మండలాల్లో అత్యధికంగా ఏడు సెంటి మీటర్ల చొప్పున వర్షం కురిసింది. వాగులు, వంకలు పొంగిపొర్లు తున్నాయి. లింగంపేట మండలంలో పెద్దవాగు, పాముల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. జిల్లాలో 11 ఇళ్లు «ధ్వంసమయ్యాయి. నిజాంసాగర్ ప్రాజెక్టులోకి గురువారం వెయ్యిక్యూసెక్కుల వరదనీటి ప్రవాహం వచ్చింది. ఎగువన ఉన్న మంజీర వాగు నీటితో నిండటంతో ప్రాజెక్టులోకి వరద నీరు వస్తోంది. నిజాంసాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు, 17.8 టీఎంసీలకు గాను ప్రసుతం 1,367 మీటర్లతో 0.085 ఎమ్‌సీఎఫ్‌టీల నీరు ఉంది. మద్నూర్ మండలంలోని గోజేగావ్ గ్రామ శివారులోని లెండి వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. లోలెవల్ వంతెన పూర్తిగా నీట మునిగిపోవడంతో గ్రామానికి ఉదయం నుంచి రాత్రి వరకు రాకపోకలు నిలిచిపోయాయి. జుక్కల్ మండలంలోని కౌలాస్‌నాలా ప్రాజెక్ట్ ఒక్క గేటు ఎత్తి దిగువకు విడుదల చేపడుతున్నారు. కర్నాటక, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి వరద నీరు వస్తుండడంతొ ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 458 మీటర్లతో నిండి 500 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ప్రాజెక్ట్‌లోకి చేరుతోంది. అంతే నీటిని దిగువకు వదులుతున్నారు. మహారాష్ట్రలోని నాందేyŠ జిల్లాలో భారీ వర్షాలకు విష్ణుపురి జలాశయం నిండిపోగా నాలుగు గెట్లును తెరచి దిగువ తెలంగాణకు సరిహద్దులో ఉన్న బాబ్లి ప్రాజెక్టుకు నీరును వదులు తున్నారు. బాబ్లీ ప్రాజెక్టు నుంచి నీరు జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. -
భార్య గొంతు నులిమి హత్యచేసిన భర్త..?
- హడావుడిగా అంత్యక్రియలకు ఏర్పాట్లు - గాయాలు చూసి ఫిర్యాదు చేసిన మృతురాలి తల్లి నవీపేట: క్షణికావేశం ఇద్దరి జీవితాలను తారుమారు చేసింది. ఈ సంఘటనలో ఒకరు భార్య విగత జీవి కాగా భర్తపై కేసు నమోదైంది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్ కథనం మేరకు వివరాలు ఈవిధంగా ఉన్నాయి. ధర్మారం(ఎ) గ్రామానికి చెందిన తెనుగు అంజయ్య నిజామాబాద్ ఆర్డీవో కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కుటుంబ కలహాలతో కొంత కాలంగా భార్య తెనుగు అనితతో తరచూ గొడవ పడేవాడు. వీరికి పలుమార్లు పంచాయతీ పెద్దలు, కుటుంబ పెద్దలు సర్ధిచెప్పారు. శుక్రవారం రాత్రి రోజూలాగే ఇరువురు కలిసి మధ్యం సేవించి మళ్లీ గొడవకు దిగారు. దీంతో అంజయ్య అనితను తీవ్రంగా కొట్టి గొంతునులిమి చంపేశాడని తెలిపారు. పక్క గ్రామమైన అనంతగిరిలో ఉండే అనిత తల్లి శారదకు ఫోన్ చేసి ‘మీకూతురు మెట్లపై నుంచి పడిపోయింది తొందరగా రావాలని’ సమాచారమిచ్చాడు. దీంతో దీంతో బంధువులంతా తరలివచ్చారు. అంత్యక్రియల ఏర్పాట్లు చేస్తుండగా మృతురాలి చెవి కింద రక్తం కారడంతో అనుమానం వచ్చి తల్లితరపు బంధువులు నిశితంగా పరిశీలించగా గొంతుపై గాయాలు కనిపించారుు. తమ కూతురును భర్త అంజయ్య హత్య చేశాడని మృతురాలి తల్లి శరద పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిజామాబాద్ రూరల్ సీఐ వెంకటేశ్వర్రావ్, ఎస్సై వేణుగోపాల్‌లు సంఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు అంజయ్యను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. క్షణికావేశంలో తాగిన మైకంలో భర్త అంజయ్య తన భార్యను చంపాడని రూరల్ సీఐ విలేకరులకు తెలిపారు. మృతురాలికి అజయ్(9), అరవింద్(3) అనే తొమ్మిదేళ్ల లోపు ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. -
టీడీపీకి ఎదురుదెబ్బ
బోధన్, న్యూస్‌లైన్ : బోధన్ నియోజకవర్గంలోని నవీపేట, రెంజల్, బోధన్ పట్టణానికి చెందిన పలువురు టీడీపీ నాయకులు ఇప్పటికే కాంగ్రెస్, టీఆర్ఎస్లలో చేరారు. బోధన్ మండలం సాలూరకు చెందిన జిల్లాస్థాయి ముఖ్యనేత పార్టీని వీడేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నేడో, రేపో పార్టీని వీడి కాంగ్రెస్ లేదా, టీఆర్ఎస్లో చేరాలో అనుచరులతో సమాలోచనలు చేస్తున్నారు . మండలంలో పార్టీ పటిష్టంగా ఉన్న సాలూర ఈ ముఖ్యనేత పార్టీ వీడితే పార్టీ నష్టం తీవ్రంగా ఉంటుందని కార్యకర్తలే పేర్కొంటున్నారు. పార్టీ నాయకుల మధ్య గ్రూప్ విబేధాలు ఉండటం వల్లే 1999, 2004 అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఓడిపోయారు. ఇక 2009 ఎన్నికల్లో మహాకూటమి పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని టీఆర్ఎస్కు కేటాయించారు. దీంతో 15 ఏళ్లుగా తెలుగుదేశం నియోజకవర్గ ప్రాతినిథ్యానికి దూరంగా ఉంటోంది. నాయకుల మధ్య అనైక్యత కాంగ్రెస్ పార్టీ లబ్ధిని చేకూర్చుతోంది. 2013లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో నవీపేట మినహా బోధన్, ఎడపల్లి, రెంజల్ మండలాల్లో సైకిల్ జోరు సాగింది. ఆవిర్భావం నుంచి ఆదరణ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి బోధన్ నియోజకవర్గ ప్రజలు ఆదరిస్తున్నారు. 1983లో పార్టీ అభ్యర్థి సాంబశివరావు చౌదరి, 1985లో బషీరుద్దీన్‌బాబుఖాన్, 1989లో కొత్త రమాకాంత్, 1994లో మళ్లీ బషీరుద్దీన్‌బాబుఖాన్ ఇక్కడి నుంచి టీడీపీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. వరుసగా 20 ఏళ్లు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ హయాంలో, చంద్రబాబు మంత్రివర్గంలో బషీరుద్దీన్ బాబుఖాన్ క్యాబినెట్ మంత్రిగా పని చేశారు. సీనియర్లతో పరేషాన్ క్షేత్రస్థాయి కార్యకర్తలు ఐక్యతారాగం వినిపిస్తున్నా సీనియర్లు మాత్రం ఆధిపత్య పోరు సాగిస్తున్నారు. నియోజకవర్గంలో పార్టీ రాష్ట్ర కమిటీలో ప్రతినిధులుగా ఉన్న మేడపాటి ప్రకాశ్‌రెడ్డి, అమర్‌నాథ్‌బాబు, నవీపేటకు చెందిన జిల్లా ముఖ్యనేత వి.మోహన్‌రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సునీతా దేశాయ్ బోధన్ నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌ను ఆశిస్తున్నారు. ఆధిక్యత కోసం వీరి మ ధ్య కొనసాగుతున్న అంతర్గత పోరు పార్టీ బలహీనపడటానికి కారణమవుతోంది. పార్టీని వీడిన నాయకులు రెంజల్ మండల పార్టీ అధ్యక్షుడు నాగభూషణంరెడ్డి అనుచరులతో సహా మాజీమంత్రి సుదర్శన్‌రెడ్డి సమక్షంలో మంగళవారం కాంగ్రెస్‌లో చేరారు. ఎడపల్లి మండలంలోని జంలం మాజీ సర్పంచ్ మల్లిక, జైతాపూర్ సొసైటీ వైస్‌చైర్మన్ శ్రీనివాస్‌రావు తమ అనుచరులతో కలిసి టీఆర్ఎస్లో చేరారు. నవీపేట మండలానికి చెందిన నిజాంసాగర్ ప్రాజెక్టు డి-50 చైర్మన్ రాంరెడ్డి, సారంగపూర్ ఎన్సీఎఫ్సీ సీడీసీ మాజీ చైర్మన్ నర్సింహారెడ్డి, నవీపేట మాజీ ఉప సర్పంచ్ నరేందర్‌రెడ్డి, మండల పరిషత్తు కో-ఆప్షన్ సభ్యుడు ముజీబ్ సైతం కాంగ్రెస్‌లో చేరారు. నియోజకవర్గంలో టీడీపీని వీడేవారి జాబితా ఇంకా ఉందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. -
భర్తను చంపించిన భార్య
నవీపేట, న్యూస్‌లైన్: గతనెల 24న మండలంలోని మద్దెపల్లితండాకు చెం దిన నునావత్ దేవీసింగ్(38) దారుణ హత్య కేసును పోలీ సులు చేధించారు. మృతుని భార్యే ప్రియుడితో చంపిం చింది. ఆదివారం నిజామాబాద్ రూరల్ సీఐ శ్రీనివాస్ రె డ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. దేవీ సింగ్ భార్య తారాబాయితో అదే తండాకు చెందిన నునావత్ చం ద్రూకు ఎనిమిదేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది. ఇది తండా అంతట పాకింది. అయితే ఈ విషయాన్ని తారాబా యి భర్త దేవీసింగ్ జీర్ణించుకోలేకపోయాడు. పలుమార్లు భార్యను మందలించాడు. పెద్దల సమక్షంలో పం చాయతీ లూ జరిగాయి.దీంతో తారాబాయి తన ప్రియుడు చం ద్రూతో పథకం పన్నింది. తన భర్తను చంపేయాలని ప్రి యుడిని కోరింది. దీంతో చంద్రూ తన అల్లుడు ఫాల్తి యా దేవీసింగ్‌తో పాటు అదే గ్రామానికి చెందిన మిత్రులు బాదావత్ దేవీసింగ్, బర్ల సాయిలుతో పథకం రచిం చా డు. దీనికి ఒక్కొక్కరికి రూ.20 వేలు చెల్లించేందుకు బేరా న్ని కుదిరింది. గత నెల 21న బొప్ప సంధ్రం చెరువు వద్ద విం దు చేసుకున్నారు. దీనికి తారాబాయి భర్త దేవీసింగ్ను కూ డా పిలిచారు. తాగిన మైకంలో ఉన్న దేవీసింగ్ మెడకు ఉరేసి, మర్మాంగాలపై తన్నారు. దీంతో దేవీసింగ్ అక్కడే చనిపోయాడు. చెరువులో పడేయాలని చెప్పిన భార్య.. దేవీసింగ్ శవాన్ని ఏం చేయాలని చంద్రూ ప్రశ్నించగా పెద్ద బండకు శవాన్ని కట్టి అక్కడే గల చెరువులో పడేయాలని చె ప్పడంతో నిందితులు శవాన్ని చెరువులో పడేశారు. అనంతరం తారాబాయి పోలీసులను ఆశ్రయించి తన భర్త క న్పించడంలేదంటూ ఫిర్యాదు చేసింది. గతనెల 24న చెరువులో దేవీసింగ్ మృతదేహాన్ని పోలీసులు గుర్తిం చారు. హ త్యేనని నిర్దారణకు వచ్చిన పోలీసులు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించారు. అందుకు అతని భార్య తా రాబాయి ప్రియుడితో చంపించిందని సీఐ చెప్పారు. హ త్యకేసుకు సంబంధించి మొత్తం ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. వారిని ఆదివారం అరెస్టు చేసి రి మాండ్‌కు పంపామన్నారు. భార్య తారాబాయితోపాటు మరో నిందితుడు ఫాల్తియా దేవీసింగ్ పరారీలో ఉన్నారన్నారు. -
శిశు జననాలపై సమాచారమేది?
నవీపేట, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామాల్లో శిశు జననాల పై అధికారులు సమగ్ర సమాచారం కలిగి ఉం డాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంతో పాటు నాళేశ్వర్, మోకన్‌పల్లి గ్రామాల్లో పర్య టించారు. కలెక్టర్ నవీపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులతో మాట్లాడారు. శిశు జననాలపై అధికారులెవరు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన పైవిధంగా స్పందించారు. ప్రభుత్వాస్పత్రి, అంగన్వాడీ, ఐకేపీ శాఖలు శిశు జననాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు. ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు,సిబ్బంది శిశు జననాలపై పక్షానికో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ‘బంగారు తల్లి’ పథకం పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. మే ఒకటి తరువాత శిశు జననాలకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. జననీ సురక్ష యోజన లబ్ధిదారుల వివరాలను అడిగి, సంబంధిత రిజిష్టర్రు పరిశీలించారు.కొంతమందికి పథకం కింద డబ్బులు ఎందుకు చెల్లించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కాన్పు తరువాత వెళ్లిపోవడంతో పంపిణీ వీలు కాలేదని వారు సమాధానమిచ్చారు. రెండు రో జుల్లో అందజేయాలని ఆదేశించారు. ‘కస్తూర్బా’అధికారికి మందలింపు కలెక్టర్ అంతకు ముందు కస్తూర్బా పాఠశాలను పరిశీలించారు. ఇరవై మంది విద్యార్థులు గైర్హాజరవడంతో ప్రత్యేకాధికారి అఫ్జల్ అలీని ప్రశ్నించారు. విద్యార్థులందరికీ ‘ఎ’గ్రేడ్ వచ్చే లా బోధించాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. వారానికి ఎన్నిసా ర్లు గుడ్లు అందిస్తున్నారని విద్యార్థులను అడుగగా, వారు మూడు,ఐదు అం టూ భిన్నమైన సమాధానలివ్వడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వంట మనిషి ని పిలి చి అడుగగా ఆమె కూడా తడబడడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ బోర్డును పరిశీలించారు. కొత్త మెనూనా?పాత మెనూ నా? అని ప్రశ్నించారు.కొత్త మెనూ రెండు రోజుల కిందటనే వచ్చిందని ఇంకా బోర్డు పెట్టలేదని ప్రత్యేకాధికారి బదులిచ్చారు. ఇన్చార్జి డిప్యూటీ ఈఓ రషీద్‌ను అడుగగా వారం కిందటనే కొత్త మెనూను జారీ చేశామని చెప్పడంతో ప్రత్యేకాధికారిని మందలించారు. ‘కస్తూర్బా’ పనుల పరిశీలన మోకన్ పల్లి గ్రామంలో జరుగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఎందు కు ఆలస్యమైందని కాంట్రాక్టర్‌ను ప్రశ్నిం చారు. ఈనెలాఖరులోలోపు పూర్తి కాకుంటే జరి మానా విధించాలని అధికారులను ఆదేశించారు. మామిడి మొక్కల పరిశీలన అనంతరం నాళేశ్వర్ గ్రామ శి వారులో ముత్తెన్న అనే రైతు పొలంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి మొక్కల ను ఆయన పరిశీలించారు.