శిశు జననాలపై సమాచారమేది?
Published Wed, Sep 11 2013 4:19 AM | Last Updated on Fri, Sep 28 2018 7:14 PM
నవీపేట, న్యూస్‌లైన్ :మారుమూల గ్రామాల్లో శిశు జననాల పై అధికారులు సమగ్ర సమాచారం కలిగి ఉం డాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండల కేంద్రంతో పాటు నాళేశ్వర్, మోకన్‌పల్లి గ్రామాల్లో పర్య టించారు. కలెక్టర్ నవీపేట ప్రభుత్వ ఆస్పత్రిలో అధికారులతో మాట్లాడారు. శిశు జననాలపై అధికారులెవరు సరైన సమాధానం చెప్పకపోవడంతో ఆయన పైవిధంగా స్పందించారు. ప్రభుత్వాస్పత్రి, అంగన్‌వాడీ, ఐకేపీ శాఖలు శిశు జననాల నమోదుపై ప్రత్యేక శ్రద్ధతో పనిచేయాలని సూచించారు.
ఈ మూడు శాఖలకు సంబంధించిన అధికారులు,సిబ్బంది శిశు జననాలపై పక్షానికో సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించారు. ‘బంగారు తల్లి’ పథకం పై గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన కల్పించాలన్నారు. మే ఒకటి తరువాత శిశు జననాలకు సంబంధించిన వివరాలను వెంటనే అందించాలని అధికారులను ఆదేశించారు. జననీ సురక్ష యోజన లబ్ధిదారుల వివరాలను అడిగి, సంబంధిత రిజిష్టర్‌రు పరిశీలించారు.కొంతమందికి పథకం కింద డబ్బులు ఎందుకు చెల్లించలేదని సిబ్బందిని ప్రశ్నించారు. కాన్పు తరువాత వెళ్లిపోవడంతో పంపిణీ వీలు కాలేదని వారు సమాధానమిచ్చారు. రెండు రో జుల్లో అందజేయాలని ఆదేశించారు.
‘కస్తూర్బా’అధికారికి మందలింపు
కలెక్టర్ అంతకు ముందు కస్తూర్బా పాఠశాలను పరిశీలించారు. ఇరవై మంది విద్యార్థులు గైర్హాజరవడంతో ప్రత్యేకాధికారి అఫ్జల్ అలీని ప్రశ్నించారు. విద్యార్థులందరికీ ‘ఎ’గ్రేడ్ వచ్చే లా బోధించాలని ఉపాధ్యాయులకు సూచిం చారు. వారానికి ఎన్నిసా ర్లు గుడ్లు అందిస్తున్నారని విద్యార్థులను అడుగగా, వారు మూడు,ఐదు అం టూ భిన్నమైన సమాధానలివ్వడంతో కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. వంట మనిషి ని పిలి చి అడుగగా ఆమె కూడా తడబడడంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. మెనూ బోర్డును పరిశీలించారు. కొత్త మెనూనా?పాత మెనూ నా? అని ప్రశ్నించారు.కొత్త మెనూ రెండు రోజుల కిందటనే వచ్చిందని ఇంకా బోర్డు పెట్టలేదని ప్రత్యేకాధికారి బదులిచ్చారు. ఇన్‌చార్జి డిప్యూటీ ఈఓ రషీద్‌ను అడుగగా వారం కిందటనే కొత్త మెనూను జారీ చేశామని చెప్పడంతో ప్రత్యేకాధికారిని మందలించారు.
‘కస్తూర్బా’ పనుల పరిశీలన
మోకన్ పల్లి గ్రామంలో జరుగుతున్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం నూతన భవన నిర్మాణ పనులను కలెక్టర్ పరిశీలించారు.ఎందు కు ఆలస్యమైందని కాంట్రాక్టర్‌ను ప్రశ్నిం చారు. ఈనెలాఖరులోలోపు పూర్తి కాకుంటే జరి మానా విధించాలని అధికారులను ఆదేశించారు.
మామిడి మొక్కల పరిశీలన
అనంతరం నాళేశ్వర్ గ్రామ శి వారులో ముత్తెన్న అనే రైతు పొలంలో ఉపాధి హామీ పథకం కింద నాటిన మామిడి మొక్కల ను ఆయన పరిశీలించారు.
Advertisement
Advertisement