
వనపర్తి, మదనాపురం : విద్యార్థులకు నాణ్యమైన కూరగాయలతో రుచికరమైన వంట వండకుంటే వంటఏజెన్సీ నిర్వాహకులను తొలగిస్తామని కలెక్టర్ శ్వేతామహంతి హెచ్చరించారు. మంగళవారం శంకరమ్మపేట ప్రాథమిక పాఠశాలను ఆమె తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తున్నారా లేదా అని తెలుసుకున్నారు. విద్యార్థులకు యూనిట్ టెస్టులు నిర్వహిస్తున్నారా అని ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో మౌళిక వసతుల గురించి ఆరాతీశారు.