కవితపై అభిమానం.. బంగారంతో లాకెట్‌ | Nizamabad Man Have Golden Locket With Kavitha | Sakshi
Sakshi News home page

కవితపై అభిమానం.. బంగారంతో లాకెట్‌

Published Sun, Oct 11 2020 2:09 PM | Last Updated on Sun, Oct 11 2020 4:24 PM

Nizamabad Man Have Golden Locket With Kavitha - Sakshi

సాక్షి, నిజామాబాద్‌ : తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవితది ప్రత్యేక స్థానం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తెగానే కాక తెలంగాణ ఉద్యమ నాయకురాలిగా, జాగృతి అధ్యక్షురాలిగా, ఓసారి ఎంపీగా గెలిచి తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పాటు చేసుకున్నారు. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న కవిత.. నిత్య జీవితంలోనూ అదేస్థాయిలో అభిమానులు కలిగి ఉన్నారు. అయితే కొందరు అభిమానులు తాము అభిమానించే వ్యక్తి కోసం ఏం చేయడానికైన సిద్ధపడతారు. ఈ కోవకే చెందుతారు నవీపేట మండలం బినోల సొసైటీ చైర్మన్‌ మగ్గారి హన్మాండ్లు.. మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత అభిమాని ఆయన. ఆమె బొమ్మను ఏడు గ్రాముల బంగారంతో చేయించుకొని మెడలో లాకెట్‌ వేసుకున్నారు. కవిత ఎమ్మెల్సీగా గెలుస్తుందన్న సంతోషంలో ఈ లాకెట్‌ చేయించుకున్నానని హన్మాండ్లు పేర్కొన్నారు. ఆయన గతంలో కవిత పేరును చేతిపై పచ్చబొట్టు సైతం వేయించుకున్నారు. నిజామాబాద్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల ఫలితాలు రేపు (సోమవారం) విడుదల కానున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement