
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం(మార్చ్ 30) దారుణ ఘటన వెలుగు చూసింది. లక్నోలోని సర్వన్ నగర్‌లో నివాసం ఉంటున్న రామ్ లఖన్ తన భార్య ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి వారి మృతదేహాలను రెండు రోజుల పాటు వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యల విషయం బయటపడింది.
భార్యకు స్కార్ఫ్‌తో ఉరివేసి చంపి అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను రామ్‌లఖన్ హత్య చేశాడు. హత్యల తర్వాత రామ్‌లఖన్ పారిపోయాడు. సెల్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే రామ్ లఖన్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు తన పక్కనే నిద్రిస్తున్నారని అనుకోవడం కోసమే వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నానని రామ్‌లఖన్ విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు.
Comments
Please login to add a commentAdd a comment