Wife kids muder
-
భార్యాపిల్లలను చంపి బ్యాగులో కుక్కిన భర్త.. విస్తుపోయే విషయం వెల్లడి
లక్నో: ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఆదివారం(మార్చ్ 30) దారుణ ఘటన వెలుగు చూసింది. లక్నోలోని సర్వన్ నగర్లో నివాసం ఉంటున్న రామ్ లఖన్ తన భార్య ఇద్దరు పిల్లలను చంపి బ్యాగులో కుక్కి వారి మృతదేహాలను రెండు రోజుల పాటు వారి ఇంట్లోనే ఉంచుకున్నాడు. ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా హత్యల విషయం బయటపడింది. భార్యకు స్కార్ఫ్‌తో ఉరివేసి చంపి అనంతరం నిద్రిస్తున్న ఇద్దరు పిల్లలను రామ్‌లఖన్ హత్య చేశాడు. హత్యల తర్వాత రామ్‌లఖన్ పారిపోయాడు. సెల్‌ఫోన్ లొకేషన్‌ను ట్రేస్ చేసిన పోలీసులు అతడిని పట్టుకుని అరెస్టు చేశారు. భార్యకు వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతోనే రామ్ లఖన్ ఈ హత్యలు చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. భార్య పిల్లలు తన పక్కనే నిద్రిస్తున్నారని అనుకోవడం కోసమే వారి మృతదేహాలను ఇంట్లోనే ఉంచుకున్నానని రామ్‌లఖన్ విచారణ సందర్భంగా పోలీసులకు తెలిపాడు. ఇదీ చదవండి.. ప్రాణం తీసిన బర్త్ డే కేక్ -
భార్య,ఇద్దరి పిల్లల గొంతు కోసిన భర్త
-
భార్య,ఇద్దరి పిల్లల గొంతు కోసిన భర్త
టీడీ గుట్ట: మహబూబ్‌నగర్ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లీపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు బంధువులు చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపింది. నిన్నటివరకు తమ కళ్ల ముందే తిరిగిన చిన్నారులు విగతజీవులుగా మారడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు కారణంగానే అతడీ కిరతకానికి పాల్పడ్డాడా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.