టీడీ గుట్ట: మహబూబ్‌నగర్ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లీపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
కుటుంబ కలహాల కారణంగానే అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు బంధువులు చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపింది. నిన్నటివరకు తమ కళ్ల ముందే తిరిగిన చిన్నారులు విగతజీవులుగా మారడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు కారణంగానే అతడీ కిరతకానికి పాల్పడ్డాడా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.
భార్య,ఇద్దరి పిల్లల గొంతు కోసిన భర్త
Published Mon, Sep 30 2013 8:23 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement