
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మతిభ్రమించి పూటకో మాట మాట్లాడుతున్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ మెహబూబ్ షేక్ ఎద్దేవా చేశారు. నగరంలోని తన కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యమని, వైఎస్సార్ సీపీ ప్రవేశపెట్టే అవిశ్వాసానికి మద్దతిస్తామని ప్రకటించిన చంద్రబాబు, తెల్లారే సరికి మాటమార్చి. తామే అవిశ్వాసం పెడతామని పూటకో మాట మాట్లాడుతున్నారమి విమర్శించారు. సహజంగా వయస్సు 65ఏళ్ల దాటిన వారికి అల్జీమర్స్ అనే వ్యాధి కారణంగా మతిమరుపు వస్తుందన్నారు. మానసిక వైద్యుడికి చూపించి చికిత్స పొందితే మంచిదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment