భార్య,ఇద్దరి పిల్లల గొంతు కోసిన భర్త | Man kills wife & two children in mahabubnagar district | Sakshi
Sakshi News home page

Published Mon, Sep 30 2013 9:34 AM | Last Updated on Thu, Mar 21 2024 7:54 PM

మహబూబ్‌నగర్‌ జిల్లా టీడీ గుట్ట సమీపంలో దారుణం చోటు చేసుకుంది. ఓ కిరాతక భర్త తన భార్య, ఇద్దరు పిల్లల గొంతు కోసి హత్య చేశాడు. ఆ తర్వాత అతడు కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటనలో తల్లీపిల్లలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. భర్త పరిస్థితి విషమంగా ఉంది. అతడిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. కుటుంబ కలహాల కారణంగానే అతడీ దారుణానికి ఒడిగట్టినట్టు బంధువులు చెబుతున్నారు. ఈ సంఘటన స్థానికలంగా కలకలం రేపింది. నిన్నటివరకు తమ కళ్ల ముందే తిరిగిన చిన్నారులు విగతజీవులుగా మారడాన్ని స్థానికులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కుటుంబ కలహాలు కారణంగానే అతడీ కిరతకానికి పాల్పడ్డాడా, ఇతర కారణాలేమైనా ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement