కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ | 5.5 kgs gold arnaments theft in kesineni travel bus | Sakshi
Sakshi News home page

కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ

Published Fri, Jun 26 2015 3:57 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM

కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ - Sakshi

కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారం చోరీ

రూ.1.25 కోట్లు విలువ ఉండొచ్చని అంచనా
నాయుడుపేట టౌన్: హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్తున్న కేశినేని ట్రావెల్స్ బస్సులో 5.5 కేజీల బంగారు నగలున్న బ్యాగును సినీ ఫక్కీలో చోరీ చేసిన ఘటన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని హైవేపై గురువారం ఉదయం జరిగింది. చోరీకి గురైన నగల విలువ సుమారు రూ. 1.25 కోట్లు ఉంటుందని అంచనా. చెన్నైలోని ‘భాగ్యం జెమ్స్ అండ్ జువెల్లరీ ప్రైవేట్ లిమిటెడ్’లో ఉద్యోగం చేస్తున్న ఎం.సెంథిల్, మహీందర్ సుమారు 14 కేజీల నగలను విక్రయించేందుకు ఈనెల 23న హైదరాబాద్ వచ్చారు.

24న దాదాపు 5 కేజీల నగలను విక్రయించి అదేరోజు రాత్రి మిగిలిన ఆభరణాలను రెండు బ్యాగుల్లో భద్రపరచుకుని కేశినేని బస్సులో చెన్నైకి బయలుదేరారు. గురువారం ఉదయం నాయుడుపేట సమీపంలో టిఫిన్ కోసం బస్సు ఆపారు. ఈ క్రమంలో బస్సు ముందు ఓ కారు వచ్చి నిలబడటం.. అక్కడి నుంచి ఓ వ్యక్తి హడావుడిగా వెళుతుండటాన్ని బస్సు డ్రైవర్ గమనించి అతణ్ని పట్టుకోవడానికి ప్రయత్నించాడు. అగంతకుడు డ్రైవర్‌ను తోసేసి కారులో చెన్నై వైపు పారిపోయాడు. ఇంతలో సెంథిల్, మహీందర్ తమ బంగారు నగల బ్యాగుల్లో ఒకటి కనిపించట్లేదని డ్రైవర్‌కు చెప్పారు. సమాచారమందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement