Nora Fatehi Hand Bag Cost: సెలెబ్రిటీలు ధరించే డ్రెస్ నుంచి వారు వేసుకునే చెప్పులు.. గాగుల్స్, వాచీలు ఇలా ప్రతీదీ పెద్ద విషయమే. వాళు కదిలినా.. మెదిలినా అంతా విశేషాల పరంపరలే. వాళ్లు ఏ లుక్‌లో కనిపించినా… కెమెరా కళ్లు క్లిక్కుమంటాయి. వారిని టాప్ టూ బాటమ్ వరకూ స్కాన్ చేస్తేకానీ కెమెరాల కళ్లు శాంతించవు. ఆ ఫోటోలో చిన్న విశేషం కనిపించినా అదో పెద్ద వార్త అయి కూర్చుంటుంది. తాజాగా బాలీవుడ్ భామ నోరా ఫతేహి విషయంలో అదే జరిగింది.
ఈ బ్యూటీ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితురాలే. టెంపర్, కిక్2, లోఫర్, ఊపిరి చిత్రాల్లో ఆడిపాడిన నోరా.. ప్రభాస్ నటించిన బాహుబలి సినిమాలో ‘మనోహరి’ పాటలోనూ కనిపించి కుర్రకారు మదిని దోచింది. తాజాగా ఈ భామ రూ. 200కోట్ల మనీ లాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరైంది. ఆ సమయంలో లక్షల రూపాయాల విలువైన హ్యాండ్ బ్యాగ్‌ను ధరించి అభిమానులకు దర్శనమిచ్చింది. బ్లూ కలర్ టీ షర్ట్, షార్ట్స్ ధరించి వచ్చిన నోరా చేతిలో హ్యాండ్ బ్యాగ్ తో కనిపించింది. ప్రస్తుతం నోరా హ్యాండ్ బ్యాగ్ పిక్స్ నెట్టింట్ వైరల్ అవుతున్నాయి.
ఎందుకంటే దాని ధర ఎంతో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే. దాదాపుగా రూ.1.95లక్షల విలువైన మినీ లూయిస్ విట్టన్ పామ్ స్ప్రింగ్స్ బ్రాండ్‌కు చెందిన బ్యాగ్‌ను ధరించి ఆమె కనిపించింది. ఆ బ్యాగ్ ధరను తెలుసుకొని అభిమానులు షాకవుతున్నారు. ఇక నోరా సినిమాల విషయానికొస్తే.. తాజాగా ఈ భామ అజయ్ దేవగణ్ హీరోగా నటించిన ‘‘ భుజ్: ది ప్రైడ్ ఆఫ్ ఇండియా ’’ సినిమాలో స్పై పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో సంజయ్ దత్, సోనాక్షి సిన్హా, శరద్ కేల్కర్ కీలక పాత్రలు పోషించారు. ఆ సినిమాకు అభిషేక్ దర్శకత్వం వహించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ఆ చిత్రం విడుదలయింది.
Comments
Please login to add a commentAdd a comment