రామగుండం (కరీంనగర్): కరీంనగర్ జిల్లాలో గోదావరి నది ఒడ్డున ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. రామగుండం సమీపంలో గోలివాడలో గోదావరి నది ఒడ్డున బుధవారం ఉదయం ఇది బయటపడింది. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎవరో హత్య చేసి మృతదేహాన్ని గోనెసంచిలో మూటకట్టి వదిలేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.