ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు | Student Tries To Take Girlfriend Inside Manipal Hostel in Trolley Caught | Sakshi
Sakshi News home page

ట్రాలీ బ్యాగులో ప్రేయసిని కుక్కేసి.. అడ్డంగా దొరికిపోయాడు

Published Fri, Feb 4 2022 1:10 PM | Last Updated on Fri, Feb 4 2022 1:46 PM

Student Tries To Take Girlfriend Inside Manipal Hostel in Trolley Caught - Sakshi

ప్రతీకాత్మక చిత్రం.. పక్కన మణిపాల్‌ పేరిట వైరల్‌ అవుతున్న ఫేక్‌ వీడియో చిత్రం

ప్రేయసితో తన గదిలో రాత్రంతా సరదాగా గడపాలన్న ఓ కుర్రాడి ప్రయత్నం బెడిసి కొట్టింది. మాస్టర్‌ ప్లాన్‌ వేసి గర్ల్‌ఫ్రెండ్‌ను రూమ్‌కి తీసుకెళ్లాలని ప్రయత్నించాడు. కాస్తుంటే.. గదికి చేరుకునేవాడే. ఇంతలో.. 

కర్ణాటక మణిపాల్‌ హాస్టల్‌లో మంగళవారం జరిగిన ఈ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఇంజినీరింగ్‌ చదువుతున్న విద్యార్థి.. అదే కాలేజీలో చదువుతున్న విద్యార్థినితో ప్రేమాయణం సాగిస్తున్నాడు. మంగళవారం రాత్రి ఆమెను తన గదికి తీసుకెళ్లాలని ప్లాన్‌ వేశాడు. 

ఓ పెద్ద ట్రాలీ బ్యాగులో ఆమెను కుక్కేసి.. హాస్టల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఏం ఎరగనట్లు వెళ్తున్న అతనిపై హాస్టల్‌ వార్డెన్‌కు అనుమానం వచ్చింది. అంతపెద్ద లగేజ్‌ ఏంటని ప్రశ్నించాడు. దీంతో ఆన్‌లైన్‌లో ఆర్డర్‌ చేసిన వస్తువులు అంకుల్‌.. అంటూ తడబడుతూ సమాధానం ఇచ్చాడు ఆ కుర్రాడు.దాంతో ఆ వార్డెన్‌ అనుమానం మరింత బలపడింది.



బ్యాగ్‌ ఓపెన్‌ చేయాలని కోరడంతో.. పగిలిపోయే ఐటెమ్స్‌ ఉన్నాయని, వద్దని రిక్వెస్ట్‌ చేశాడు. అయినా కుదరదని బలవంతంగా ఆ ట్రాలీ బ్యాగ్‌ జిప్‌ ఓపెన్‌ చేయడంతో.. అందులోంచి ఆ కుర్రాడి గర్ల్‌ఫ్రెండ్‌ బయటకు వచ్చింది. ఆపై గట్టిగా ప్రశ్నించడంతో హాస్టల్‌లో గడిపేందుకు తీసుకొచ్చానని నిజం ఒప్పుకున్నాడు. ఈ ఇద్దరూ ఒకే కాలేజ్‌ స్టూడెంట్స్‌ కావడంతో సస్పెండ్‌ చేసి..ఇళ్లకు పంపించినట్లు తెలుస్తోంది. 

లాక్‌డౌన్‌ టైంలో మంగళూరుకు చెందిన ఓ స్టూడెంట్‌.. తన ఫ్రెండ్‌ను ఇదే తరహాలో అపార్ట్‌మెంట్‌కు తెచ్చుకున్న సంగతి గుర్తుండే ఉంటుంది.  ఇదిలా ఉంటే..  సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఓ వీడియో మణిపాల్‌కు సంబంధం లేదని స్పష్టత ఇచ్చింది Manipal Academy of Higher Education. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement