ఇదేం బ్యాగ్‌ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..! | Prada Launches Rs 2.73 Lakh Tote Bag That Looks | Sakshi
Sakshi News home page

ఇదేం బ్యాగ్‌ రా దేవుడా..! ధర తెలిస్తే కంగుతింటారు..!

Published Sun, Sep 22 2024 11:45 AM | Last Updated on Sun, Sep 22 2024 11:57 AM

Prada Launches Rs 2.73 Lakh Tote Bag That Looks

కొన్ని ప్రముఖ లగ్జరీయస్‌ ప్యాషన్‌ బ్రాండ్‌లు మార్కెట్లోకి రీలిజ్‌ చేసే కొత్త వస్తువులు చాలా విలక్షణంగా ఆకర్షణీయంగా ఉంటాయి.పైగా వాటికో స్పెషాలిటీ తప్పక ఉంటుంది. ఆ ఫేమస్‌ బ్రాండ్‌లు రిలీజ్‌ చేసే వస్తువులపై క్రేజ్‌ మాములుగా ఉంటుంది. అందరూ అటెన్షన్‌ ఆ వస్తువు పైనే ఉంటుంది. అంతలా ఫ్యాషన్‌ ప్రపంచంలో వాటికి క్రేజ్‌ ఉంటుంది. 

అయితే ఫ్యాషన్‌కే ఐకానిక్‌ సింబల్‌గా ఉన్న ఈ లగ్జరీ బ్రాండ్‌ బ్యాగ్‌ చూస్తే మాత్రం ఇదేం బ్యాగ్‌ రా బాబు అంటూ ముఖం చిట్లించేస్తారు. ప్రస్తుతం నెట్టింట ఈ బ్యాగ్‌పై సర్వత్ర విమర్శలు, జోక్‌లు వినిపిస్తున్నాయి. ప్రాడ్‌ అనే ప్రముఖ లగ్జరీ బ్రాండ్‌ ఈ మెటాలిక్ టోట్ బ్యాగ్‌ని లాంచ్‌ చేసింది. ఈ బ్రాండ్‌ మరింత వినూత్నంగా ఈ బ్యాగ్‌ని రూపొందించింది. పురుషులకు ఇలా డిజైన్‌ చేయడం మరింత విస్మయానికి గురిచేసింది. ఇది మన బస్సుల్లోనూ, రైల్వే టాయిలెట్లలోనూ ఫ్లోర్‌ మాదిరిగా ఈ మెటాలిక్‌ బ్యాగ్‌ ఉంది. చూసిన వాళ్ల అంతా భయనాకంగా ఉందంటూ ఘెరంగా పోలికలు చెబుతూ కామెంట్లు చేస్తున్నారు. 

పబ్లిక్‌ ట్రాన్స్‌పోర్ట్‌లో కనిపించే ప్లోర్‌ మాదిరిగా బ్యాగ్‌ని డిజైన్‌ చేయడం ఏమిటి. ఇది  ఫ్యాషన్-ఫార్వర్డ్ స్టేట్‌మెంట్ లేదా విచిత్రమైన డిజైన్ అని ప్రశ్నలు లేవెనెత్తారు. సర్వత్రా ఈ బ్యాగ్‌ డిజైన్‌పై విమర్శలు వెల్లవెత్తాయి. ఇదేం డిజైన్‌ అంటూ తిట్టిపోస్తున్నారు. అయితే ఇంతలా విమర్శలు వస్తున్న ఈ బ్యాగ్‌ ధర వింటే కచ్చితంగా షాకవ్వుతారు. ఏకంగా రూ. 2.73 లక్షలు పలుకుతుందట. పురుషుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ బ్యాగ్‌ డిజైన్‌ పరంగానే కాకుండా ధర పరంగానూ క్లిక్‌ అయ్యేలా లేదు కదూ..!.

(చదవండి: ఇంత టాలెంటా..! ఓ పక్క నృత్యం..మరోవైపు..!)

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement