ఆర్మ్‌స్ట్రాంగ్ బ్యాగుకు రూ.11 కోట్లు
అయితే ఈ క్రమంలో జరిగిన ఒక తప్పిదం వల్ల చంద్రుడిపై నమూనాలు సేకరించేందుకు వాడిన ఓ బ్యాగు జాన్సన్ స్పేస్ సెంటర్‌లోనే ఉండిపోయింది. బ్యాగు ప్రాముఖ్యం తెలియని వారు కొందరు దీన్ని పారేయబోతూ కన్సాస్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియం యజమానికి చూపించారు. కొంత కాలం తర్వాత ఓ చోరీ కేసులో ఈ యజమానికి శిక్ష పడటంతో ఎఫ్‌బీఐ ఈ బ్యాగును స్వాధీనం చేసుకుని 2015లో అతి కష్టమ్మీద 995 డాలర్లకు అమ్మింది. ఇప్పుడు మళ్లీ రూ.11 కోట్ల 58 లక్షల 25 వేల 5 వందల యాభై రూపాయలకు అమ్ముడుబోయిందీబ్యాగు.