Neil Armstrong
-
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
చల్లని రాజా ఓ చందమామా
చందమామ రావే... జాబిల్లి రావే.. అని ఎంత పిలిచినా దగ్గరకు రాని చందమామ దగ్గరకు మనిషే వెళ్లాడు. జూలై 20, 1969 నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడి పై కాలు మోపిన రోజు.అతడే చెప్పినట్టు అది ‘మానవ జాతి ముందంజ’.అయినా సరే... నేటికీ చందమామ ఒక నిగూఢ దీపం. రహస్యాల మయం.మానవజాతికి ఈ రేరాజు ఆత్మీయుడు,అందమైన స్నేహితుడు, ప్రియతముడు, మేనమామ. అతని చుట్టూ ఎన్నో కథలూ గాథలూ కల్పనలు. నేడు ‘ఇంటర్నేషనల్ మూన్ డే’. కాబట్టి శశికాంతుని సంగతులు కొన్ని...కుందేలు ఇలా వచ్చిందట!చంద్రుడిపై కుందేలు అనేది అందమైన అబద్ధమైనా అది మనకు అమితంగా ఇష్టమైన అబద్ధం! అసలు మన కుందేలు అక్కడెక్కడో ఉన్న చంద్రుడిపైకి ఎలా చేరింది? ప్రపంచ వ్యాప్తంగా పాచుర్యంలో ఉన్న ఒక నమ్మకం ప్రకారం.... బుద్ధుడు ఊరూరూ తిరిగి, బోధనలు చేసి అలిసిపోయాడు. ఆకలితో ఉన్నాడు. ఇది గమనించిన జంతువులు తమకు తోచిన పరిధిలో బుద్ధుడు తినడానికి రకరకాల పదార్థాలు తీసుకువచ్చాయి. పాపం! ఒక కుందేలు దగ్గర మాత్రం ఏమీ ఉండదు. ‘నన్ను తిని మీ ఆకలి తీర్చుకోండి’ అంటూ మంటల్లో దూకి చనిపోతుంది కుందేలు. కుందేలు ఆత్మత్యాగానికి చలించిన బుద్ధుడు దానికి అమరత్వాన్ని ప్రసాదిస్తాడు. చంద్రుడిపై ఉండి కనువిందు చేసేలా వరమిస్తాడు.మూడుసార్లు పుట్టాడు...ఎవరైనా సరే ఒక్కసారే పుడతారు. పురాణాల ప్రకారం చంద్రుడు మాత్రం మూడుసార్లు పుట్టాడు. అందుకే చంద్రుడిని త్రిజన్మి అని కూడా అంటారు. చంద్రుణ్ణి మొదటిసారి బ్రహ్మ సృష్టించాడు. రెండోసారి అత్రి మహర్షి కన్నుల నుంచి ఉద్భవించాడు. రాక్షసులు, దేవతల క్షీరసాగర మథనంలో లక్ష్మీదేవితో పాటు చంద్రుడు పునర్జన్మ పొందాడు.డస్ట్‌బిన్ కాదు...మనిషంటేనే నిరంతరం చెత్తను పారబోస్తుండే జీవి. అతడా చెత్త వేయడానికి భూగ్రహం సరి΄ోక చంద్రుని మీదా బోలెడంత ΄ారబోస్తున్నాడు. పనికి రాకుండా పోయిన రోవర్లూ, విఫలమైన రాకెట్లూ, పంపిన ఉపగ్రహాలూ, ఆస్ట్రొనాట్ల బూట్లూ, బ్లాంకెట్లూ ఇలాంటివెన్నో అక్కడ. అంతరిక్ష ప్రయాణికులు బ్యాగుల్లో ΄ోసి అక్కడ ΄ారబోసిన యూరిన్ బ్యాగులే 100కు పైగా ఉన్నాయక్కడ. ఇలా ఇప్పటివరకూ చంద్రుడి మీద మనిషి పారబోసిన చెత్త బరువు ఎంతో తెలుసా? అక్షరాలా 2,27,000 కిలోలు.చంద్రపాలుమనకు భూకంపాలలాగే చంద్రుడి మీదా చంద్రకం΄ాలు వస్తుంటాయి. ఇంగ్లిషులో మూన్‌క్వేక్స్. ఇవి మళ్లీ నాలుగు రకాలు. చాలా లోతుగా వచ్చేవి డీప్ క్వేక్స్, ఉల్కలేవైనా చంద్రుణ్ణి ఢీకొడితే వచ్చేవి మీటియోరైట్ ఇంపాక్ట్స్, సూర్యుడి ఉష్ణోగ్రతతో వచ్చేవి థర్మల్ క్వేక్స్... ఇవి మూడూ ఒకరకం. కానీ ‘షాలో మూన్ క్వేక్స్’ మాత్రం చాలా భయంకరం. భూకంపం సెకన్లపాటు కొనసాగితేనే మహా ఉత్పాతం కదా... కానీ చంద్రకంపం దాదాపు పదినిమిషాలు మొదలుకొని అరగంట ΄ాటూ అదేపనిగా వస్తుంది.లూనార్ స్మెల్...చంద్రునికో వాసన కూడా ఉంటుంది. దాన్నే ‘లూనార్ స్మెల్’ అంటారు. అక్కడ వాతావరణం ఉండదు. అప్పుడు స్మెల్ ఎలా అనే అనుమానం రావచ్చు. అ΄ోలో–11కు చెందిన ఆస్ట్రొనాట్స్అందరి స్పేస్ సూట్లకు అంటుకుపోయి ఒకేలాంటి వాసన కొట్టడంతో ఈ విషయం తెలిసొచ్చింది. ఘాటైన మెటాలిక్ స్మెల్లాగా. క్రాకర్స్ కాలిపోయాక బాగా మండిన గన్΄ûడర్లా ఉండే వాసన ఇదంటూ ఖచ్చితంగా తెలిపినవాడు హరిసన్ జాక్ స్మిత్ అనే అపోలో–17 కు చెందిన సైంటిస్ట్ ఆస్ట్రొనాట్.ఆఖరి మజిలీ...΄ాపం... అప్పుడప్పుడూ అతడు శశికాంతుడా శ్మశానమా అనే డౌటు కూడా వస్తుంటుంది. చంద్రుడి మీద తమ చితాభస్మం పడాలని చాలా మంది భూలోక వాసుల కోరిక. అందుకే 450 బీసీ కాలం నుంచే కొందరు తమ చితాభస్మాన్ని చంద్రుడి మీద పడేలా ఎత్తైన ప్రదేశం నుంచి ఆకాశంలోకి విసిరేయమని వీలునామా రాసేవారు. యూజీన్ షూమాకర్ అనే ఆస్ట్రొనాట్కు చంద్రుని మీదకు వెళ్లాలని కోరిక. అయితే అతడు ఓ శారీరక లోపం కారణంగా చంద్రుణ్ణి చేరలేక΄ోయాడు. కానీ ఏనాటికైనా చంద్రుణ్ణి చేరాలన్న అతడి కోరిక నెరవేరకుండానే కారు యాక్సిడెంట్‌కు గురై 1997 లో మరణించాడు. అతడి కోరికను ఎలాగైనా తీర్చాలనుకున్న నాసా... అతడి భార్య, పరిశోధనల్లో సహచరి అయిన కరోలిన్ దగ్గర్నుంచి అనుమతి తీసుకుని లూనార్ ్రపాస్పెక్టర్ అనే ఉపగ్రహోపకరణంతో చంద్రుడిపైన దక్షిణ ధ్రువంలోని ఓ క్రేటర్‌లోకి సమాధయ్యేలా చితాభస్మాన్ని జల్లి 1998లో అతడి కోరిక తీర్చారు. ఆ తర్వాత ఎలాన్ మస్క్ లాంటివాళ్లు తమ స్పేస్ ఎక్స్‌తో 2019లో 152 మంది చితాభస్మాల్ని అంతరిక్ష వైతరణిలో నిమజ్జనం చేశారు.మూన్ డస్ట్ ఫీవర్ప్రస్తుతానికి ఎవరు పడితే వారు ఎప్పుడంటే అప్పుడు వెళ్లడానికి చంద్రుడేమీ పిక్నిక్ స్పాట్ కాదు. మామూలు వ్యక్తులు చంద్రుడి మీదకి వెళ్లడం సాధ్యం కాదు. అక్కడ ఉండే దుమ్మూధూళికి మూన్ డస్ట్ అని పేరు. అది పీల్చడం ఎంతో ప్రమాదకరం. స్పేస్ సూట్ తొడుక్కుని వెళ్లినా బట్టల్లోకి చేరిపోతుంది. అది ‘లూనార్ హే ఫీవర్’ అనే సమస్యకు దారితీస్తుంది. దీన్నే మూన్ డస్ట్ ఫీవర్ అని కూడా అంటారు.ధారాసింగ్ ముందే అడుగు పెట్టాడు‘ఇదెలా సాధ్యం!’ అనుకోవద్దు. సినిమాల్లో ఏదైనా సాధ్యమే కదా! విషయంలోకి వస్తే....1967లో హిందీలో ‘చాంద్ పర్ చడాయి’ అనే సినిమా వచ్చింది. ఈ సినిమా లో ప్రఖ్యాత రెజ్లర్ ధారాసింగ్ వ్యోమగామి ఆనంద్ ΄ాత్రలో నటించాడు. తన అసిస్టెంట్ ‘భాగు’తో కలిసి చంద్రుడిపై అడుగు పెట్టిన ఆనంద్ అక్కడ మాన్స్టర్లతో వీరోచితంగా ΄ోరాడుతాడు. ఈ ఫైటింగ్ విషయం ఎలా ఉన్నా ‘చంద్రయాన్’ లాంటి సందర్భాలలో ఈ సినిమాలోని స్టిల్స్‌ను సోషల్ మీడియాలో ΄ోస్ట్ చేస్తుంటాడు అతడి కుమారుడు విందు ధారాసింగ్. -
చంద్రుడిపై అడుగు.. నమ్మరేంట్రా బాబూ!
అదొక అత్యంత అద్భుతమైన ఘట్టం. 1969 జులై 20వ తేదీన.. ‘ఈగిల్’ లునార్ మాడ్యుల్ నుంచి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొట్టమొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ రెండో వ్యక్తిగా అడుగుపెట్టగా.. ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను పాతి చరిత్రకెక్కారు. చందమామ కలను మనిషి సాకారం చేసుకున్న క్షణాలివి. అయితే ఆ ఘనత నిజమేనా అనుమానాలు తరచూ వ్యక్తం అవుతుంటాయి.. అందుకు కారణాలు లేకపోలేదు. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. లునార్ మాడ్యుల్ ‘ఈగిల్’ కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ ‘కొలంబియా’ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. అంతరిక్షంలో సుమారు రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉత్కంఠ రేకెత్తిస్తూ.. జులై 19వ తేదీ.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. గ్రేటెస్ట్ అచీవ్మెంట్ కదా! ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. చుక్కలు కనపడాలి కదా! బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్ష్మంగా ఉంటాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్ష్యాలు.. అన్నింటికి మించి సుమారు 24 బిలియన్ల డాలర్ల ఖర్చుతో రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సజీవ సాక్ష్యాలు ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. చంద్రయాన్-3 నేపథ్యంలో సాక్షి వెబ్‌డెస్క్ ప్రత్యేకం -
పుట్టినరోజునాడే నాలుగో పెళ్లి
వాషింగ్టన్: ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి.. విడాకులు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?.. ఈయనే ఆయన. పేరు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్ ఆర్మ్‌స్టాంగ్ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా.. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ ‘లునార్ మాడ్యుల్ పైలట్’గా వ్యవహరించారు. ఇక మైకేల్ కోలిన్స్ కమాండ్ మాడ్యుల్ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్ 1969 జులై 16వ తేదీన లాంఛ్ కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు. ఇక.. మూడుసార్లు అంతరిక్షంలో సంచరించిన వ్యోమగామిగానూ అల్డ్రిన్ పేరిట ఓ రికార్డు ఉంది. 1971లో నాసా నుంచి రిటైర్ అయిన ఈ పెద్దాయన.. 1998లో షేర్స్పేస్ ఫౌండేషన్‌ను స్థాపించి అంతరిక్ష అన్వేషణ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. గతంలో ఆయనకు మూడు సార్లు వివాహం అయ్యింది. 1954-1974, 1975-78, 1988-2012.. ఇలా మూడుసార్లు ఆయన వివాహాలు విడాకులు అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన డాక్టర్ అంకా ఫౌర్తో డేటింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన 93వ పుట్టినరోజున.. 63 ఏళ్ల అంకాను వివాహం చేసుకున్నాడాయన. లాస్ ఏంజెల్స్ కలిఫ్లో దగ్గరి వాళ్ల మధ్య సింపుల్‌గా ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన ఆ పెద్దాయ.. ఇంట్లోనుంచి పారిపోయే కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. On my 93rd birthday & the day I will also be honored by Living Legends of Aviation I am pleased to announce that my longtime love Dr. Anca Faur & I have tied the knot.We were joined in holy matrimony in a small private ceremony in Los Angeles & are as excited as eloping teenagers pic.twitter.com/VwMP4W30Tn — Dr. Buzz Aldrin (@TheRealBuzz) January 21, 2023 -
చిటికెడు మట్టి రూ.4 కోట్లు
లండన్: అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్హామ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది. -
అదొక అద్భుత ఘట్టం.. లైవ్‌లో చూపించినా నమ్మరెందుకు?
చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్ లునార్ మాడ్యుల్’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా? సాక్షి, వెబ్‌డెస్క్: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లునార్ మాడ్యూల్ పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉద్వేగభరిత క్షణాలవి.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్ మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. #50thAnniversary 🌚👨🏼🚀👨🏼🚀👨🏼🚀 "That's one small step for man, one giant leap for mankind." ... and #Jump Happy #MoonDay 🌚 &#WorldJumpDay#50thanniversaryofthemoonlanding#LunarLanding#ManOnTheMoon 👨🏼🚀👨🏼🚀👨🏼🚀 pic.twitter.com/t7Ut0ogSN5 — Miguel Velasco (@_miguelvelasco) July 20, 2019 మూన్డేగా గుర్తింపు ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. కట్టుకథ.. కౌంటర్లు బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. -
చందమామపై బాంబులు వేశారు.. ఎందుకంటే..
చిన్నప్పుడు గోరుముద్దలు తిన్నప్పటి నుంచి పెద్దయ్యాక వెన్నెలలో ఎంజాయ్ చేసేదాకా.. చందమామ అంటే ఎప్పుడూ ఆసక్తే. ఇప్పటికే మనిషి చంద్రుడిపై అడుగుపెట్టాడు. అక్కడ ఇండ్లు కట్టుకుని ఉండిపోయే ప్రయత్నాలూ జరుగుతున్నాయి. మరి అలాంటి చందమామపై బాంబులు పేలాయి తెలుసా? అదీ ఒకటీ రెండు సార్లు కాదు చాలా సార్లు. మరి ఎవరు బాంబులు వేశారు? ఎందుకు వేశారు? బాంబులు వేస్తే ఏం జరిగింది? బాంబులు వేయడమే కాకుండా ఇంకా ఏమేం చేశారు? అనే వివరాలు తెలుసుకుందామా? చంద్రుడిపై అడుగుపెట్టి 52 ఏళ్లు చందమామపై మనిషి అడుగుపెట్టి దాదాపు 52 ఏళ్లు అవుతోంది. 1969 జూలై 11న అమెరికన్ వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై తొలి అడుగు వేశాడు. అమెరికా నిర్వహించిన అపోలో ప్రయోగాలతో మొత్తంగా 24 మంది చందమామపైకి వెళ్లారు. చివరిగా 1972 డిసెంబర్ 19న చంద్రుడిపై గడిపారు. ఇలా వెళ్లిన వ్యోమగాములు చంద్రుడిపై పలు రకాల పరిశోధనలు చేశారు. అక్కడి భూమి, వాతావరణం, గురుత్వాకర్షణ శక్తి, ఇతర అంశాలపై ప్రయోగాలు నిర్వహించారు. చంద్రుడి మట్టి, రాళ్లను భూమిపైకి తీసుకువచ్చారు. గోల్ఫ్ ఆడి.. ఎగిరి దుమికి.. చంద్రుడిపై వ్యోమగాములు ఏమేం చేశారో తెలుసా? అక్కడగోల్ఫ్ ఆడారు. ప్రఖ్యాత ‘హ్యామర్ అండ్ ఫెదర్ (పక్షి ఈకను, ఒక సుత్తి ని ఒకే ఎత్తు నుంచి వదిలి ఏది ముందు కింద పడుతుందో పరిశీలించడం)’ ప్రయోగాన్నీ చేశారు. గాల్లోకి ఎగిరి దూకారు. ఇవన్నీ ఎందుకో తెలుసా? చంద్రుడిౖ గురుత్వాకర్షణ (గ్రావిటీ)ని పరీక్షించడానికి. ఇక రోవర్‌ను నడుపుకొంటూ తిరగడం, అక్కడి ఉపరితలంతోపాటు భూమిని, నక్షత్రాలను ఫొటోలు తీయడం వంటివీ చేశారు. వీటన్నింటితోపాటు చేసిన మరో పరీక్షే బాంబులు వేయడం. అదెందుకో చూద్దామా.. గ్రనేడ్లు, మోర్టార్లతో.. అమెరికా చేసిన అపోలో 14, అపోలో 16 ప్రయోగాల్లో చంద్రుడిపైకి గ్రెనేడ్లు, మోర్టార్లు పంపారు. చంద్రుడిపై వ్యోమగాములు దిగిన ప్రదేశం నుంచి ఒకసారి కిలోమీటర్ దూరంలో, మరోసారి 3.5 కిలోమీటర్ల దూరంలో వాటిని పేల్చారు. రోవర్‌ను నడుపుకొంటూ వెళ్లి వాటిని అమర్చారు. ఇదంతా చంద్రుడి నేల నిర్మాణాన్ని పరిశీలించేందుకు చేపట్టిన ‘యాక్టివ్ సిస్మిక్ ఎక్స్పెరిమెంట్’లో భాగమే. బాంబులు పేలిన తర్వాత అక్కడి నేలలో ఏర్పడిన ప్రకంపనలను ప్రత్యేక పరికరాలతో నమోదు చేశారు. తర్వాత నాసా శాస్త్రవేత్తలు ఆ డేటాను విశ్లేషించి చంద్రుడి ఉపరితలం నిర్మాణాన్ని అంచనా వేశారు. ప్రయోగాల్లో తేలింది ఏమిటి? సాధారణంగా భూమిలో ఏర్పడిన ప్రకంపనలతో ప్రత్యేకమైన తరంగాలు (సిస్మిక్ వేవ్స్) ఏర్పడి.. నేల పొరల ద్వారా ప్రయాణిస్తాయి. ఈ తరంగాలు ఘన, ద్రవ పదార్థాలు, వివిధ మూలకాల ద్వారా వెళ్లేటప్పుడు వాటి వేగం, తీవ్రతలో మార్పులు వస్తాయి. శాస్త్రవేత్తలు దీనిని విశ్లేషించి నేల పొరల్లో ఏముంది, ఎలా ఉన్నాయన్నది గుర్తిస్తారు. ► భూమ్మీద సహజంగానే భూకంపాలు వస్తుంటాయి కాబట్టి.. శాస్త్రవేత్తలు సులువుగానే విశ్లేషిస్తారు. అదే చంద్రుడి నేల స్థిరంగా ఉండటంతో ప్రకంపనలు అతి తక్కువ. అందువల్ల బాంబులతో ప్రకంపనలు సృష్టించి, పరిశీలించారు. ► బాంబులు పేల్చిన ప్రాంతంలో 1.4 కిలోమీటర్ల మందంతో బసాల్ట్ (భూమిపై ఉండే తరహాలో మట్టి, రాళ్లతో కూడిన) పొర ఉన్నట్టు గుర్తించారు. చంద్రుడి నేల లోపల చాలా వరకు పగుళ్లు ఉన్నట్టు తేల్చారు. చంద్రుడిపై పడిన పెద్ద పెద్ద ఉల్కలే దీనికి కారణమని అంచనా వేశారు. ఆ బాంబులు ఇప్పటికీ అక్కడే.. అపోలో 14 మిషన్‌లో 22 గ్రనేడ్లు, ఒక మోర్టార్ తీసుకెళ్లారు. అందులో 13 గ్రనేడ్లు మాత్రమే పేలాయి. అపోలో 16 మిషన్‌లో మరో 22 గ్రనేడ్లు, 4 మోర్టార్లు తీసుకెళ్లారు. ఇందులో 19 గ్రనేడ్లు, 3 మోర్టార్లు పేలాయి. రెండుసార్లు కలిపి 12 గ్రనేడ్లు, రెండు మోర్టార్లు అలాగే చంద్రుడిపై పడి ఉన్నాయి. వీటన్నింటిలో ‘హెక్సానైట్రోస్టిల్బేన్’ అనే పేలుడు పదార్థం ఉంది. దానికి ఎక్కువ వేడిని తట్టుకునే శక్తి ఉండటంతో.. ఇప్పటికీ గ్రనేడ్లు, బాంబులు చంద్రుడిపై అలాగే ఉండి ఉంటాయని భావిస్తున్నారు. రెండు దేశాలు.. ఏడు జెండాలు చందమామపై రెండు దేశాల జెండాలు మాత్రమే ఉన్నాయి. ఆరు మిషన్లలో వేర్వేరు చోట్ల దిగిన అమెరికా వ్యోమగాములు ప్రతిసారి తమ దేశ జెండా ఒకదానిని పాతారు. తర్వాత చైనా తమ జెండాను చంద్రుడిపై పాతింది. అయితే చైనా వ్యోమగాములెవరూ చంద్రుడిపై దిగలేదు. కానీ రోవర్ ద్వారా పంపిన జెండాను పెట్టారు. ఇప్పటివరకు ఆరు ప్రయోగాల్లో చంద్రుడిపై మనుషులు దిగారు. అవన్నీ అమెరికా నిర్వహించిన అపోలో సిరీస్ మిషన్లే. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
వ్యోమగాములకు తప్పని క్వారంటైన్
వాషింగ్టన్: కోవిడ్ -19 దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మానవ జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. కోవిడ్ -19 పుణ్యమా ... క్వారంటైన్, సోషల్ డిస్టన్స్, లాక్డౌన్, వంటి పదాలు మన జీవితంతో భాగమయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కచ్చితంగా క్వారంటైన్ చేయాల్సి వచ్చేది. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారినే క్వారంటైన్ చేశారనుకుంటే మీరు పొరపడినట్లే..! చంద్రునిపై 1969లో మొదటిసారిగా కాలుమోపిన ఆస్ట్రోనాట్స్ కూడా క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖగోళయాత్ర చేసి తిరిగి భూమి పైకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ బజ్ అల్ర్ర్డిన్ వ్యోమగాములను 21 రోజులపాటు క్యారంటైన్లో ఉంచారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ముప్పైతొమ్మిదో పుట్టినరోజు వేడుకలను కుటుంబానికి దూరంగా ఉండి జరుపుకున్నాడు. క్వారంటైన్ మనకు కొత్తగా ఉన్న , వ్యోమగాములకు మాత్రం సాధారణమే. క్వారంటైన్ ఎందుకు ఉండాల్సివచ్చిందంటే... అపోలో-11 మిషన్ వ్యోమగాములు చంద్రునిపై ఉన్న వాతావరణం, లూనార్ పదార్థాలతో మొదటిసారిగా గడిపారు.వ్యోమగాములను చంద్రునిపై ఉన్న హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ వారు అక్కడి వాతావరణానికి బహిర్గతమైతే అది భూమిపై ఉన్న మానవాళికి విపత్తుగా మారుతుంది.దీంతో ఖగోళయాత్ర అనంతరం ముగ్గురు వ్యోమగాములను క్వారంటైన్లో ఉంచారు. వారిని వైద్యులు నిశితంగా పరిశీలించారు.మరొక బృందం అపోలో-11 మిషన్ తీసుకొచ్చిన రాళ్లు, ధూళిని పరీక్షించి అధ్యయనం చేశారు. చంద్రునిపై తెలియని అంశాలు , హానికరమైన బ్యాక్టీరియాను పక్కన పెడితే, వ్యోమగాములు చంద్ర నమూనాలను సేకరించినప్పుడు వారికి తెలియకుండానే తీసుకువచ్చే అంశాలు వారి జీవితాన్ని భంగం కలిగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అపోలో -12 , అపోలో -14 మిషన్లకు మూన్ ల్యాండింగ్ తరువాత తిరిగివచ్చే వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగింది. కొన్నిరోజుల తరువాత అపోలో ప్రోగ్రాం తదుపరి మిషన్ల వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగలేదు ఎందుకంటే అంతరిక్షంలో ప్రమాదకరమైన అంశాలు లేవని పరిశోధకులు భరోసా ఇచ్చిన వెంటనే క్వారంటైన్‌ను నిలిపివేశారు.‘అపోలో 11: క్వారంటైన్’ అనే డాక్యుమెంటరీ మార్చి 6 న ప్రముఖ ఆంగ్ల చానల్లో ప్రసారమయ్యింది. -
చందమామ అందివచ్చిన రోజు
సాక్షి, హైదరాబాద్ : గగనాంతర రోదసిలో గంధర్వలోక గతులు దాటేందుకు మనిషి వేసిన తొలి అడుగుకు నేటితో అక్షరాలా 51 ఏళ్లు!. అపోలో –11 మిషన్‌తో జాబిల్లిపై మనిషి తొలిసారి పాదం మోపింది 1969 జూలై 20న.. అంటే రేపటి రోజున!. ఆ తరువాతా బోలెడన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి కానీ.. ఇంకో గ్రహంపై అడుగు వేసిన ఘట నలు మాత్రం లేవు. జాబిల్లిపై అప్పటి ఆసక్తి ఎందుకు? ఇప్పుడేం జరుగుతోంది! రేపు ఏం జరగబోతోంది అనేది పరిశీలిస్తే.. హ్యాపీమూన్ జర్నీ జాన్ ఎఫ్ కెన్నడీ పేరు మనం వినే ఉంటాం. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి 1962లో హ్యూస్టన్‌లోని రైస్ స్టేడియంలో చేసిన ఓ ప్రసంగం అంతరిక్ష ప్రయోగాలను మేలిమలుపు తిప్పింది. ‘‘జాబిల్లిపైకి వెళ్లేందుకు నిశ్చయించాం’’ అని ఆ ప్రసంగంలో కెన్నడీ ప్రకటించారు. పదేళ్లలోపే ఈ ఘనతను సాధిస్తామన్న కెన్నడీ సంకల్పం మూడేళ్లకే నెరవేరింది కూడా. 1969 జూలై 16న నింగికెగసిన అపోలో–11 నాలుగు రోజుల తరువాత అంటే జూలై 20న జాబిల్లిని చేరడం.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జాబిల్లిపై తొలిసారి అడుగు మోపడం అన్నీ ఇప్పుడు చరిత్ర. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అపోలో–11 తరువాత కూడా మొత్తం 6 ప్రయోగాలు జరగ్గా ఇందులో ఐదు జాబిల్లిపై ల్యాండ్ అయ్యాయి. బోలెడంత మంది వ్యోమగాములు జాబిల్లి వరకూ వెళ్లారు. కొందరు అంతరిక్ష నౌకల నుంచి చందమామను వీక్షించడానికి పరిమితమైతే.. మరికొందరు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాదిరిగా అక్కడి నేలపై అడుగుపెట్టారు. కచ్చితంగా చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మొత్తం 24 మంది వ్యోమగాములు జాబిల్లి పరిసరాల్లోకి వెళ్లగలిగారు. ఇందులో 12 మంది మాత్రమే జాబిల్లిపై అడుగుపెట్టారు. మిగిలిన 12 మంది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వీక్షించేందుకే పరిమితమయ్యారు. 1972 డిసెంబర్లో ప్రయోగించిన అపోలో–17.. ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్‌తో కూడిన అపోలో –11 రికార్డులను బద్దలుకొట్టింది. వ్యోమగాములు అతి ఎక్కువ సమయం జాబిల్లిపై గడిపిన, ఎక్కువ మొత్తంలో నమూనాలు సేకరించిన ప్రాజెక్టు కూడా అపోలో –17నే. ఈ ప్రయోగం తరువాత మళ్లీ మనిషి జాబిల్లిపై అడుగిడలేదు. అపోలో –11 బడ్జెట్ 2,000 కోట్ల డాలర్ల వరకు ఉండగా ఇప్పటికీ అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు అంతే స్థాయిలో ఉండటం దీనికి కారణం. చెరిగిపోని ఆ ‘గురుతులు’ నిజమే! అమెరికా అపోలో– 11 ప్రయోగం నిజమా? కాదా? అనే దానిపైనా బో లెడన్ని కథనాలు ప్రచారం లో ఉన్నాయి. 4 అంశాలను పరిశీలిస్తే మానవుడు పలుమార్లు అక్కడ అడుగుపెట్టాడనేది స్పష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. మొద టిది మనిషి అడుగుల గురుతులు. భూమ్మీద ఇసుకపై అడుగుపెడితే ఆ గుర్తు కొంతకాలానికి చెరిగిపోతుంది. ఇక్కడ ‘వాతావరణం’ ఉంటుంది. నీళ్లు, గాలి కూడా ఇక్కడ మాత్ర మే ఉంటాయి. వీటన్నింటి కారణంగా అడుగుల గురుతులు కొంతకాలానికి చెరిగిపోతాయి. జాబిల్లిపై ఇవేవీ ఉండవు కాబట్టి అక్కడ ఎప్పుడో 51 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వేసిన అడుగు గుర్తు ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. రెండో ది.. 12 అపోలో ప్రయోగాల ద్వారా నాసా తీసిన 8 వేల ఫొటోలు. వీటిని నాసా అందరికీ అందుబాటులో ఉంచింది. మూడవది.. అపోలో ప్రాజెక్టుతోపాటు ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా జాబిల్లిపై వదిలేసిన పలు శోధక నౌక లు, శాస్త్ర పరికరాలు. అపోలో –11, 12, 14, 15, 16ల ద్వారా జాబిల్లిపైకి చేర్చిన సెసిమోమీటర్స్ 1977 వరకు భూమికి అక్కడి ప్రకంపనల సమాచారాన్ని ప్రసారం చేశా యి. భూమి నుంచి జాబిల్లికి ఉన్న దూరాన్ని సెంటీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో లెక్కిం చేందుకివి దోహదపడుతున్నాయి. చివరివి.. జాబిల్లిపై నుంచి తెచ్చుకున్న మట్టి, రాతి నమూనాలు. వీటన్నిటినీ పరిశీలించడం ద్వా రా శాస్త్రవేత్తలు జాబిల్లికి సంబంధించిన పలు అంశాలను అర్థం చేసుకోవడానికి, మరిన్ని పరిశోధనలకు వీలవుతోంది. ఇకపై మనిషి స్థానంలో రోబోలు? మనిషి జాబిల్లిపై చివరిసారి అడుగుపెట్టి 48 ఏళ్లవుతోంది. ఇక, భవిష్యత్తులో మానవ ప్రయోగాలతోపాటు అంతరి క్షాన్ని శోధించడం మొదలు విలువైన వనరులను మైనింగ్ చేయడం వరకు అన్నింటికీ టెక్నాలజీ సాయం తీ సుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్ర పంచవ్యాప్తంగా 70 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తుండ గా.. వీటిలో 13 సంస్థలకు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం ఉంది. స్పేస్ ఎక్స్ బ్లూఆరిజన్, వర్జిన్ గలాక్టిక్ వంటి ప్రైవే ట్ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు తోడు అంతరిక్ష పర్యాటకానికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 నాటికల్లా అంతరిక్షానికి సంబంధించిన మార్కెట్ విలువ 30 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. రానున్న యాభై ఏళ్ల లో సౌర కుటుంబాన్ని మాత్రమే కాకుండా దానికి ఆవల ఉన్న అంతరిక్షాన్ని కూడా అర్థం చేసుకో వాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర గ్రహాలు, తోకచుక్కల్లోని విలువైన వనరులను తవ్వి భూమ్మీదకు తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎలన్ మస్క్ వంటి వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని కట్టేస్తానని చెబుతున్నారు. నాసా 2024 నాటికి మరోసారి మనిషిని జాబిల్లిపైకి పంపడం మాత్రమే కాకుండా.. 2028 నాటికి అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. చైనా 2030 నాటికల్లా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను దింపాలని ప్రయత్నిస్తోంది. -
‘విక్రమ్’ చాంద్రాయణం చిరంజీవం!
‘‘చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి వేగాన్ని తట్టుకుని దాని ఉపరితలంపై దిగాల్సిన విక్రమ్ ల్యాండర్ ఆ వేగాన్ని అధిగమించలేక అమిత బలంతో చంద్రతలాన్ని ఢీకొని ఉంటుంది. ఫలితంగా చంద్రయాన్–2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’తో సంబం ధాల పునరుద్ధరణకు ప్రయత్నిస్తున్నాం.’’ – ఇస్రో ఛైర్మన్ కైలాసవదివు శివన్ ‘‘చంద్రుడి దక్షిణ ధృవంపై తొలిసారిగా కాలూనడం కోసం భారత్ రోదసీ ప్రయోగ కేంద్రం చేసిన ప్రయోగం ప్రశంసనీయం. అంతరిక్ష ప్రయోగాలన్నవి చాలా సంక్లిష్టమైనవైనప్ప టికీ ‘ఇస్రో’ తాజా ప్రయోగం అద్భుతం. దీనితో భారత ఇంజనీరింగ్ వ్యవస్థ నైపుణ్యం, సామర్థ్యం ప్రపంచం మొత్తానికి వెల్లడయింది’’ – అమెరికా పత్రికలు ‘న్యూయార్క్ టైమ్స్’, ‘వాషింగ్టన్ పోస్ట్’ అనాదిగా చేతికి దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న జాబిల్లిని చేరడానికి, వీలైతే చేజిక్కించుకోవడానికి వేల సంవత్సరాలుగా మాన వులు పడుతున్న తపనను, శాస్త్రవేత్తలు పడుతున్న తపనను, పోటా పోటీలను, అందుకు అంగలు పంగలుగా వేస్తున్న పరుగుల్ని చూస్తూ వచ్చాం. అందుకోసం తొక్కిన పుంతలు, ఆరాటపడిన పాలపుం తలూ ఎన్నెన్నో విన్నాం. ఆ చందమామ కోసం పాటలతో ఆరాటప డుతూ పాటలు అల్లుకున్నాం, దాన్ని దించి పిల్లల చేతిలో అల్లారు ముద్దుగా పెడదామని కలలు కన్నాం. దానిపేరిట పిల్లలకు ‘గోరు ముద్దలు’ తినిపించాం. గోగుపూలు తెచ్చిపెట్టమని ఆవాహనం చేశాం. చివరికి ఈ అన్వేషణ ఎందాకా వెళ్లిందంటే– పాలుపోక శశి చాటున ‘నిశి’లో ముసలమ్మ రాట్నం వడుకుతున్నట్టుగా ఓ పాలు పోని కథలల్లి భువిలోని పిల్లలకు.. మొన్న అర్ధ శతాబ్దం క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్ తొలి మానవులుగా చంద్రునిపై చంద్రమం డలాధిపతులుగా కాలుమోపే వరకూ అశాస్త్రీయమైన కుంటి సాకులు కథలుగానే చెబుతూ వచ్చాం. ఈ సందర్భంగా, అతి సామాన్య పేద వ్యవసాయ కుటుంబం నుంచి భారత రోదసీ పరిశోధనా శాస్త్రవేత్తగా ‘ఇస్రో’ అధినేత స్థాయికి ఎదిగివచ్చిన ప్రొఫెసర్ శివన్ ఆధ్వర్యంలో మన శాస్త్రవేత్తలు చంద్రయాన్–2 రోదసీ యాత్ర ద్వారా దాని ఆర్బి టర్ జీవితాన్ని ఉద్దేశించిన కాల వ్యవధి కన్నా మించి 6–7 సంవ త్సరాలు మనగలిగేటట్టు రూపొందించడం భారత విజ్ఞాన శాస్త్రం, ఇంజనీరింగ్ వ్యవస్థ సాధించిన ఘన విజయం. ఇదే సమయంలో, దేశంలో ఎలాంటి పాలనా వ్యవస్థ మనుగడ సాగించుకుంటున్న సమయంలో ఈ విజయం సాధ్యమయింది? దేశ నవీన విశ్వ విద్యాలయాల్లో, పరిశోధనా సంస్థల్లో, విద్యా వ్యవస్థలో, శాస్త్ర సాంకేతిక కేంద్రాలలో పురాణ కవిత్వాలు విన్పించడానికి ప్రయ త్నాలు ముమ్మరంగా సాగుతున్న సమయంలో, శరవేగాన విస్తరి స్తున్న ప్రకృతి పరిణామవాద సిద్ధాంతాల్ని, అంతరిక్ష విజ్ఞాన శాస్త్రం, ఖగోళ విజ్ఞాన శాస్త్రాన్ని రోదసీ పరిశోధనలో మానవుడు సాధిస్తున్న విజయ పరంపరను గేలి చేస్తున్న కొందరు మూఢులు పాలనా వ్యవస్థలో తిష్ట వేసి ఉన్నప్పుడు, పాలనా వ్యవస్థలో చరిత్ర గతిని, దేశ ప్రగతిని పక్కదారులు తొక్కించడానికి విశ్వప్రయత్నం చేస్తున్నప్పుడు.. మన ‘ఇస్రో’ శాస్త్రవేత్తలు అమోఘ ప్రయోగ వైచిత్రిలో ముందుకు దూసుకుపోతున్నారు. ఈ పాలకుల్లో ఒకరు వేదాల పేరిట చార్లెస్ డార్విన్ పరిణామవాదాన్ని తిరస్కరిస్తాడు, మరొక పాలక మండలి సభ్యుడు స్టీఫెన్ హాకింగ్ ఖగోళ శాస్త్ర విజ్ఞానాన్ని రూఢమైన ‘బ్లాక్‌హోల్స్ (నల్ల బిలాలు)’ సిద్ధాంత తారళ్యతనూ ప్రశ్నిస్తాడు. మరొక ముక్కలో చెప్పాలంటే చరిత్రను, చరిత్ర పాఠాల్ని న్యూనపరుస్తూ దేశ చరిత్రకు ‘సున్న’ చుట్టి మూఢ విశ్వాసాల వ్యాప్తికి పాఠ్య గ్రంథాల్లో పెద్దపీట వేయమంటాడు మరొక పాలకమండలి ‘విజ్ఞాని’! మరో పురాణ ‘విజ్ఞాని’ వినాయకుడికి ఏనాడో ‘ప్లాస్టిక్ సర్జరీ’ చేసినందున ఆ స్వరూపం వచ్చిందంటాడు. నిజానికి ఆరెస్సెస్–బీజేపీ ‘హిందూత్వ’ పాక్షిక మత రాజకీయాల ఫలితంగా పూర్వ వైదికంలోని మీమాంస పరిజ్ఞానం, ఉపనిషత్తులలోని ప్రశ్నోత్తర సంవాద సంప్రదాయాల ద్వారా అను మాన నివృత్తి అవకాశాలు కూడా నేటి భారతంలో అడుగంటిపోయి, మూఢత్వం చాటలతో చెలుగుతూ స్వైర విహారం చేస్తోంది. మాన వుణ్ణి తొలిసారిగా చరిత్రలో చంద్రాధినేతగా నిలిపినవారు తొలి అమె రికన్ ఆస్ట్రోనాట్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ (1969 జూలై 20) కాగా, రోదసీలో కాలుమోపి, భూమిని చుట్టి జయించిన తొలి మానవుడు సోషలిస్టు సోవియట్ యూనియన్ పౌరుడైన యూరీ గగారిన్ (1961 ఏప్రిల్), ఆ పిమ్మట మేడం వలెంటీనా, అంతకుముందు రోదసీలో వాతావ రణ పరిస్థితులు జీవరాశిపై ఎలాంటి ప్రభావం చూపిస్తాయో పరీక్షిం చడానికి సోవియట్ ‘లైకా’ (కుక్క)తో జరిపిన సఫల ప్రయోగమూ! ఆ వరసనే రోదసీ గుహ్వరంలోని పలు రకాల పాలపుంతలకు (గెలా క్సీలు), గ్రహరాశులకు మానవులు యాత్రలు జరపడానికి రకరకాల ప్రయత్నాలలో ఉన్నారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌కు ఎదురైన విచిత్ర అనుభవం! తొలిసారి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై కాలూనడానికి బయలుదేరే ముందు భూమ్మీద జరిపిన శాస్త్ర ప్రయోగ, తర్ఫీదు విన్యాసాల సంద ర్భంగా ఒక విచిత్రానుభవం కల్గింది. అమెరికా పశ్చిమ ప్రాంతాల్లోని ఓ మారుమూల ఎడారి ప్రాంతంలో ఆర్మ్‌స్ట్రాంగ్ అభ్యాస శిక్షణలో ఉన్నాడు. అతను శిక్షణ పొందుతున్న ప్రాంతం అనేకమంది అమెరి కన్ ఆదివాసీ (స్థానిక) తెగల నివాస కేంద్రం. ఆర్మ్‌స్ట్రాంగ్ బృందానికి వారికి మధ్య సాగిన సంభాషణ ఒక ఐతిహ్యంగానే చెప్పుకోవచ్చు. శిక్షణలో ఉన్న రోదసీ యాత్రికులైన ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లను ఆ స్థానిక ఆదివాసీ అడిగాడు: ‘ఇంతకూ మీరిక్కడ ఏం చేస్తున్నారు’ అని. అందుకు ఆర్మ్‌స్ట్రాంగ్ సమాధానమిస్తూ ‘త్వరలో చంద్రుడి ఉనికి తబిశీళ్లను కనుక్కోడానికి చేసే ప్రయత్నంలో శిక్షణ పొందు తున్నాం’ అన్నాడు. అందుకు నిర్ఘాంతపోయిన ఆదివాసీ ‘నాకో పని చేసి పెడతావా’ అని అడిగాడు. ‘మీకేం కావాలి?’ అని అడిగాడు ఆర్మ్ స్ట్రాంగ్. అందుకు ఆదివాసీ పెద్ద ‘ఆ చంద్రునిపైన కొన్ని పవిత్ర ఆత్మలు, శక్తులూ నివసిస్తుంటాయి. వాటికి మా ప్రజలిచ్చే ఓ ముఖ్య సందేశాన్ని మీరు అందజేస్తారా’ అని ప్రశ్నించాడు. ఆస్ట్రోనాట్ ఆర్మ్‌స్ట్రాంగ్: చెప్పండి, ఆ సందేశం ఏమిటో అన్నాడు కానీ ఆదివాసీ పెద్ద మనిషి ఆదివాసీ తెగల భాషలో మాట్లాడుతూ ‘మీరు విన్నదేమిటో ఒకటికి రెండుసార్లు చెప్పండి’ అన్నాడు. ‘మాకర్థం కావడం లేదు. ఇంతకూ మీరు ఏం చెబుతున్నారు?’ అనడి గాడు ఆస్ట్రోనాట్. ఆదివాసీ పెద్ద ‘అదో రహస్యం, ఆ చంద్రుడిలో దాగిన ఆ శక్తులు, ఆత్మలకు మాత్రమే మా భాష అర్థమవుతుంది’ అన్నాడు. దాంతో తికమకైపోయిన ఆస్ట్రోనాట్స్ తిరిగి తమ స్థానిక క్యాంపుకు వెళ్లిపోయి, ఆదివాసీ తెగల భాషలో మాట్లాడగల వ్యక్తి కోసం గాలించి కనిపెట్టారు. ఇంతకూ ఆ చంద్రునిలో దాగిన ఆ అజ్ఞాత శక్తులు అందించే సందేశం ఏమిటో అనువదించి చెప్పమ న్నారు ఆస్ట్రోనాట్స్. అలా వాళ్ల భాషని ఆస్ట్రోనాట్స్ పదే పదే వల్లి స్తుంటే ఆ ఆదివాసీ దుబాసీ విరగబడి నవ్వేశాడు. ఎందుకని? ఆ ఆదివాసీ పెద్ద అన్న మాటకు అసలు అర్థం– ‘ఆస్ట్రోనాట్స్ చెప్పే ఏ మాటా నమ్మొద్దు. రోదసీ యాత్రికుల పేరుతో వచ్చిన వీళ్లు మన ఆది వాసీల భూముల్ని కాజేయడానికి వచ్చినవాళ్లు’ అని ఆ ఆదివాసీ మాటల అర్థమట! వలస వాదంపై ఇదో వ్యంగ్యాస్త్రం. క్రీ.శ. 1500 సంవత్సరందాకా మానవులు ఈ భూమి ఉపరిత లాన్ని అధిగమించి పోనివాళ్లే. మççహా అయితే పెద్ద పెద్ద కోటలు, దుర్గాల నిర్మాణానికి, పర్వతారోహణకు పరిమితమైనవాళ్లు. ఆకాశ తలాన్ని మాత్రం పక్షులకు, పరమాత్మలకు ఏ దేవదూతలకో వదిలేసే వాళ్లు. ఇప్పుడలా కాదుగదా, రోదసీలో నక్షత్రాల దీవి ‘ఆండ్రోమీడా’ దీవికేసి, పాలపుంత (మిల్కీవే) కేసి శాస్త్ర పరిశోధకులు మెడలు రిక్కించి చూడగల్గుతున్నారు. లక్షల కాంతి సంవత్సరాల వ్యాసార్థం గల నక్షత్ర రాశిని లెక్కగట్టి గుర్తించగలుగుతున్నారు. శాస్త్ర పరిశోధనల్లో, ప్రయోగాల్లో జయాపజయాలు కావడి కుండ ల్లాంటివి. అందుకే ప్రస్తుత చంద్రయాన్–2 ప్రయోగంలో చంద్రుని పార్శా్వలకి చేరువదాకా వెళ్లినట్టు వెళ్లి, తొట్రుపాటుకు గురైన తాత్కా లిక అంతరాయాన్ని దృష్టిలో పెట్టుకుని శాస్త్ర విశ్లేషకుడు, వ్యాఖ్యాత వాసుదేవన్ ముకుంత ఇలా అలంకారప్రాయంగా అని ఉంటాడు. ‘‘తాత్కాలిక ఉప్పెనలకు ఎంత దూరంగా ఉంటే వీచే ఈదురుగాలు లకూ అంత దూరంగా ఉండగల్గుతాం’’! అంతేగాదు, చంద్రుని దక్షిణ దిక్కులో పరిశోధనలకు ప్రయత్నించిన చంద్రయాన్–2 ‘విక్రమ్’ ల్యాండ్ రోవర్ ప్రయాణం దాదాపు 95 శాతం వరకూ సజా వుగా జరిగి చివరి క్షణంలో అనూహ్యంగా సశేషంగా ముగింపునకు వచ్చిన యాత్ర సందర్భంగా డాక్టర్ శివన్ హుందాగా, ఒద్దికగా చేసిన ప్రకటన ప్రశంసార్హం. ఆయన మాటల్లోనే ‘‘ఇదే ఆఖరి యత్నం కాదు, చంద్రుని దగ్గరకు మరో యాత్రను ఇస్రో నిర్వహించనున్నది. మానవుణ్ణి ఇస్రో రోదసీయాత్రకు సిద్ధం చేసే కార్యక్రమం ప్రాథమిక దశలో ఉంది, అలాగే రోదసీపై రోబోటిక్ ప్రయోగం కూడా పరిశో ధనలో ఉంది. చంద్ర, అంగారక గ్రహరాశికి ఇండియా 21వ శతాబ్ది లోనే దూసుకుపోయే దశలో ఉంది’’ అందుకే మహాకవి వాక్కు (1954) దార్శనిక దృక్కు. ‘‘చంద్ర మండలానికి ప్రయాణం/ సాధించరాని స్వప్నం కాదు/ గాలికన్నా బరువైన వస్తువుని/ నేలమీద పడకుండా నిలబెట్టడం లేదూ!/ అయితే ఇక్కడ మా భూలోకంలో అంతా బాగానే ఉందని/ అంతా సుఖంగానే ఉన్నారని/ అన్నానంటే మాత్రం అది/ అబద్ధమే అవుతుంది/ దరి ద్రాల శాతం ఇంకా/ చిరాకు కలిగిస్తూనే ఉంది’’! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
జాబిలిపై మొదటి అడుగు అతనిదే
-
1969 : ఎ లవ్ స్టోరీ
మనిషి చందమామను అందుకొని ఇప్పటికి యాభ య్యేళ్లయింది. ఆ వెన్నెల రాజును తాకాలన్నది ఏనాటి కోరిక? రామాయణ కాలం నుంచయితే మనకు తెలుసు. చందమామను తెచ్చి తన చేతికి ఇస్తే తప్ప అన్నం తినేది లేదని ఒకసారి బాలశ్రీరాముడు మారాం చేశాడట. పిన్నమ్మలూ, తల్లీ, తండ్రీ ఎంత బతిమాలినా వినలేదట. చివరకు సుమంతుడు అనే మంత్రి ఒక అద్దం తెచ్చి అందులో చంద్రబింబాన్ని రాముడికి చూపించాడట. చంద్రుడు తన చేతికి అందాడని రామచంద్రుడు సంబర పడ్డాడట. ఆనాటికే మనిషి మస్తిష్కంలో చంద్రుడిని చేరుకోవాలన్న కాంక్ష నాటుకొనిపోయింది. వేలయేళ్లు గడిచిన తర్వాత 1969 జూలై 20వ తారీకున ఆ కోరిక నెరవేరింది. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అనే అమెరికా వ్యోమగామి ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే మరో సహచరునితో కలిసి చంద్రమండలం మీద కాలుమోపాడు. మరో సహచరుడు మైకేల్ కోలిన్స్ కక్ష్యలో తిరుగుతూ అపురూప దృశ్యాలను ఫొటోలు తీశాడు. 1969 ఒక మైలురాయిలాగా మానవ చరిత్రలో మిగిలిపోయింది. 1960వ దశకానికి ఒక అద్భుతమైన ముగింపు అరవై తొమ్మిది. అలజడితో, ఆలోచనతో, ఆవేశంతో ఎగసిపడిన అరవయ్యో దశకపు పెనుకెరటంపై మెరుపు నురగ అరవై తొమ్మిది. ఆ దశాబ్ది ప్రతినిధి అరవై తొమ్మిది. యాభయ్యేళ్లు గడిచిన సందర్భంగా 69 గురించి మాట్లాడుకోవడం అంటే ఆ మొత్తం దశాబ్ది పరిణామాల సమాహారాన్ని పరామర్శిం చడమే. అనంతకాల గమనంలో దశాబ్ది సమయం ఒక రెప్పపాటు మాత్రమే. కానీ, ఈ దశాబ్ది మాత్రం ఓ రెక్క విప్పిన రివల్యూషన్! అరవయ్యో దశకానికి సంబంధించి కొంతమంది సంప్రదాయవాదులకు కొన్ని భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ దశాబ్ది ఉద్యమాల్లో పెడధోరణులున్నాయనీ, సాంఘిక కట్టుబాట్లను భ్రష్టుపట్టించే లక్షణాలున్నాయన్న విమర్శలు వచ్చాయి. నిజానికి, ఆ ఉద్యమాలు స్వాభావికంగానే ధిక్కార స్వరాలు. అసమానతల పునాదులపై ఏర్పడిన సాంఘిక కట్టుబాట్లపై ధిక్కారం. సంకుచిత భావనలపై ధిక్కారం. వివక్షపై ధిక్కారం! ఈ ఉద్యమాల మరో ముఖ్య లక్షణం విశ్వ మానవ సౌభ్రాతృత్వం. రెండో ప్రపంచ యుద్ధకాలంలో, ఆ తర్వాత కాలంలో పుట్టి పెరిగిన తరం ప్రధానంగా ఈ ధిక్కార స్వరాన్ని వినిపించింది. అంతర్లీనంగా ఆర్థిక కారణాలు వున్నప్పటికీ, మితిమీరిన జాతీయ దురహంకారమే రెండో ప్రపంచ యుద్ధానికి దారితీసింది. ఐదుకోట్ల మంది ప్రాణాలు బలితీసుకున్న మహా మహమ్మారి ఈ యుద్ధం. అందుకే యుద్ధాన్ని ఈ తరం అసహ్యించుకుంది. జాత్యహంకారాన్ని ఈసడించు కుంది. వియత్నాంపై అమెరికా చేస్తున్న దురాక్రమణ యుద్ధానికి వ్యతిరేకంగా లక్షలాదిమంది అమెరికా విద్యా ర్థులే వీధుల్లోకి వచ్చారు. తమ నేలపై అంగుళం ఖాళీ వద లకుండా అగ్రరాజ్యం బాంబులతో తూట్లు పొడుస్తుంటే, ఆ చిన్నారి దేశం తలవంచకుండా ప్రతిఘటిస్తున్న తీరును యావత్తు ప్రపంచం ఆశ్చర్యచకితమై చూసింది. అమెరికా చేస్తున్న యుద్ధానికి వ్యతిరేకంగా సకల దేశాల్లోని ప్రజలు – ముఖ్యంగా యువకులు నిరసన ప్రదర్శనలు చేశారు. యుద్ధ వ్యతిరేక సందేశాన్ని అమెరికా యువతరం కూడా అందుకుంది. వియత్నాం నుంచి అమెరికా సేనలు తప్పు కోవాలని కోరుతూ తీసిన ఊరేగింపుల్లో లక్షల సంఖ్యలో విద్యార్థులు, యువకులు పాల్గొన్నారు. అమెరికా సైనికుల కుటుంబాలు కూడా ఈ నిరసనల్లో పాల్గొనడం విశేషం. చేగువేరా ఒక కమ్యూనిస్టు విప్లవకారుడు, పుట్టింది అర్జెంటీనాలో. చదివింది వైద్యశాస్త్రం. ‘బాటిస్టా’ ప్రభుత్వా నికి వ్యతిరేకంగా క్యూబా విప్లవకారులు కాస్ట్రో నాయ కత్వంలో సాగిస్తున్న పోరాటంలో పాల్గొన్నాడు. విప్లవ ప్రభుత్వంలో కొంతకాలం మంత్రిగా చేశాడు. కానీ ఒక చిన్న దేశంలో సోషలిస్టు ప్రభుత్వం ఏర్పడితే, దానిని, సామ్రాజ్యవాదం బతకనివ్వదని చే భావించాడు. ఏక కాలంలో అనేక దేశాల్లో విప్లవ పోరాటాలు జరగాలని, పెద్దసంఖ్యలో సోషలిస్టు వ్యవస్థలు ఏర్పడాలనీ, అప్పుడే అవి మనగలుగుతాయని చే ఆలోచన. వెంటనే క్యూబాలో మంత్రిపదవి వదిలేశాడు. మొదట కాంగోలో కొన్ని ప్రయ త్నాలు చేశాడు. తర్వాత బొలీవియాకు చేరుకున్నాడు. అక్కడ సీఐఏ ఏజెంట్లు గువేరాను చంపించారు. చేగువేరా ఒక ధిక్కారస్వరమే కాదు, ఒక ధిక్కార సంస్కృతికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. పొడవైన వేలాడే జుట్టు, నక్షత్రం మార్కు ఎర్రటోపీ, గడ్డం, మీసాలు, హవాయి చుట్ట.. దేశదేశాల్లోని యువతరం అనుకరించిన రూపం అది. ఆయన చనిపోయి యాభయ్యేళ్లు దాటినా, ఆయన బొమ్మ వున్న టీ–షర్టులకు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా బోలెడు డిమాండ్ వుంది. ఆయనకొక దేశం లేదు. ఆయనొక విశ్వమానవ సందేశం. ఇరవయ్యో శతాబ్దపు అమెరికన్ ధ్రువతార మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్. న్లలజాతీ యుల పట్ల దుర్మార్గమైన వివక్షకు వ్యతిరేకంగా ఆయన చేసిన పౌరహక్కుల పోరాటం ప్రధాన ఘట్టాలన్నీ అర వయ్యో దశకంలోనే చోటుచేసుకున్నాయి. భారత జాతిపిత మహాత్మాగాంధీ నుంచి సహాయ నిరాకరణ, అహింసా యుత పోరాట రూపాలను కింగ్ అరువు తెచ్చుకున్నారు. ఆయన చేసిన ‘ఐ హ్యావ్ ఏ డ్రీమ్...’ అనే ప్రసిద్ధ ప్రసంగం సమతావాద వేదం లాంటిది. మార్టిన్ లూథర్ చేసిన గాంధేయ పోరాటాలకు తలవొగ్గి లిండన్ జాన్సన్ ప్రభుత్వం ఆ దశాబ్దిలోనే కొన్ని పౌరహక్కుల చట్టాలను చేయాల్సి వచ్చింది. చివరకు ఒక దురహంకారి కాల్పులకు నేలకొరిగిన మార్టిన్ లూథర్‌కింగ్ జూనియర్ రెపరెపలాడే పౌరహక్కుల పతాకం. ఆ పతాకానికి ఎల్లలు లేవు. స్త్రీవాద ఉద్యమాలు శిరమెత్తింది కూడా ఈ దశాబ్ద కాలంలోనే. ఉద్యోగాల్లో స్త్రీల పట్ల కొనసాగుతున్న వివక్షపై అమెరికా మహిళా లోకంలో తీవ్ర అసంతృప్తి పేరుకుని వున్న సమయంలో బెట్టీఫ్రీడన్ రాసిన ‘ది ఫెమినైన్ మిస్టిక్’ అనే పుస్తకం 1963లో వెలువడి ప్రకంపనలు సృష్టించింది. అంతకుముందే ఫ్రెంచి ఫెమినిస్ట్ సిమోన్ ది బోవా రాసిన ‘ది సెకండ్ సెక్స్’ను మించిన సంచలనం సృష్టించిన రచన ఇది. ఆకాలంలో చెలరేగిన మహిళా ఉద్యమాల పర్యవసా నంగా ఉద్యోగాల్లో కొనసాగుతున్న లింగవివక్ష 1964లో అంతమైంది. రాజకీయ, సామాజిక రంగాలతోపాటు సాంస్కృతిక రంగంలోకి కూడా ధిక్కార సంస్కృతి ప్రవే శించింది. సంగీతంలోనూ, జీవనశైలిలోనూ అది ప్రభావం చూపింది. ఈకాలంలో ప్రపంచాన్ని బ్రిటన్ దేశపు ‘ది బీటిల్స్’ బ్యాండ్ ఉర్రూతలూగించింది. పాప్ సంగీతానికి కళాత్మకతను అద్దిన ‘బీటిల్స్’ దేశదేశాల సంగీత రీతులను తనలో మిళితం చేసుకుంది. అందులో భారతీయ సంగీత ఛాయలు కూడా వున్నాయి. ఈ గాయకులు కొంతకాలం పాటు రుషికేశ్‌లోని ఒక ఆశ్రమంలో వుండి యోగా, ధ్యానం కూడా కూడా నేర్చుకున్నారట. అక్కడే దాదాపు ముప్ఫై పాటల వరకు స్వరపరచారని చెపుతారు. అమెరికా సామా జిక వ్యవస్థలోని అసమానతలపై వైముఖ్యం, అప్పటి సంఘ కట్టుబాట్లపై నిరసన, వియత్నాంపై అమెరికా యుద్ధం పట్ల వ్యతిరేకత, ఇలాంటివన్నీ కలిసి అప్పటి యువతవరంలో హిప్పీ స్టయిల్ పేరుతో ఒక ధిక్కార సంస్కృతి ప్రవేశించింది. అనతికాలంలోనే ఈ సంస్కృతి చాలా దేశాల్లోకి ప్రవేశించింది. భుజాల దాకా వేలాడే తైల సంస్కారం లేని జుట్టు, గడ్డం, మీసాలు, బెల్‌బాటమ్ ప్యాంట్లు, ముదురు రంగుల పెద్ద కాలర్ షర్టులు.. ఒక విచిత్ర వేషధారణ వుండేది. స్వేచ్ఛ, సమానత్వం పునాది గానే ఈ ధిక్కార జీవనశైలి పుట్టినప్పటికీ, విచ్చలవిడితనం, మాదకద్రవ్యాల అలవాటు వల్ల ప్రధాన జీవన స్రసంతి అభిశంసనకు గురై, కొంతకాలం తర్వాత అంతరించి పోయింది. అరవయ్యో దశకపు ఉద్యమ కెరటాలు అమెరికాతో పాటు దాదాపు మొత్తం ప్రపంచాన్ని తాకాయి. యూరప్‌లో నయితే ఫ్రాన్స్, ఇటలీ, బ్రిటన్, పోలండ్, యుగోస్లేవియా దేశాలను విద్యార్థి ఉద్యమాలు అట్టుడికించాయి. ఫ్రాన్స్‌లో విద్యార్థులకు ట్రేడ్ యూనియన్లు కూడా జతకలవడంతో 1968లో చార్లెస్ డీగాల్ ప్రభుత్వం దాదాపుగా పతనం అంచులకు చేరుకుంది. ఐరోపా దేశాలకు వలసలుగా వున్న ఆఫ్రికా దేశాల్లో 32 దేశాలు ఈ దశాబ్దంలో స్వతంత్ర రాజ్యాలుగా అవతరించాయి. ఈ మహత్తర పరిణామం వెనుక ఐరోపా దేశాల్లోని అంతర్గత ఉద్యమాల పాత్రను విస్మరించలేము. మావోజెడాంగ్ నాయకత్వంలోని చైనాలో సాంస్కృతిక విప్లవం నడిచిన కాలం కూడా ఇదే. అది వికటించడం ఒక విషాదం. ప్రపంచమంతటా అప్పుడు వీచిన గాలుల ప్రభావం భారత్‌పై కూడా వుంది. ఇందిరా గాంధీ ప్రభుత్వం పూర్వపు సంస్థానాధీశులకు ఇచ్చే రాజ భరణాలను రద్దుచేసి, బ్యాంకులను జాతీయం చేసింది 1969లోనే. పర్యవసానంగా బ్యాంకులు సామాన్యులకు కొంత చేరువై బర్రెలు, గొర్రెలు కొనుక్కునేందుకు రుణా లిచ్చాయి. బొలీవియాలో చేగువేరా హత్యకు గురైన సంవ త్సరమే భారతదేశంలో చారుమజుందార్ నాయకత్వంలో నక్సల్బరీ అలజడి ప్రారంభమవడం కాకతాళీయమైనా, ఆ వేడి యాభయ్యేళ్లు దాటినా ఇంకా చల్లారక పోవడం విశేషం.1960వ దశకం పరిణామాల్లో కొన్ని పెడధోరణులు వున్నప్పటికీ, ఆ దశాబ్దం ఎలుగెత్తి చాటిన స్వేచ్ఛ, సమా నత్వం, సోదరభావం అనే భావనలు సర్వకాలాలకూ, సకల మానవులకూ శిరోధార్యాలు. ఆలోచనలకు సంకెళ్లు లేని, భావాలకు సరిహద్దులు లేని, సంగీతానికి భాషాభేదం లేని, జీవనశైలికి జాతీయ దురహంకారం లేని ఒక వసుధైక కుటుంబాన్ని కలలుగన్న 1969 (60వ దశకం ముగింపు)కి స్వర్ణోత్సవ శుభాకాంక్షలు చెబుతూ... భయంతో, ఆందో ళనలతో కూడిన చిన్న ఉపసంహారం – జాతీయవాదం ముదిరితే తీవ్ర జాతీయవాదం, అది ముదిరితే జాతీయ దురహంకారం. గతంలో జరిగిన ప్రపంచ యుద్ధాలకు జాతీయ దురహంకారమే ప్రధాన కారణం. తీవ్ర జాతీ యవాదం దిశగా ప్రపంచ దేశాలు అడుగులు వేస్తున్న దృశ్యం కనబడుతున్నది. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, ఇండియా... ఇంకా అనేక దేశాలు ఈ దిశలోనే అడుగులు వేస్తున్నాయి. ఈ అడుగుల వడి పెరిగితే, ఇక మెదళ్లపై నిఘా వేసి, హృదయాలకు సంకెళ్లు వేసే పీడ రోజులు దగ్గరపడినట్లే. వ్యాసకర్త: వర్ధెల్లి మురళి ఈ-మెయిల్: muralivardelli@yahoo.co.in -
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణం; రహస్య ఒప్పందం?!
వాషింగ్టన్ : చంద్రుడిపై తొలి అడుగు పెట్టిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మరణంపై ఓ సంచలన వార్త వెలుగులోకి వచ్చింది. 2012లో అనారోగ్య కారణాల వల్ల ఆయన మరణించిన విషయం తెలిసిందే. హృద్రోగంతో ఓహియోలోని ఓ ఆస్పత్రిలో చేరిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్(82).. సర్జరీ అనంతరం చోటుచేసుకున్న సైడ్ ఎఫెక్ట్ కారణంగా మృతి చెందినట్లు న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. అదే విధంగా ఈ విషయం గురించి నీల్ కుటుంబ సభ్యులకు ముందే తెలుసునని... ఈ మేరకు నీల్ మరణం తర్వాత రావాల్సిన పరిహారంపై అతడి కుటుంబ సభ్యులు ఆస్పత్రి యాజమాన్యంతో ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొంది. సర్జరీ విఫలమైన నేపథ్యంలో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచేందుకు... హెల్త్‌కేర్ ప్రొవైడర్లతో భాగస్వామ్యమైన సదరు ఆస్పత్రి వారికి దాదాపు 6 మిలియన్ డాలర్ల మేర పరిహారం చెల్లించినట్లు సంచలన కథనం వెలువరించింది. ఈ ఒప్పందం ప్రకారం నీల్ ఇద్దరు కుమారులకు కలిపి 5.2 మిలియన్ డాలర్లు, అతడి సోదరీసోదరులకు 2 లక్షల యాభై వేల డాలర్లు, అదే విధంగా అతడి ఆరుగురు మనుమలకు 24 వేల డాలర్లు, వీరి న్యాయవాదికి లక్షా అరవై వేల డాలర్లు చెల్లించినట్లు పేర్కొంది. అయితే ఈ ఒప్పందంపై సంతకం చేసిన నీల్ భార్య కరోల్‌కు మాత్రం ఒక్క డాలర్ సహాయం కూడా అందలేదని న్యూయార్క్ టైమ్స్ వెల్లడించింది. కాగా ఈ వార్తలపై స్పందించిన సదరు ఆస్పత్రి అధికార ప్రతినిధి.. నీల్ కుటుంబ సభ్యులు, ఆస్పత్రి యాజమాన్యం మధ్య జరిగిన చట్టబద్ధమైన ఈ ఒప్పందాన్ని బహిర్గతపరచడం మంచి పద్ధతి కాదని హితవు పలికారు. ఈ మేరకు వార్తా సంస్థ ది అసోసియేటెడ్ ప్రెస్‌కు ఆమె మెయిల్ పంపారు. ఇక 50 సంవత్సరాల క్రితం అనగా, 1969, జూలై 16వ తేదీన అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రముఖ హ్యోమగామి మైఖేల్ కాలిన్స్ తన ఇద్దరు సహచరులైన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌తో కలిసి ‘అపోలో11’లో చంద్ర మండల యాత్ర సాగించిన సంగతి తెలిసిందే. చంద్ర మండలానికి మహత్తరమైన మానవుడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి గత మంగళవారం నాటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాసా కెన్నడీ స్పేస్ సెంటర్లో స్వర్ణోత్సవాలను నిర్వహించింది. -
నాడూ రికార్డే.. నేడూ రికార్డే
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో–11 రాకెట్ సహాయంతో చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డెవలపర్స్ షూట్‌హిల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓ అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది. అపోలో మిషన్‌కు సంబంధించి 8 వేల వేర్వేరు ఫొటోలతో ఒక చిత్రాన్ని (మొజాయిక్) రూపొందించారు. ఈ చిత్రంలో మొత్తం 50 వేల ఫొటోలను (8 వేల ఫొటోలనే మార్చి మార్చి వాడారు) పక్కపక్కన పేర్చి వ్యోమగామి ఫొటో తయారుచేశారు. ఇది ఎంత పెద్ద చిత్రంఅంటే.. ఈ ఫొటోలో లక్ష కోట్ల పిక్సెల్స్ దాకా ఉన్నాయి. సాధారణంగా ఆల్బమ్ పరిమాణం ఫొటోలో మహా అయితే 3 వేల నుంచి 4 వేల పిక్సెల్స్ ఉంటాయి. దీన్ని బట్టి వ్యోమగామి ఫొటో ఎంత పెద్దగా ఉందో మీరే ఊహించుకోండి. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫొటోగా షూట్‌హిల్ కంపెనీ పేర్కొంటోంది. గిన్నిస్ రికార్డు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. -
నాడు చంద్రుడి యాత్ర విఫలమైతే..
సాక్షి, న్యూఢిల్లీ : సరిగ్గా 50 సంవత్సరాల క్రితం అంటే, 1969, జూలై 16వ తేదీన అమెరికా, ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రముఖ హ్యోమగామి మైఖేల్ కాలిన్స్ తన ఇద్దరు సహచరులైన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్‌తో కలిసి ‘అపోలో11’లో చంద్ర మండల యాత్ర సాగించారు. చంద్రుడిపై తొలి అడుగు పెట్టిన తొలి మానవుడిగా చరిత్రలోకి ఎక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ నేడు లేరు. ఆయన 2012లో అనారోగ్య కారణాల వల్ల మరణించారు. ఆయన వెనకాలే చంద్రుడిపై అడుగుపెట్టిన బజ్ ఆల్డ్రిన్ ఇప్పటికీ జీవించే ఉన్నారు. వారితో చంద్రుడిపైకి దిగని కాలిన్స్ ‘అపోలో 11’ మిషన్‌లో ఉండిపోయారు. చంద్ర మండలానికి మహత్తరమైన మానవుడి యాత్రను విజయవంతంగా పూర్తి చేసి నిన్నటికి యాభై ఏళ్లు పూర్తయిన సందర్భంగా నాసా మంగళవారం కెన్నడ స్పేస్ సెంటర్లో స్వర్నోత్సవాలను నిర్వహించింది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా మైఖేల్ కాలిన్స్‌ను ఆహ్వానించింది. ఈ కార్యక్రమంలో తనతో పాటు బజ్ ఆల్డ్రిన్, నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్‌లు కూడా పాల్గొంటారని ఆశించానని, ఇప్పుడు ఆర్మ్‌స్ట్రాంగ్ తమ మధ్య లేకపోవడం దురదష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక బజ్ ఆల్డ్రిన్ ఈ కార్యక్రమానికి ఎందుకు హాజరుకాలేదో తెలీదని అన్నారు. ఆనాడు ‘అపోలో 11’ పేరిట చంద్రమండలానికి చేపట్టిన సాహస యాత్ర ఎనిమిది రోజుల్లో విజయవంతంగా ముగిసింది. ఒక వేళ ఆ యాత్ర విజయవంతంగా ముగియకపోతే, చంద్రుడిపై అడుగుపెట్టిన వారు తిరిగి రాకపోతే ? అదే జరిగితే అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ తాను చదవాల్సిన ఉపన్యాసాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. ‘ఇన్ మూవ్మెంట్ ఆఫ్ మూన్ డిజాస్టర్’ అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఉపన్యాసాన్ని విలియం సఫైర్ జూలై 18, 1969న రాశారు. ‘చంద్ర మండలానికి వెళ్లిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ అనే సాహసికులకు గడ్డు రోజులు దాపురించాయి. వారు తిరిగి కోలుకుంటారని నమ్మకం కూడా లేదు. వారి ప్రాణత్యాగాలకు ఓ అర్థం ఉందని వారికి తెలుసు. నిజం తెలుసుకోవడం, వాస్తవాలను గ్రహించడంలో భాగంగా ఓ సమున్నత లక్ష్యం కోసం వీరిద్దరు ప్రాణాలను వొదిలారు. వారి కోసం వారి కుటుంబాలు, స్నేహితులు, దేశ జాతి, యావత్ ప్రపంచం, మొత్తం భూగోళమే నివాళుర్పిస్తుంది...’ అన్న దోరణిలో ఆయన ఉపన్యాసం సాగుతుంది. మైఖేల్ రాకెట్లో కక్ష్య తిరుగుతుండడం వల్ల ఆయన ప్రాణాలకు వచ్చే ముప్పేమి లేదని, చంద్రుడి మీద అడుగు పెట్టిన ఇద్దరికే ప్రమాదం ఉంటుందని నాడు భావించారు. అదష్టవశాత్తు అలాంటి ప్రమాదం ఏదీ జరగక పోవడంతో నిక్సన్, వ్యోమగాములకు ఫోన్లో మాట్లాడారు. -
ఆర్మ్‌స్ట్రాంగ్ బ్యాగుకు రూ.11 కోట్లు
చంద్రుడిపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అప్పట్లో వాడిన ఓ బ్యాగు గురువారం ఏకంగా రూ.11 కోట్లకు అమ్ముడుపోయి రికార్డు సృష్టించింది. సౌత్‌బే నిర్వహించిన వేలంలో ఓ అజ్ఞాత వ్యక్తి ఫోన్ ద్వారా దీన్ని కొనుగోలు చేశారు. 1969లో అపోలో–11 నౌక ద్వారా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్లు చంద్రుడిపైకి చేరిన విషయం తెలిసిందే. ఈ వ్యోమనౌక తిరిగొచ్చాక అందులోని వస్తువులన్నింటినీ స్మిత్సోనియన్ సంస్థకు ఇచ్చేశారు. అయితే ఈ క్రమంలో జరిగిన ఒక తప్పిదం వల్ల చంద్రుడిపై నమూనాలు సేకరించేందుకు వాడిన ఓ బ్యాగు జాన్సన్ స్పేస్ సెంటర్లోనే ఉండిపోయింది. బ్యాగు ప్రాముఖ్యం తెలియని వారు కొందరు దీన్ని పారేయబోతూ కన్సాస్‌లోని ఓ ప్రైవేట్ మ్యూజియం యజమానికి చూపించారు. కొంత కాలం తర్వాత ఓ చోరీ కేసులో ఈ యజమానికి శిక్ష పడటంతో ఎఫ్‌బీఐ ఈ బ్యాగును స్వాధీనం చేసుకుని 2015లో అతి కష్టమ్మీద 995 డాలర్లకు అమ్మింది. ఇప్పుడు మళ్లీ రూ.11 కోట్ల 58 లక్షల 25 వేల 5 వందల యాభై రూపాయలకు అమ్ముడుబోయిందీబ్యాగు. -
మహానగరంలో మహావర్షం!
ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్‌గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణను సమర్థంగా చేపట్టాలని ఎవరూ భావించనందున, అది ముంబైలాగే ఉండిపోవాలనుకున్నట్లుంది. స్విట్జర్లాండ్‌లో రైలు గమ్యస్థానం చేరుకుని ప్లాట్‌ఫాంపై ఆగివున్నట్లు నిర్ధారించుకోకుండానే, ప్రయాణికులు తమ గడి యారంకేసి చూసు కుంటూ రైల్లోంచి దిగే వారని చెబుతుంటారు. స్విస్ రైల్వేకి అంత సామర్థ్యం ఉండేది కాబట్టే రైలు రాకపోకలపై అంత స్పష్టమైన అంచనా ఉండేది. ఏదేమైనా, ఒక దేశ విశిష్ట లక్షణం గురించి మంచిగా లేదా చెడుగా ఈ స్థాయిలో వర్ణించడంవల్ల ఆ వర్ణనలో ఎంతో కొంత అతిశయోక్తి ఉండే ఉంటుంది. ముంబై నగరంలో వర్షం కురుస్తోందని తెలు సుకోవడానికి మీరు వర్షంలో తడవవలసిన అవసరం లేనే లేదు. నగరం స్థితి, ప్రత్యేకించి అస్తవ్యస్తంగా మారిన నగర జీవితం మీకు ఆ విషయాన్ని తేటతెల్లం చేస్తుంది. రహదారులు పొంగి పొరలుతాయి. రైలు పట్టాలు కాస్త మెరుగ్గా ఉంటాయి. పైగా, ప్రతి ఏటా తన రాకకు గుర్తుగా వర్షం నగరాన్ని గుంతలమయం చేస్తుంది. కొద్ది రోజుల్లోనే అవి పెద్ద పెద్ద నీటి బిలాలుగా మార తాయి. అయితే ఇది మాత్రం అతిశయోక్తి కాదు. భూమ్మీది నుంచి చంద్రుడిపైకి వెళ్లి ఆ గ్రహంపై నడిచిన తొలి మానవుడిగా చరిత్రకెక్కిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఆయన తర్వాత అక్కడికి వెళ్లిన ఇతర రోదసీ యాత్రికులు అక్కడ తమకు తార సపడిన బిలాల కారణంగా చంద్రుడిని తప్పుగా అర్థం చేసుకుని ఉండవచ్చు. అయితే ముంబైలోని బిలాలు చంద్రుడిమీదలాగా శాశ్వతంగా ఉండకపో యినా, స్విస్ రైలులాగా ప్రతి వర్షరుతువులోనూ క్రమం తప్పకుండా నగరంలో కనిపిస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులకు అలవాటుపడక తప్ప దని ముంబై వాసులు ఇప్పటికే ఒక అభిప్రాయా నికి వచ్చేసినప్పటికీ, ముంబై ఏదో ఒక నాటికి భారతీయ వెనిస్ నగరంగా మారుతుందని వారు తరచుగా జోకులేసుకుంటున్నప్పటికీ, దీంట్లో గర్వ పడాల్సిందేమీ లేదు. నగరంలో కార్లకు బదులుగా పడవలు ఉండవచ్చు. నీటి గుంతలకు బదులుగా ప్రతిచోటా నీరే ఉండవచ్చు. నగర వాసుల ఆరా టాన్ని శాంతపర్చేందుకు వర్షాకాలంలో మాత్రమే ఇలాంటి పరిస్థితి ఉంటుందని చెప్పవచ్చు. దైనందిన వ్యవహారాలను సంక్లిష్టం చేస్తున్న నగరం తక్షణ స్వభావం ఇదే మరి. ఏడు దీవులను వేరు చేస్తున్న చిత్తడి నేలలనుంచే నగరంలో చాలా భాగం నివాస యోగ్యంగా మారింది. ముంబై నగరంలో చాలా భాగం సముద్ర మట్టానికి కేవలం అయిదు మీటర్ల ఎత్తులో మాత్రమే ఉంటుంది. నగ రానికి జీవధాతువుగా నిలిచిన రైలు పట్టాలు కాస్త ఎత్తులో ఉంటున్నాయి. వర్షం, సముద్రం పోటు రెండూ కాకతాళీయంగా ఒకేసారి వస్తే, యథా విధిగా నగర జీవితం విచ్ఛిన్నమవుతుంది. వర్షపు నీరు అలా సముద్రంలోకి సజావుగా వెళ్లిపోలేదు. ప్రతి వర్షరుతువూ తక్కువ ప్రదేశంలో అతి వృష్టికి దారితీయదు. అతివృష్టి అంటే ఏమిటి? ముంబై నగరంపై కొన్ని కిలోమీటర్ల పొడవునా వర్ష మేఘం నిలువునా ఏర్పడి ఏకధాటిగా వర్షం కురు స్తుంది. దాని వెంటనే వరద పోటెత్తుతుంది. 2005 జూైలై 25న ఇలాగే జరిగింది. మురికికాలువ ఎలా ఉండాలని తాను భావిస్తోందో అస్సలు బోధపడని నగరం ముంబై. నగరంలోని కాలువలను ఆక్రమ ణలు అడ్డుకోవటంతో వాటి వైశాల్యం కుదించుకు పోయింది. నిజానికి అది ఒకప్పుడు మిథీ నది. ఒక నది కాలువగా మారిపోవడమే విచిత్రం మరి. ఇంకా ఆశ్చర్యపడాల్సిన విషయమేమిటంటే, ఈ కాలువలు పూర్తిగా పూడిపోయాయి అన్నట్లుగా నగరవాసులు నానా చెత్తనూ వాటిలోకి విసిరేస్తుం టారు లేదా నగర మురికివాడల నుంచి రైలు పట్టాల పొడవునా చెత్త పోగేస్తుంటారు. ఈ మురికి వాడలకు, పట్టాలకు మధ్యన ఉన్న గోడలు మాత్రమే వీటిని వేరుచేస్తుంటాయి. రైల్వే శాఖ పథకం ప్రకటించి డబ్బు ఖర్చు పెడుతుంది. కానీ వర్షం రాకముందే, పట్టాలపై పూర్తిగా చెత్త పేరుకుపోతుంది. దీంతో నీరు పారే మార్గాలు మూసుకుపోతాయి. ఈ సంక్షోభానికి వివేకరహితంగా తమవంతు దోహదం చేసే నగర పౌరులు కూడా ‘మన నగరం ఎలా నడుస్తుందో చూడండి’ అంటూ శోకన్నాలు తీస్తుంటారు. ఇలాంటి వాతావరణంలో కార్లను వినియో గించేవారినే నీటి గుంతలు ఇబ్బందిపెడుతుం టాయి. ఇతర ప్రజానీకం లేదా సగటు పౌరులకు రైలు సర్వీసులు సజావుగా కొనసాగితే చాలు పనికి వెళ్లి తిరిగి వచ్చే వెసులుబాటు ఉంటుంది. ఈ నీటి గుంతలు కాంట్రాక్టర్ల నాసి రకం పనులను తేట తెల్లం చేస్తాయి. గత మూడేళ్లుగా వారికి అప్ప గించిన పనులకేసి చూస్తే వీరు మోసానికి పాల్ప డుతూనే ఉన్నారని స్పష్టమవుతుంది. కాంట్రాక్టర్ల విశ్వాసఘాతుకం పట్ల నిఘా పెట్టని నగర పాలనా యంత్రాంగం నిర్వాకం వల్ల వీరి హవా నడుస్తూనే ఉంటుంది. ఈ జూదంలో కాంట్రాక్టర్లు మాత్రమే కాదు.. నగర బాధ్యతలు చూస్తున్న రాజకీయ నేతలు, అధికారులు కూడా డబ్బు చేసుకుంటూనే ఉంటారు. ముంబై ఒకప్పుడు షాంఘై, హాంకాంగ్ లేదా సింగపూర్‌గా మారాలని కలలు కనేది. కానీ నగర నిర్వహణకు సంబంధించిన భారీ కృషిని సమ ర్థంగా చేపట్టాలని అది కోరుకోనందున, అది ముంబైలాగే ఉండిపోవాలని నిర్ణయించుకున్న ట్లుంది. ఇదేమంత చెడ్డ విషయం కూడా కాదు. ఎందుకంటే ఇతర మహా నగరాలతో ముంబై తన్ను తాను పోల్చి చూసుకున్నట్లయితే, కారణం లేకుండా తమకు ప్రతిరూపంగా పోల్చుకుంటు న్నందుకు ఆ మహానగరాలు ముంబైపై దావా వేసినా వేయవచ్చు. కాబట్టి ప్రతి వర్షరుతువు లోనూ ఒకే తీరుతో ఉంటున్న ముంబైని నగర వాసులు ప్రేమించాలా? లేక ఈ మహా నగరానికి ఆ దుస్థితి కలిగిస్తున్నందుకు రుతువపనాలను ద్వేషించాలా? ఇప్పుడు ఈ విషయాన్ని ఎవరు పట్టించుకుంటారు? వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు - మహేష్ విజాపుర్కార్ ఈమెయిల్: mvijapurkar@gmail.com -
తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ
చంద్రమండలానికి మనుషులు వెళ్లడమా? అసాధ్యం... కలలో కూడా ఊహించలేం అనుకుంటున్న రోజుల్లో, దాన్ని నిజం చేశారు అమెరికా వ్యోమగామి ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్’. 1969 జూలై 20న చంద్రమండలంపై కాలుమోపిన తొలి వ్యక్తుల్లో ఒకరిగా ప్రపంచం విస్తుపోయేలా చేశారాయన. అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికిన రోజు అది. ‘అపోలో 11’ అనే అంతరిక్ష నౌక ద్వారా చంద్రమండలంపై తొలిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితాన్ని ‘ఫస్ట్ మ్యాన్’ టైటిల్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి హాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. జేమ్స్ హాన్సన్ రాసిన ‘ఫస్ట్ మ్యాన్: ఎ లైఫ్ ఆఫ్ నీల్ ఎ ఆర్మ్‌స్ట్రాంగ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఏడాది మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ‘విప్లాష్’ చిత్ర దర్శకుడు డేమియన్ చెజేల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నటుడు రయాన్ గాస్లింగ్ ఇందులో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు. -
నాసా మెచ్చిన తెలుగు కుర్రాడు
సక్సెస్ స్పీక్స్ నాసా (ది నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్)..అంతరిక్ష ప్రపంచాన్ని శోధించడంలో తనకు తానే సాటి అని నిరూపించుకున్న సంస్థ..చంద్రునిపై తొలి సారి కాలు మోపిన నీల్ఆర్మ్ స్ట్రాంగ్ నుంచి.. నక్షత్రాంతర రోదసిలోకి ప్రవేశించిన మానవ నిర్మిత అద్భుతం వాయేజర్ వరకు ఎన్నో చారిత్రక ఘట్టాలకు వేదికగా నిలిచింది నాసా.. ఇంతటి ఘనత ఉన్న నాసా మెఫ్పు పొందాడు పాల్ సుధాకర్ వీర్ల.. రెండు పదుల ప్రాయం కూడా దాటని ఈ తెలుగు కుర్రాడు నాసాను మెప్పించిన విధానం, తదితర అంశాలపై తన అభిప్రాయాలను సాక్షి భవితతో పంచుకున్నాడు.. ఆ వివరాలు.. మాది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు గ్రామం. నాన్న శివయ్య మెడికల్ దుకాణం నిర్వహిస్తున్నారు. అమ్మ పద్మ గృహిణి. అక్క దివ్య బీటెక్ పూర్తి చేసింది. రాకెట్లంటే ఇష్టం.. చిన్నప్పటి నుంచి రాకెట్లన్నా, అంతరిక్ష ప్రయోగాలన్నా ఎంతో ఆసక్తి. సంబంధిత విషయాలను ఎంతో నిశితంగా గమనించే వాణ్ని. ఎప్పటికైనా అంతరిక్ష ప్రయోగాల్లో పాలుపంచుకోవాలని అనుకునే వాణ్ని. అందుకే అంతరిక్ష శాస్త్రవేత్త కావాలని నిర్ణయించుకున్నా. ఆ దిశలోనే ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని నేషనల్ ఏరో స్పేస్ యూనివర్సిటీలో ఎయిర్ క్రాఫ్ట్ అండ్ రాకెట్ డిజైనింగ్ ఇంజనీరింగ్ చేస్తున్నాను. పదేళ్ల వయసులోనే.. పదేళ్ల వయసులోనే నా ఆలోచనలకు అక్షర రూపమిస్తూ అంతరిక్ష పరిశోధనల గురించి ఒక వ్యాసం రాశాను. నాసా చేపట్టిన అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించి వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలను సేకరించే వాణ్ని. ఇదే కోవలో ఆరో తరగతిలో ఉన్నప్పుడు నాసా నిర్వహించిన ఒక రాకెట్ ప్రయోగ వివరాలను ఫైల్‌గా రూపొందించి నాసాకు పంపాను. అలా వరుసగా మూడేళ్లు చేశాను. కానీ అటు నుంచి ఎటువంటి ప్రతిస్పందన రాలేదు. అయినా నిరుత్సాహపడలేదు. తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడు నాసా హబుల్ స్పేస్ టెలిస్కోప్ సర్వీసింగ్ మిషన్ ప్లానింగ్ అనే ప్రాజెక్ట్‌ను ఆన్లైన్లో నిర్వహించింది. దానికి నా ప్రతిపాదనలతో కూడిన ఒక ప్రాజెక్ట్‌ను పంపించాను. నా ప్రతిపాదనను మెచ్చి నాసా 2009లో మాస్టర్ మైండ్ బిరుదుతో సర్టిఫికెట్ అందించింది. అంతేకాకుండా ఆ సంస్థ నిర్వహిస్తున్న అంతర్జాతీయ వార్షిక సదస్సులో నా ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేసేందుకు ఆహ్వానించింది. ఇమేజిన్ మార్స్.. 2010లో నాసా ఇమేజిన్ మార్స్ (అంగారక గ్రహంపై మానవ జీవనం సాధ్యమా?) అనే అంశంపై ప్రాజెక్ట్ నిర్వహించింది. ఈ అంశంపై నేను సమర్పించిన ప్రతిపాదనలు నాసాకు నచ్చాయి. దీంతో ఆ సంస్థ వేడుకల్లో నా ప్రతిపాదనలను పవర్ పాయింట్ రూపంలో ప్రదర్శించే అవకాశం దక్కింది. అంతేకాకుండా 2011లో స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్‌లో నా ప్రాజెక్ట్ట్కు ప్రపంచ స్థాయిలో మూడో స్థానం లభించింది. దాంతో ఇంటర్నేషనల్ స్పేస్ డెవలప్మెంట్ కాన్ఫరెన్స్‌లో పాల్గొనే అరుదైన అవకాశం వచ్చింది. 2012లో ఇమేజిన్ మార్స్ మరింత విశ్లేషణతో మరొక ప్రాజెక్ట్‌ను రూపొందించి సమర్పించాను. ఈ అంశంపై ప్రపంచవ్యాప్తంగా ఐదు వేల మంది పోటీపడ్డారు. ఇందులో నాకు మూడో స్థానం దక్కింది. ఎన్ఎస్ఎస్ కమిటీ చైర్మన్ ప్రశంస నేను రూపొందించిన ప్రాజెక్ట్‌లను నేషనల్ స్పేస్ సొసైటీ ఇంటర్నేషనల్ కమిటీ చైర్మన్ డేవిడ్ డన్లప్ మెచ్చుకున్నారు. అంతేకాకుండా నాసా అంతర్జాతీయ కమిటీ సభ్యునిగా నియమించారు. ఈ అరుదైన గౌరవం 15 ఏళ్లకే దక్కింది. కలాంకు జ్ఞాపిక అందజేత ఎందరికో స్పూర్తిగా నిలిచే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలామ్‌కు జ్ఞాపికను అందించడం మరిచిపోలేని అనుభూతి. 2012లో నాసా నిర్వహించిన రోడ్ మ్యాప్ టు స్పేస్ సెటిల్మెంట్ ఆర్ట్ పోటీల్లో ప్రపంచంలో నా ప్రతిపాదనకు ప్రథమ స్థానం లభించింది. దీంతో నాసా నిర్వహించిన ఓ అంతర్జాతీయ స దస్సు నిర్వహణ కమిటీలో సభ్యునిగా పని చేసే అవకాశం దక్కింది. సదస్సుకు సంబంధించి అడ్వర్టయిజింగ్, లోగో డిజైన్ రూపొందించడంతోపాటు ఇంటర్నేషనల్ స్టూడెంట్ కో ఆర్డినేటర్‌గా, స్పేస్ ఎంగేజ్మెంట్ ట్రాక్ చైర్మన్‌గా వ్యవహరించాను. ఈ సదస్సుకు ప్రత్యేక ఆహ్వానితులుగా మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం వచ్చారు. స్పేస్ సోలార్ పవర్‌పై ఇచ్చిన ప్రదర్శన చూసి కలాం నన్ను మెచ్చుకున్నారు. నేషనల్ స్పేస్ సొసైటీ నుంచి భారత రాయబారిగా ఉన్నందున కలాంకు నా చేతుల మీదుగా బెస్ట్ మెమెంటో అవార్డును అందించే అవకాశం లభించింది. భారత రాయబారిగా మన దేశంలోని స్పేస్ సొసైటీ, అమెరికాలోని నేషనల్ స్పేస్ సొసైటీకి మధ్య సంబంధాలను నెలకొల్పి, వారి మధ్య చర్చలు నిర్వహించేలా చూడడం భారత రాయబారిగా నా విధి. దీంతోపాటు ఇంటర్నేషనల్ స్పేస్ సొసైటీకి సూచనలు ఇస్తుంటాను. దేశానికి పేరు తీసుకురావాలి ప్రస్తుతం టెస్లా అనే పేరుతో హైబ్రిడ్ రాకెట్ తయారు చేస్తున్నాను. దీనివల్ల అంతరిక్షంలో ప్రవేశించడానికి ప్రస్తుత ఖర్చుకన్నా 40 శాతం తక్కువ అవుతుంది. భవిష్యత్‌లో మంచి శాస్త్రవేత్తగా రాణించి అంతరిక్ష రంగంలో మనదేశానికి పేరు తీసుకురావాలన్నదే నా లక్ష్యం. ఆ దిశగా కృషి చేస్తా. - సహకారం: వంపుగాని చైతన్య, న్యూస్‌లైన్ - గుడివాడ అర్బన్, కృష్ణాజిల్లా. ఘనతలు 2009లో నాసా మిషన్ మాస్టర్ మైండ్ బిరుదు 2010లో ఇమేజిన్ మార్స్ ప్రాజెక్ట్ మెరిట్ సర్టిఫికెట్ 2011లో ఏఎమ్ఈఎస్ స్పేస్ సెటిల్మెంట్ డిజైన్ కాంటెస్ట్- ప్రపంచంలో 3వ స్థానం 2013లో నాసా రోడ్ మ్యాప్ టు స్పేస్ సెటిల్మెంట్ ఆర్ట్ కాంటెస్ట్ -మొదటి స్థానం 2014 మేలో ఓహియో యూనివర్సిటీ సన్శాట్ కాంటెస్ట్-ప్రపంచ స్థాయి ఆరోస్థానం -
ఈ అడుగుకు 45 ఏళ్లు..
చందమామపై మనిషి తొలిసారి కాలు మోపినప్పుడు పడిన పాదముద్ర ఇది. ఈ అడుగుకు రేపటితో 45 ఏళ్లు నిండబోతున్నాయి. 1969 జూలై 16న శాటర్న్ వీ రాకెట్ ద్వారా నింగికి ఎగిరిన అమెరికా వ్యోమగాములు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, ఎడ్విన్ ఆల్డ్రిన్ జూనియర్ నాలుగు రోజుల తర్వా త జూలై 20న ఈగల్ ల్యాండర్ ద్వారా జాబిల్లిపై తొలి అడుగు మోపారు. ఆ అడుగే ఇప్పుడు అంగారకుడిపై పాదం మోపేందుకూ దారిచూపుతోంది. అ యితే.. చంద్రుడిపై నడక అనేది అమెరికా ఆడిన డ్రామా అని.. భూమిపైనే వేసిన ప్రత్యేక సెట్లో వ్యోమగాముల ఫొటోలు తీసి విడుదల చేసిందనే ఆరోపణలూ ఉండడం గమనార్హం.