నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో–11 రాకెట్ సహాయంతో చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డెవలపర్స్ షూట్‌హిల్ అనే సాఫ్ట్‌వేర్ కంపెనీ ఓ అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది. అపోలో మిషన్‌కు సంబంధించి 8 వేల వేర్వేరు ఫొటోలతో ఒక చిత్రాన్ని (మొజాయిక్) రూపొందించారు. ఈ చిత్రంలో మొత్తం 50 వేల ఫొటోలను (8 వేల ఫొటోలనే మార్చి మార్చి వాడారు) పక్కపక్కన పేర్చి వ్యోమగామి ఫొటో తయారుచేశారు. ఇది ఎంత పెద్ద చిత్రంఅంటే.. ఈ ఫొటోలో లక్ష కోట్ల పిక్సెల్స్ దాకా ఉన్నాయి. సాధారణంగా ఆల్బమ్ పరిమాణం ఫొటోలో మహా అయితే 3 వేల నుంచి 4 వేల పిక్సెల్స్ ఉంటాయి. దీన్ని బట్టి వ్యోమగామి ఫొటో ఎంత పెద్దగా ఉందో మీరే ఊహించుకోండి. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫొటోగా షూట్‌హిల్ కంపెనీ పేర్కొంటోంది. గిన్నిస్ రికార్డు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment