Apollo 11
-
Apollo 11 Mission: జెండా రెపరెపల వెనుక...
అది 1969. జూలై 20. అంతరిక్ష రేసులో యూఎస్‌ఎస్‌ఆర్‌పై అమెరికా తిరుగులేని ఆధిక్యం సాధించిన రోజు. అంతేకాదు. అందరాని చందమామను మానవాళి సగర్వంగా అందుకున్న రోజు కూడా. టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్న లక్షలాది మంది సాక్షిగా నాసా అపోలో 11 మిషన్ విజయవంతంగా చంద్రునిపై దిగింది. కాసేపటికి వ్యోమగామి నీల్ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుని ఉపరితలంపై కాలుపెట్టాడు. ఆ ఘనత సాధించిన తొలి మానవునిగా చరిత్ర పుటల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నాడు. ఎడ్విన్ ఆ్రల్డిన్తో కలిసి నమూనాలు సేకరిస్తూ ఉపరితలంపై కొద్ది గంటలు గడిపాడు. మానవాళి ప్రస్థానంలో చిరస్థాయిగా మిగిలిపోనున్న ఆ మైలురాయికి గుర్తుగా అమెరికా జెండాను సగర్వంగా చంద్రునిపై పాతాడు. అయితే ఈ చర్య పెద్ద గందరగోళానికే దారితీసింది. నాసా విడుదల చేసిన ఫొటోల్లో ఆ జెండా రెపరెపలాడుతూ కని్పంచడం నానా అనుమానాలకు తావిచ్చింది. అసలు భూమిపై మాదిరిగా వాతావరణం, గాలి ఆనవాలు కూడా లేని చంద్రుని ఉపరితలంపై జెండా ఎలా ఎగిరిందంటూ సర్వత్రా ప్రశ్నలు తలెత్తాయి. చివరికి పరిస్థితి అపోలో 11 మిషన్ చంద్రునిపై దిగడం శుద్ధ అబద్ధమనేదాకా వెళ్లింది! అంతరిక్ష రంగంలో దూకుడు ప్రదర్శిస్తున్న యూఎస్ఎస్ఆర్ మీద ఎలాగైనా పైచేయి సాధించేందుకు నాసా ఇలా కట్టుకథ అల్లి ఉంటుందంటూ చాలామంది పెదవి విరిచారు కూడా... కానీ, ఆ జెండా రెపరెపల వెనక నాసా కృషి, అంతకుమించి సైన్స్ దాగున్నాయి. చూసేందుకు అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టు కన్పించే అమెరికా జాతీయ జెండాను ఎలాగైనా చంద్రునిపై పాతాలన్నది నాసా పట్టుదల. నాసా సాంకేతిక సేవల విభాగం చీఫ్ జాక్ కింజ్లర్ ఈ సవాలును స్వీకరించారు. ఆయన ఆధ్వర్యంలో సైంటిస్టులు ఎంతగానో శ్రమించి మరీ ఆ జెండాను ప్రత్యేకంగా డిజైన్ చేశారు. జెండా పై భాగం పొడవునా ఒక క్రాస్‌బార్ అమర్చారు. దానికి జెండాను అక్కడక్కడా ప్రెస్ చేశారు. తద్వారా జెండా పలుచోట్ల వంపు తిరిగినట్టు కని్పంచేలా చేశారు. ఫలితంగా చూసేందుకది అచ్చం గాలికి రెపరెపలాడుతున్నట్టుగా కని్పంచింది. నాసా ఉద్దేశమూ నెరవేరింది. అదే క్రమంలో వివాదాలకూ తావిచి్చంది. జెండా తయారీలో పలు అంశాలను దృష్టిలో పెట్టుకున్నారు. జెండా కర్రను కూడా అతి తేలికగా, అదే సమయంలో అత్యంత తీవ్ర వాతావరణ పరిస్థితుల్లో కూడా అత్యంత మన్నికగా ఉండే అనోడైజ్డ్ అల్యుమినియంతో తయారు చేశారు. చంద్రుని నేలపై తేలిగ్గా దిగేందుకు, కిందకు వాలకుండా నిటారుగా ఉండేందుకు వీలుగా దాని మొదట్లో చిన్న స్ప్రింగ్‌ను అమర్చారు. ఇక జెండాను కూడా చంద్రునిపై తీవ్రమైన ఉష్ణోగ్రత తదితరాలను తట్టుకునేందుకు వీలుగా నైలాన్ బట్టతో తయారు చేశారు. అనంతరం పలు అపోలో మిషన్లలో కూడా ఇదే తరహా జెండాలను చంద్రునిపైకి పంపారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
పుట్టినరోజునాడే నాలుగో పెళ్లి
వాషింగ్టన్: ఆయనకు ఇదివరకే మూడు పెళ్లిళ్లు అయ్యి.. విడాకులు అయ్యాయి. తాజాగా నాలుగో పెళ్లి చేసుకున్నారు. అదీ పుట్టినరోజు నాడే. అంతలా ఆయన గురించి ప్రత్యేకంగా ఎందుకు చెప్పాలి అనుకుంటున్నారా?. చంద్రుడిపై అడుగుపెట్టిన మొదటి వ్యక్తి ఎవరు?.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కదా!. మరి రెండో వ్యక్తి ఎవరు?.. ఈయనే ఆయన. పేరు ఎడ్విన్ బజ్ అల్డ్రిన్. అమెరికా మాజీ వ్యోమగామి. అపోలో 11 మిషన్ ద్వారా చంద్రుడిపై పాదం మోపి.. సంచరించిన ముగ్గురు వ్యోమగాముల్లో ఈయన కూడా ఒకరు. పైగా ఆ బ్యాచ్‌లో ఇంకా బతికి ఉంది కూడా ఈయనే. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తర్వాత చంద్రుడిపై పాదం మోపిన రెండో వ్యక్తి. ఆర్మ్‌స్ట్రాంగ్‌తో పాటు 19 నిమిషాల చంద్రుడిపై సంచరించారీయన. నీల్ ఆర్మ్‌స్టాంగ్ ఈ మిషన్‌లో కమాండర్‌గా వ్యవహరించగా.. ఎడ్విన్ బజ్ అల్డ్రిన్ ‘లునార్ మాడ్యుల్ పైలట్’గా వ్యవహరించారు. ఇక మైకేల్ కోలిన్స్ కమాండ్ మాడ్యుల్ పైలట్‌గా పని చేశారు. అపోలో 11 మిషన్ 1969 జులై 16వ తేదీన లాంఛ్ కాగా, జులై 20వ తేదీన చంద్రుడిపై తొలిసారిగా మానవుడు అడుగుపెట్టాడు. ఇక.. మూడుసార్లు అంతరిక్షంలో సంచరించిన వ్యోమగామిగానూ అల్డ్రిన్ పేరిట ఓ రికార్డు ఉంది. 1971లో నాసా నుంచి రిటైర్ అయిన ఈ పెద్దాయన.. 1998లో షేర్స్పేస్ ఫౌండేషన్‌ను స్థాపించి అంతరిక్ష అన్వేషణ సిబ్బందికి శిక్షణ ఇస్తూ వస్తున్నారు. గతంలో ఆయనకు మూడు సార్లు వివాహం అయ్యింది. 1954-1974, 1975-78, 1988-2012.. ఇలా మూడుసార్లు ఆయన వివాహాలు విడాకులు అయ్యాయి. అయితే ఆ తర్వాత ఆయన డాక్టర్ అంకా ఫౌర్తో డేటింగ్ చేస్తూ వస్తున్నారు. తాజాగా తన 93వ పుట్టినరోజున.. 63 ఏళ్ల అంకాను వివాహం చేసుకున్నాడాయన. లాస్ ఏంజెల్స్ కలిఫ్లో దగ్గరి వాళ్ల మధ్య సింపుల్‌గా ఈ వివాహం జరిగింది. ఈ విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేసిన ఆ పెద్దాయ.. ఇంట్లోనుంచి పారిపోయే కుర్రాళ్లకు ఏమాత్రం తీసిపోని ఉద్వేగాన్ని ప్రదర్శిస్తున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. On my 93rd birthday & the day I will also be honored by Living Legends of Aviation I am pleased to announce that my longtime love Dr. Anca Faur & I have tied the knot.We were joined in holy matrimony in a small private ceremony in Los Angeles & are as excited as eloping teenagers pic.twitter.com/VwMP4W30Tn — Dr. Buzz Aldrin (@TheRealBuzz) January 21, 2023 -
చిటికెడు మట్టి రూ.4 కోట్లు
లండన్: అపోలో 11 మిషన్‌లో 53 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై కాలుమోపిన సంగతి తెలిసిందే! ఆయన తనతో పాటు తెచ్చిన చంద్రుడి మృత్తికకు తాజాగా జరిగిన వేలంలో భారీ ధర పలికింది. అంతర్జాతీయ ఆక్షన్ సంస్థ బొన్హామ్స్ నిర్వహించిన వేలంలో చిటికెడు చంద్ర మృత్తికను గుర్తు తెలియని వ్యక్తి 5,04, 375 డాలర్లు (సుమారు 3.85 కోట్ల రూపాయలు) వెచ్చించి కొనుగోలు చేశారు. అయితే తాము అనుకున్న రేటు రాలేదని సంస్థ భావిస్తోంది. వేలానికి ముందు దీనికి దాదాపు 12 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా వేసింది. అపోలో మిషన్ నుంచి తెచ్చిన శాంపిళ్ల వేలానికి ఇంతవరకు నాసా అభ్యంతరాలు చెబుతూ వచ్చింది. అయితే 2017లో కోర్టు ఆదేశాల మేరకు నాసా తన అభ్యంతరాలను విరమించుకుంది. -
అదొక అద్భుత ఘట్టం.. లైవ్‌లో చూపించినా నమ్మరెందుకు?
చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్ లునార్ మాడ్యుల్’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా? సాక్షి, వెబ్‌డెస్క్: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్ వీ రాకెట్ ద్వారా ‘అపోలో 11 స్పేస్ ఫ్లైట్’ ఫ్లోరిడా మారిట్ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్ సెంటర్ నుంచి బయలుదేరింది. కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లునార్ మాడ్యూల్ పైలెట్ బజ్ అల్డ్రిన్, కమాండ్ మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ అపోలో స్పేస్ ఫ్లయిట్లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. ఉద్వేగభరిత క్షణాలవి.. అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్ మాడ్యూల్, ఈగిల్ మాడ్యూల్ రెండూ విడిపోయాయి. ఈగిల్ మాడ్యూల్లో నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ అల్డ్రిన్ ఉండగా.. మాడ్యూల్ పైలెట్ మైకేల్ కోలిన్స్ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్ ల్యాండ్ అయ్యింది ఈగిల్. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్ కమ్యూనికేషన్ సెంటర్‌కు తెలిపాడు. అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్ మాడ్యూల్ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్ సిగ్నల్ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్ అల్డ్రిన్ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు. #50thAnniversary 🌚👨🏼🚀👨🏼🚀👨🏼🚀 "That's one small step for man, one giant leap for mankind." ... and #Jump Happy #MoonDay 🌚 &#WorldJumpDay#50thanniversaryofthemoonlanding#LunarLanding#ManOnTheMoon 👨🏼🚀👨🏼🚀👨🏼🚀 pic.twitter.com/t7Ut0ogSN5 — Miguel Velasco (@_miguelvelasco) July 20, 2019 మూన్డేగా గుర్తింపు ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్క్విలిటీ బేస్’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్ మాడ్యూల్ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్ గ్రేటెస్ట్ టెక్నాలజికల్ అఛీవ్మెంట్ ఆఫ్ ఆఫ్ ఆల్‌టైం’. ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు.. కట్టుకథ.. కౌంటర్లు బిల్ కేసింగ్ అనే అమెరికన్ రైటర్.. జులై 1969 నుంచి డిసెంబర్ 1972 దాకా జరిగిన అపోలో మూన్ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్ డౌన్ ఏంటంటే.. మూన్ ల్యాండింగ్ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది. ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్ లెన్ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్ రీ కన్నియసాన్స్ ఆర్బిటర్ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్ దేశాలు పంపిన స్పేస్ వెహికిల్స్ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్ సైంటిస్టుల మాట. -
చంద్రుడిపై శృంగారం కోసం రూ.150 కోట్ల విలువైన దొంగతనం
వాషింగ్టన్: కొందరు చేసే తింగరి పనులు చేస్తే ఎలా స్పందించాలో కూడా అర్థం కాదు. తాజాగా ఓ వ్యక్తి చేసిన పని గురించి తెలిస్తే మీకు కూడా ఇలానే అనిపిస్తుంది. ఇతగాడికి చంద్రుడి మీద శృంగారం చేయాలనే కోరిక కలిగింది. అందుకోసం అతడి చేసిన పని గురించి తెలిసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో ముక్కున వేలేసుకుంటున్నారు. దాదాపు 19 ఏళ్ల క్రితం జరిగిన ఈ సంఘటన వివరాలు.. థాడ్ రాబర్ట్స్ 2002 లో అమెరికన్ స్పేస్ ఆర్గనైజేషన్ నాసా ఇంటర్న్‌షిప్ చేశాడు. అతడి గర్ల్‌ఫ్రండ్ టిఫాని ఫ్లవర్స్ కూడా అక్కడే ఇంటర్న్‌షిప్ చేసింది. ఈ క్రమంలో వారికి ఓ వింత కోరిక కలిగింది. చంద్రుడి మీద శృంగారం చేయాలని భావించారు. ఇది సాధ్యం కాదని వారికి తెలుసు. దాంతో నాసా అపోలో వ్యోమనౌక ద్వారా చంద్రుడి ఉపరితలం నుంచి భూమి మీదకు తీసుకువచ్చిన రాళ్లపై వారిపై కన్ను పడింది. ఎలాగైనా వాటిని దొంగిలించి.. తమ బెడ్ మీద పెట్టుకుని.. వాటిపై పడుకుని.. తమ కల నేరవేర్చుకోవాలని భావించారు. ఈ క్రమంలో మరో స్నేహితుడితో కలిసి.. తన ఐడీలతో అర్థరాత్రి పూట బిల్డింగ్‌లోకి ఎంటరయ్యారు. ఆ తర్వాత చంద్రుడి మీద నుంచి తెచ్చిన రాళ్లను దొంగతనంగా తమ గదికి తీసుకెళ్లి.. వారి కోరిక తీర్చుకున్నారు. ఇక ఈ రాళ్లకు చాలా విలువ ఉంటుంది. మూన్ రాక్ ఒక్కగ్రాము ధర 5 వేల డాలర్లు(3,75,013 రూపాయలు) పలుకుతుంది. ఇక వీరు దొంగతనం చేసిన శాంపిల్ ఖరీదు 21 మిలియన్ డాలర్ల(157,69,24,650 రూపాయలు) విలువ చేస్తుంది. ఓ బెల్జియన్ ఔత్సాహిక ఖనిజ శాస్త్రవేత్త ఈ మూన్ రాక్‌ని కొనడానికి ఉత్సాహం చూపాడు. అయితే వీరి ప్రయత్నానికి నాసా బ్రేక్ వేసింది. మూన్ రాక్స్ దొంగిలించబడినవి అని గుర్తించిన వెంటనే అధికారులు రంగంలోకి దిగి విచారణ చేయగా రాబర్ట్స్, అతడి బ్యాచ్ చేసిన నిర్వాకం గురించి తెలిసింది. వీరిపై పోలీసు కేసు నమోదు చేశారు. కోర్టు రాబర్ట్స్‌కి ఎనిమిదేళ్ల శిక్ష విధించింది. ఇక జైలులో ఉన్న కాలంలోరాబర్ట్స్ భౌతికశాస్త్రం, మానవ శాస్త్రం, తత్వశాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశాడు. ఇప్పుడు అతడి వయసు 44 సంవత్సారు. ప్రస్తుతం అతను ఓ ప్రముఖ కంపెనీలో అత్యున్నత స్థాయిలో విధులు నిర్వహిస్తున్నాడు. చదవండి: నువ్వు నిజమైన జాతిరత్నానివి సామి! -
వ్యోమగాములకు తప్పని క్వారంటైన్
వాషింగ్టన్: కోవిడ్ -19 దెబ్బతో ప్రపంచం అతలాకుతలమైంది. మానవ జీవితాలను పూర్తిగా స్తంభింపజేసింది. కోవిడ్ -19 పుణ్యమా ... క్వారంటైన్, సోషల్ డిస్టన్స్, లాక్డౌన్, వంటి పదాలు మన జీవితంతో భాగమయ్యాయి. ఇతర దేశాల నుంచి వచ్చేవారిని కచ్చితంగా క్వారంటైన్ చేయాల్సి వచ్చేది. కేవలం ఇతర దేశాల నుంచి వచ్చిన వారినే క్వారంటైన్ చేశారనుకుంటే మీరు పొరపడినట్లే..! చంద్రునిపై 1969లో మొదటిసారిగా కాలుమోపిన ఆస్ట్రోనాట్స్ కూడా క్వారంటైన్ ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఖగోళయాత్ర చేసి తిరిగి భూమి పైకి వచ్చిన ఆస్ట్రోనాట్స్ నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, మైఖేల్ కొలిన్స్, ఎడ్విన్ బజ్ అల్ర్ర్డిన్ వ్యోమగాములను 21 రోజులపాటు క్యారంటైన్లో ఉంచారు. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ తన ముప్పైతొమ్మిదో పుట్టినరోజు వేడుకలను కుటుంబానికి దూరంగా ఉండి జరుపుకున్నాడు. క్వారంటైన్ మనకు కొత్తగా ఉన్న , వ్యోమగాములకు మాత్రం సాధారణమే. క్వారంటైన్ ఎందుకు ఉండాల్సివచ్చిందంటే... అపోలో-11 మిషన్ వ్యోమగాములు చంద్రునిపై ఉన్న వాతావరణం, లూనార్ పదార్థాలతో మొదటిసారిగా గడిపారు.వ్యోమగాములను చంద్రునిపై ఉన్న హానికరమైన పదార్ధాలకు దూరంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఒకవేళ వారు అక్కడి వాతావరణానికి బహిర్గతమైతే అది భూమిపై ఉన్న మానవాళికి విపత్తుగా మారుతుంది.దీంతో ఖగోళయాత్ర అనంతరం ముగ్గురు వ్యోమగాములను క్వారంటైన్లో ఉంచారు. వారిని వైద్యులు నిశితంగా పరిశీలించారు.మరొక బృందం అపోలో-11 మిషన్ తీసుకొచ్చిన రాళ్లు, ధూళిని పరీక్షించి అధ్యయనం చేశారు. చంద్రునిపై తెలియని అంశాలు , హానికరమైన బ్యాక్టీరియాను పక్కన పెడితే, వ్యోమగాములు చంద్ర నమూనాలను సేకరించినప్పుడు వారికి తెలియకుండానే తీసుకువచ్చే అంశాలు వారి జీవితాన్ని భంగం కలిగించవచ్చునని పరిశోధకులు తెలిపారు. అపోలో -12 , అపోలో -14 మిషన్లకు మూన్ ల్యాండింగ్ తరువాత తిరిగివచ్చే వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగింది. కొన్నిరోజుల తరువాత అపోలో ప్రోగ్రాం తదుపరి మిషన్ల వ్యోమగాములకు క్వారంటైన్ కొనసాగలేదు ఎందుకంటే అంతరిక్షంలో ప్రమాదకరమైన అంశాలు లేవని పరిశోధకులు భరోసా ఇచ్చిన వెంటనే క్వారంటైన్‌ను నిలిపివేశారు.‘అపోలో 11: క్వారంటైన్’ అనే డాక్యుమెంటరీ మార్చి 6 న ప్రముఖ ఆంగ్ల చానల్లో ప్రసారమయ్యింది. -
చందమామ అందివచ్చిన రోజు
సాక్షి, హైదరాబాద్ : గగనాంతర రోదసిలో గంధర్వలోక గతులు దాటేందుకు మనిషి వేసిన తొలి అడుగుకు నేటితో అక్షరాలా 51 ఏళ్లు!. అపోలో –11 మిషన్‌తో జాబిల్లిపై మనిషి తొలిసారి పాదం మోపింది 1969 జూలై 20న.. అంటే రేపటి రోజున!. ఆ తరువాతా బోలెడన్ని అంతరిక్ష ప్రయోగాలు జరిగాయి కానీ.. ఇంకో గ్రహంపై అడుగు వేసిన ఘట నలు మాత్రం లేవు. జాబిల్లిపై అప్పటి ఆసక్తి ఎందుకు? ఇప్పుడేం జరుగుతోంది! రేపు ఏం జరగబోతోంది అనేది పరిశీలిస్తే.. హ్యాపీమూన్ జర్నీ జాన్ ఎఫ్ కెన్నడీ పేరు మనం వినే ఉంటాం. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించిన ఈ పెద్దమనిషి 1962లో హ్యూస్టన్‌లోని రైస్ స్టేడియంలో చేసిన ఓ ప్రసంగం అంతరిక్ష ప్రయోగాలను మేలిమలుపు తిప్పింది. ‘‘జాబిల్లిపైకి వెళ్లేందుకు నిశ్చయించాం’’ అని ఆ ప్రసంగంలో కెన్నడీ ప్రకటించారు. పదేళ్లలోపే ఈ ఘనతను సాధిస్తామన్న కెన్నడీ సంకల్పం మూడేళ్లకే నెరవేరింది కూడా. 1969 జూలై 16న నింగికెగసిన అపోలో–11 నాలుగు రోజుల తరువాత అంటే జూలై 20న జాబిల్లిని చేరడం.. నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జాబిల్లిపై తొలిసారి అడుగు మోపడం అన్నీ ఇప్పుడు చరిత్ర. ఆసక్తికరమైన విషయమేమిటంటే.. అపోలో–11 తరువాత కూడా మొత్తం 6 ప్రయోగాలు జరగ్గా ఇందులో ఐదు జాబిల్లిపై ల్యాండ్ అయ్యాయి. బోలెడంత మంది వ్యోమగాములు జాబిల్లి వరకూ వెళ్లారు. కొందరు అంతరిక్ష నౌకల నుంచి చందమామను వీక్షించడానికి పరిమితమైతే.. మరికొందరు నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాదిరిగా అక్కడి నేలపై అడుగుపెట్టారు. కచ్చితంగా చెప్పుకోవాలంటే ఇప్పటివరకు మొత్తం 24 మంది వ్యోమగాములు జాబిల్లి పరిసరాల్లోకి వెళ్లగలిగారు. ఇందులో 12 మంది మాత్రమే జాబిల్లిపై అడుగుపెట్టారు. మిగిలిన 12 మంది కొన్ని వందల కిలోమీటర్ల దూరం నుంచి వీక్షించేందుకే పరిమితమయ్యారు. 1972 డిసెంబర్లో ప్రయోగించిన అపోలో–17.. ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్ ఆల్డ్రిన్, మైకేల్ కోలిన్స్‌తో కూడిన అపోలో –11 రికార్డులను బద్దలుకొట్టింది. వ్యోమగాములు అతి ఎక్కువ సమయం జాబిల్లిపై గడిపిన, ఎక్కువ మొత్తంలో నమూనాలు సేకరించిన ప్రాజెక్టు కూడా అపోలో –17నే. ఈ ప్రయోగం తరువాత మళ్లీ మనిషి జాబిల్లిపై అడుగిడలేదు. అపోలో –11 బడ్జెట్ 2,000 కోట్ల డాలర్ల వరకు ఉండగా ఇప్పటికీ అంతరిక్ష ప్రయోగాల ఖర్చులు అంతే స్థాయిలో ఉండటం దీనికి కారణం. చెరిగిపోని ఆ ‘గురుతులు’ నిజమే! అమెరికా అపోలో– 11 ప్రయోగం నిజమా? కాదా? అనే దానిపైనా బో లెడన్ని కథనాలు ప్రచారం లో ఉన్నాయి. 4 అంశాలను పరిశీలిస్తే మానవుడు పలుమార్లు అక్కడ అడుగుపెట్టాడనేది స్పష్టమవుతుందని నిపుణులు అంటున్నారు. మొద టిది మనిషి అడుగుల గురుతులు. భూమ్మీద ఇసుకపై అడుగుపెడితే ఆ గుర్తు కొంతకాలానికి చెరిగిపోతుంది. ఇక్కడ ‘వాతావరణం’ ఉంటుంది. నీళ్లు, గాలి కూడా ఇక్కడ మాత్ర మే ఉంటాయి. వీటన్నింటి కారణంగా అడుగుల గురుతులు కొంతకాలానికి చెరిగిపోతాయి. జాబిల్లిపై ఇవేవీ ఉండవు కాబట్టి అక్కడ ఎప్పుడో 51 ఏళ్ల క్రితం నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ వేసిన అడుగు గుర్తు ఇప్పటికీ, ఎప్పటికీ అలాగే చెక్కు చెదరకుండా ఉంటాయి. రెండో ది.. 12 అపోలో ప్రయోగాల ద్వారా నాసా తీసిన 8 వేల ఫొటోలు. వీటిని నాసా అందరికీ అందుబాటులో ఉంచింది. మూడవది.. అపోలో ప్రాజెక్టుతోపాటు ఇతర దేశాల అంతరిక్ష ప్రయోగాల్లో భాగంగా జాబిల్లిపై వదిలేసిన పలు శోధక నౌక లు, శాస్త్ర పరికరాలు. అపోలో –11, 12, 14, 15, 16ల ద్వారా జాబిల్లిపైకి చేర్చిన సెసిమోమీటర్స్ 1977 వరకు భూమికి అక్కడి ప్రకంపనల సమాచారాన్ని ప్రసారం చేశా యి. భూమి నుంచి జాబిల్లికి ఉన్న దూరాన్ని సెంటీమీటర్ల స్థాయి కచ్చితత్వంతో లెక్కిం చేందుకివి దోహదపడుతున్నాయి. చివరివి.. జాబిల్లిపై నుంచి తెచ్చుకున్న మట్టి, రాతి నమూనాలు. వీటన్నిటినీ పరిశీలించడం ద్వా రా శాస్త్రవేత్తలు జాబిల్లికి సంబంధించిన పలు అంశాలను అర్థం చేసుకోవడానికి, మరిన్ని పరిశోధనలకు వీలవుతోంది. ఇకపై మనిషి స్థానంలో రోబోలు? మనిషి జాబిల్లిపై చివరిసారి అడుగుపెట్టి 48 ఏళ్లవుతోంది. ఇక, భవిష్యత్తులో మానవ ప్రయోగాలతోపాటు అంతరి క్షాన్ని శోధించడం మొదలు విలువైన వనరులను మైనింగ్ చేయడం వరకు అన్నింటికీ టెక్నాలజీ సాయం తీ సుకోవాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ప్ర పంచవ్యాప్తంగా 70 వరకు ప్రభుత్వ, ప్రైవేట్ కంపెనీలు అంతరిక్ష ప్రయోగాలు చేస్తుండ గా.. వీటిలో 13 సంస్థలకు అంతరిక్ష ప్రయోగాలు నిర్వహించే సామర్థ్యం ఉంది. స్పేస్ ఎక్స్ బ్లూఆరిజన్, వర్జిన్ గలాక్టిక్ వంటి ప్రైవే ట్ సంస్థలు అంతరిక్ష ప్రయోగాలకు తోడు అంతరిక్ష పర్యాటకానికీ ప్రయత్నాలు చేస్తున్నాయి. 2030 నాటికల్లా అంతరిక్షానికి సంబంధించిన మార్కెట్ విలువ 30 లక్షల కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. రానున్న యాభై ఏళ్ల లో సౌర కుటుంబాన్ని మాత్రమే కాకుండా దానికి ఆవల ఉన్న అంతరిక్షాన్ని కూడా అర్థం చేసుకో వాలని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు ప్రణాళికలు సిద్ధం చేశాయి. ఇతర గ్రహాలు, తోకచుక్కల్లోని విలువైన వనరులను తవ్వి భూమ్మీదకు తెచ్చేందుకు పలు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి. ఎలన్ మస్క్ వంటి వాళ్లు ఇంకో అడుగు ముందుకేసి అంగారకుడిపై మానవులతో కూడిన కాలనీని కట్టేస్తానని చెబుతున్నారు. నాసా 2024 నాటికి మరోసారి మనిషిని జాబిల్లిపైకి పంపడం మాత్రమే కాకుండా.. 2028 నాటికి అక్కడ శాశ్వత స్థావరం ఏర్పాటుకు ప్రయత్నిస్తోంది. చైనా 2030 నాటికల్లా జాబిల్లి దక్షిణ ధ్రువంపైకి వ్యోమగాములను దింపాలని ప్రయత్నిస్తోంది. -
నాడూ రికార్డే.. నేడూ రికార్డే
నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ అపోలో–11 రాకెట్ సహాయంతో చంద్రుడిపై కాలుమోపి 50 ఏళ్లు గడిచాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డెవలపర్స్ షూట్‌హిల్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఓ అద్భుతమైన ఫొటోను విడుదల చేసింది. అపోలో మిషన్‌కు సంబంధించి 8 వేల వేర్వేరు ఫొటోలతో ఒక చిత్రాన్ని (మొజాయిక్) రూపొందించారు. ఈ చిత్రంలో మొత్తం 50 వేల ఫొటోలను (8 వేల ఫొటోలనే మార్చి మార్చి వాడారు) పక్కపక్కన పేర్చి వ్యోమగామి ఫొటో తయారుచేశారు. ఇది ఎంత పెద్ద చిత్రంఅంటే.. ఈ ఫొటోలో లక్ష కోట్ల పిక్సెల్స్ దాకా ఉన్నాయి. సాధారణంగా ఆల్బమ్ పరిమాణం ఫొటోలో మహా అయితే 3 వేల నుంచి 4 వేల పిక్సెల్స్ ఉంటాయి. దీన్ని బట్టి వ్యోమగామి ఫొటో ఎంత పెద్దగా ఉందో మీరే ఊహించుకోండి. ఇది ప్రపంచంలోనే పెద్ద ఫొటోగా షూట్‌హిల్ కంపెనీ పేర్కొంటోంది. గిన్నిస్ రికార్డు వచ్చే అవకాశం ఉందని కంపెనీ ఉద్యోగులు చెబుతున్నారు. -
తెరపై నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ కథ
చంద్రమండలానికి మనుషులు వెళ్లడమా? అసాధ్యం... కలలో కూడా ఊహించలేం అనుకుంటున్న రోజుల్లో, దాన్ని నిజం చేశారు అమెరికా వ్యోమగామి ‘నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్’. 1969 జూలై 20న చంద్రమండలంపై కాలుమోపిన తొలి వ్యక్తుల్లో ఒకరిగా ప్రపంచం విస్తుపోయేలా చేశారాయన. అంతరిక్ష పరిశోధనా చరిత్రలో కొత్త అధ్యయనానికి నాంది పలికిన రోజు అది. ‘అపోలో 11’ అనే అంతరిక్ష నౌక ద్వారా చంద్రమండలంపై తొలిసారిగా కాలు మోపిన నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ జీవితాన్ని ‘ఫస్ట్ మ్యాన్’ టైటిల్‌తో వెండితెరపై ఆవిష్కరించడానికి హాలీవుడ్లో సన్నాహాలు జరుగుతున్నాయి. జేమ్స్ హాన్సన్ రాసిన ‘ఫస్ట్ మ్యాన్: ఎ లైఫ్ ఆఫ్ నీల్ ఎ ఆర్మ్‌స్ట్రాంగ్’ అనే పుస్తకం ఆధారంగా ఈ చిత్రం రూపొందనుంది. ఈ ఏడాది మూడు విభాగాల్లో ఆస్కార్ అవార్డులు దక్కించుకున్న ‘విప్లాష్’ చిత్ర దర్శకుడు డేమియన్ చెజేల్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుంది. నటుడు రయాన్ గాస్లింగ్ ఇందులో నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ పాత్రలో కనిపించడానికి సిద్ధమవుతున్నారు.