Moon Day 2021 Special Story In Telugu: చంద్రుడి ‘అడుగు’పై అనుమానాలు.. నమ్మకపోవడానికి కారణాలివే! - Sakshi
Sakshi News home page

Moon Day: చంద్రుడి ‘అడుగు’పై అనుమానాలు.. నమ్మకపోవడానికి కారణాలివే!

Published Tue, Jul 20 2021 1:20 PM | Last Updated on Tue, Jul 20 2021 7:52 PM

Moon Day 2021 Special Story Suspects On Nasa Moon Landing Moments - Sakshi

చరిత్రలో అదొక అత్యంత ముఖ్యమైన ఘట్టం. సాంకేతికతను పుణికిపుచ్చుకున్న మనిషి, అప్పటిదాకా రోదసీ యాత్రలతోనే సరిపెట్టుకున్న మనిషి.. ఏకంగా చందమామ కలను సాకారం చేసుకున్న క్షణాలవి. 1969 జులై 20 నాసా వ్యోమగామి నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రుడిపై మొదటగా అడుగుపెట్టాడు. ఆ వెంటనే మరో పైలెట్ బజ్ ఆల్డ్రిన్ ‘ఈగిల్‌ లునార్‌ మాడ్యుల్‌’ నుంచి కిందకి దిగగా.. ఆ ఇద్దరూ కలిసి చంద్రుడిపై అమెరికా జెండాను సగర్వంగా ఎగరేశారు. అమెరికా నాసా ‘అపోలో’ ప్రయోగం ద్వారా సుసాధ్యమైన ఈ ఘటనకు ఇవాళ్టికి 52 ఏళ్లు పూర్తైంది. అంతేకాదు ఆ ఘట్టానికి గుర్తుగా ఇవాళ ‘మూన్‌ డే’ కూడా నిర్వహిస్తుంటారు. అయితే ఆ ఫీట్‌ నిజమేనా అనే అనుమానాలు ఎందుకు వినిపిస్తాయో తెలుసా?

సాక్షి, వెబ్‌డెస్క్‌: మొత్తం 24 బిలియన్ల డాలర్ల(ఇప్పటి లెక్కల ప్రకారం.. అది వంద బిలియన్ల డాలర్లపైనే ఉండొచ్చు) ఖర్చుతో నాసా ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. జులై 16న ఉదయం 9గం.30ని. శాటర్న్‌ వీ రాకెట్‌ ద్వారా ‘అపోలో 11 స్పేస్‌ ఫ్లైట్‌’ ఫ్లోరిడా మారిట్‌ ఐల్యాండ్‌లోని కెనెడీ స్పేస్‌ సెంటర్‌ నుంచి బయలుదేరింది. కమాండర్‌గా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, లునార్‌ మాడ్యూల్‌ పైలెట్‌ బజ్‌ అల్‌డ్రిన్‌, కమాండ్‌ మాడ్యూల్‌ పైలెట్‌ మైకేల్‌ కోలిన్స్‌ అపోలో స్పేస్‌ ఫ్లయిట్‌లో పయనం అయ్యారు. రెండు లక్షల నలభై వేల మైళ్ల దూరపు ప్రయాణం తర్వాత జులై 19న చంద్రుడి కక్క్ష్యలోకి అడుగుపెట్టింది అపోలో. 

ఉద్వేగభరిత క్షణాలవి.. 
అర్ధరాత్రి దాటాక అపోలో నుంచి లునార్‌ మాడ్యూల్‌, ఈగిల్‌ మాడ్యూల్‌ రెండూ విడిపోయాయి. ఈగిల్‌ మాడ్యూల్‌లో  నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్, బజ్‌ అల్‌డ్రిన్‌ ఉండగా.. మాడ్యూల్‌ పైలెట్‌ మైకేల్‌ కోలిన్స్‌ చంద్రుడి చుట్టూ చక్కర్లు కొట్టాడు. ఇక రెండు గంటలు ఉపరితలంలో సంచరించాక.. చంద్రుడిపై సేఫ్‌ ల్యాండ్‌ అయ్యింది ఈగిల్‌. ఆ విషయాన్ని ఆర్మ్‌స్ట్రాంగ్ నాసా స్పేస్‌ కమ్యూనికేషన్‌ సెంటర్‌కు తెలిపాడు.

అప్పటిదాకా సాఫీగా సాగిన ప్రయాణంతో పోలిస్తే.. అక్కడి నుంచి అందరిలోనూ ఉత్కంఠ మొదలైంది. సుమారు ఐదు గంటల తర్వాత లునార్‌ మాడ్యూల్‌ నుంచి చంద్రుడి మీద అడుగు మోపాడు ఆర్మ్‌స్ట్రాంగ్. వెంట తెచ్చిన బీమ్‌ సిగ్నల్‌ ఆధారిత టీవీ కెమెరాతో అదంతా లైవ్‌ రికార్డు చేస్తూ వచ్చాడు. అలా అదొక అద్భుతమైన ఘట్టంగా మిగిలిపోయింది. “That one small step for man, one giant leap for mankind.”.. ఇది చంద్రుడి మీద అడుగుమోపిన మొదటి వ్యక్తి నీల్‌ ఆర్మ్‌స్ట్రాంగ్ చెప్పిన మాటలు. అప్పటికి టైం.. రాత్రి 10గం.56ని(ET). బజ్‌ అల్‌డ్రిన్‌ పది నిమిషాలకు బయటకు వచ్చేంత వరకు ఆర్మ్‌స్ట్రాంగ్ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అమెరికా జెండా పాతారు. కొన్ని పరికరాలను అక్కడ ఉంచారు. సంతోషంగా కలియతిరిగారు. ఈ మొత్తాన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 65 కోట్ల మంది టెలివిజన్‌లో ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించారు.
 

మూన్‌డేగా గుర్తింపు
ఆ ఇద్దరూ చంద్రుడి మీద 21 గంటలు గడిపినట్లు చెప్తుంటారు. అక్కడి మట్టిని సేకరించారు. అలాగే వాళ్లు దిగిన ప్రాంతానికి ‘ట్రాన్‌క్విలిటీ బేస్‌’ అనే పేరు పెట్టారు. చివరికి ఈ ఇద్దరూ కమాండ్‌ మాడ్యూల్‌ కొలంబియాలో కొలిన్స్‌తో కలిసి చివరికి భూమ్మీదకు ప్రయాణం అయ్యారు. జులై 24న వాళ్లు భూమ్మీద సేఫ్‌గా ల్యాండ్‌ కావడంతో ఆ అంకం విజయవంతంగా పూర్తైంది. నాసా దృష్టిలో అది ‘సింగిల్‌ గ్రేటెస్ట్‌ టెక్నాలజికల్‌ అఛీవ్‌మెంట్‌ ఆఫ్‌ ఆఫ్‌ ఆల్‌టైం’.

ఆ తర్వాత ఎన్నో దేశాల రోదసీ ప్రయోగాలకు బలం ఇచ్చిందది. 1971లో అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్‌ నిక్సన్‌ ఆ మధురక్షణాలకు గుర్తింపు ఉండాలని ప్రత్యేకంగా ఆ రోజును ‘మూన్‌ డే’గా ప్రకటించారు. ఈ విజయానికి గుర్తుగా ఎన్నో డాక్యుమెంటరీలు, ఆధారాలు కళ్ల ముందు కనిపిస్తుంటాయి. కానీ, చాలామంది దీనిని నమ్మరు. అదంతా కట్టుకథగా భావిస్తుంటారు. ఎందుకు..
 
కట్టుకథ.. కౌంటర్లు
బిల్‌ కేసింగ్‌ అనే అమెరికన్‌ రైటర్‌.. జులై 1969 నుంచి డిసెంబర్‌ 1972 దాకా జరిగిన అపోలో మూన్‌ ల్యాండింగ్స్ అన్నీ ఉత్త ప్రచారాలే అని ప్రచారం చేసిన మొదటి వ్యక్తి. చంద్రుడి మీద నాసా పరిశోధనలంతా నాటకమే అని అన్నాడాయన. ఆ తర్వాత ఆయన రూట్‌లో చాలామంది పయనించారు. అయితే ఈ వాదనను కొట్టేయడానికి సైంటిస్టులు ఆధారాలను ఎప్పటికప్పుడు చూపిస్తూ వస్తుంటారు. చాలామందికి కలిగిన కామన్‌ డౌన్‌ ఏంటంటే.. మూన్‌ ల్యాండింగ్‌ టైంలో నక్షత్రాలు కనిపించకపోవడం. చంద్రుడి మీద గాలి లేకపోవడంతో ఆకాశం నల్లగా ఉంటుంది. అలాంటప్పుడు నక్షత్రాలు కూడా కనిపించాలి కదా? అని అడిగారు. అయితే అవి కంటికి కనిపించనంత సూక్క్ష్మంగా ఉన్నాయని నాసా వివరణ ఇచ్చింది.

ఇక జెండా రెపరెపలాడడం. గాలి లేనప్పుడు జెండా ఎగిరిందని కొందరు ప్రశ్‌నించారు. అయితే ఆ జెండా కదలికలు వ్యోమగాములు పాతినప్పుడు కలిగినవేనవి వివరణ ఇచ్చారు. ఇక ముఖ్యమైన అనుమానం ఏంటంటే.. వాన్‌ లెన్‌ బెల్టులు. అంతరిక్షంలోని ఈ బెల్టుల గుండా ప్రయాణం వీలు కాదని, ఒకవేళ చేస్తే హై రేడియేషన్‌ ఎఫెక్ట్‌తో ప్రాణాలు పోతాయనేది కొందరి అభిప్రాయం కమ్‌ అనుమానం. అయితే వాళ్లు ప్రయాణించిన వేగం, తక్కువ టైంలో చేరుకవోడం వల్లే తక్కువ రేడియోధార్మికత నుంచి సురక్షితంగా బయటపడ్డారేది సైంటిస్టుల వాదన. 

ఇవన్నీ పక్కనపెడితే.. యాభై రెండేళ్లు పూర్తయ్యాక కూడా నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ మాటలు.. ఈనాటికీ అంతరిక్ష ప్రయోగాలప్పుడు ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. ఇక నాటి అద్భుతానికి ఆధారంగా.. చంద్రుడి మీద నుంచి తెచ్చిన మట్టి.. వివిధ దేశాల అంతరిక్ష ల్యాబ్‌ల్లో ఉన్న వాటి శాంపిల్స్‌, చంద్రుడిపై పాద ముద్రలు, 2009లో నాసా లునార్‌ రీ కన్నియసాన్స్‌ ఆర్బిటర్‌ తీసిన ఫొటోలు. చైనా, ఇండియా జపాన్‌ దేశాలు పంపిన స్పేస్‌ వెహికిల్స్‌ సేకరించిన సాక్క్క్ష్యాలు.. అన్నింటికి మించి రష్యాకు ధీటైన ప్రయోగంలో విజయం సాధించామనే నాసా సంబురాలు.. ఇంతకంటే సాక్క్ష్యం ఇంకేం కావాలనేది స్పేస్‌ సైంటిస్టుల మాట.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement