కడుపు కోత తీర్చిన కరోనా.. 13 ఏళ్ల తర్వాత.. | Emotional Son Meets Mom After 13 Years In Karnataka | Sakshi
Sakshi News home page

కడుపు కోత తీర్చిన కరోనా.. 13 ఏళ్ల తర్వాత..

Published Mon, May 31 2021 3:37 PM | Last Updated on Mon, May 31 2021 3:59 PM

Emotional Son Meets Mom After 13 Years In Karnataka - Sakshi

సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్​డౌన్​ కారణంగా తిరిగి అమ్మ చెంతకు చేరిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కొప్పళ జిల్లా కుషిగి తాలుకా జమలాపురం గ్రామానికి చెందిన గురుబసప్ప, పార్వతమ్మలు కుమారుడు దేవరాజ్​ 13 సంవత్సరాల క్రితం పీయూసీ చదువుతుండగా.. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో అప్పటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే, దేవరాజ్​ మాత్రం బెంగళూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. ఈ క్రమంలో లాక్​డౌన్​ ప్రకటించడంతో తల్లి కుటుంబ సభ్యలు గుర్తుకు వచ్చారు. దీంతో నేరుగా గ్రామానికి వచ్చాడు. ఊరి రూపురేఖలు మారిపోవడంతో ఓ ఆలయం ముందు ఉండగా చిన్ననాటి స్నేహితులకు ఈ సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో దేవరాజ్​ తల్లికి కూడా విషయం తెలియడంతో అక్కడికి చేరుకుని కుమారుడిని చూసి ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఇన్ని సంవత్సరాల తరువాత కుమారుడు ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆ తల్లి తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement