Mother &son
-
యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. తల్లికొడుకులు మృతి
లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఢిల్లీ-మీరట్ ఎక్స్‌ప్రెస్ హైవేపై రాంగ్ రూట్లో వేగంగా దూసుకువచ్చిన కారు రోడ్డుపై వెళుతున్న ఓ స్కూటర్‌ను బలంగా ఢీకొట్టింది. దీంతో స్కూటర్‌పై వెళుతున్న తల్లికొడుకులు రోడ్డుపై చాలా దూరం ఎగిరిపడ్డారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. శనివారం(జులై 20) జరిగిన ఈ ప్రమాద దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి. ప్రమాదానికి కారణమైన కారు డ్రైవర్‌ను అరెస్టు చేశామని, కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. -
Moushmi Kapadia: ఎడారి చీకటి నుంచి వెన్నెల వెలుగులోకి...
‘మీ బిడ్డ నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని వైద్యులు చెప్పినప్పుడు ఎత్తైన చోటు నుంచి చీకటిలోయల్లో పడిపోయినట్లు తల్లడిల్లి పోయింది . మూడు సంవత్సరాలు డిప్రెషన్ చీకట్లో కూరుకుపోయిన మౌష్మి ఒక్కొక్క అడుగు వేస్తూ వెలుగుదారిలోకి వచ్చింది. ఆట–పాటలతో తనలో ఉత్సాహాన్ని నింపుకొంది. ఆ ఉత్సాహాన్ని శక్తి చేసుకుంది. గా దేశాన్ని చుట్టి వచ్చింది. గా ఎన్నో సాహసాలు చేసింది ఇంటి గడప దాటలేడు అనుకున్న కుమారుడికి ప్రపంచం చూపుతూ ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తోంది మౌష్మి కపాడియా... మౌష్మి కపాడియా కుమారుడు ఆర్ఎస్ఎమ్డీ) అని నిర్ధారించిన వైద్యులు ‘ఇది నయం చేయలేని వ్యాధి’ అన్నారు. ఆ బాధ మాటలకు అందనిది. తట్టుకోలేనిది. తనలో తాను ఎంతో కుమిలిపోయింది మౌష్మి. పిల్లాడికి సంబంధించి ఏం చేయాలి? ఏం చేయకూడదు, ఎలా కేర్ తీసుకోవాలో వివరించారు వైద్యులు. వేదాన్షును తీసుకొని దుబాయ్‌లో ఉద్యోగం చేస్తున్న భర్త ప్రియేష్ దగ్గరకు వెళ్లింది. మూడేళ్ల వయసులో వేదాన్ష్ కు గురయ్యాడు. ఐసీయూలో ఉన్న తన బిడ్డను చూసి కుప్పకూలిపోయింది మౌష్మి. ఆ భయానకమైన రోజు ఇప్పటికీ తన కళ్లముందే కదలాడుతున్నట్టు ఉంటుంది. బిడ్డ పరిస్థితి ఎలా ఉండబోతుందో తెలియదు. తాను చేయగలిగిందల్లా దూరం నుంచి బిడ్డను చూస్తూ మనసులో ఏడ్వడం మాత్రమే. ఆశ కోల్పోయిన వైద్యులు... ‘దేవుడిని ప్రార్థించండి. మేము మా వంతు ప్రయత్నం చేశాం’ అన్నారు. ఈ మాటలు తనను మరింత కృంగిపోయేలా చేశాయి. వెంటిలేటర్‌పై అయిదురోజులు ఉన్నాడు వేదాన్షు. ఆ హాస్పిటల్లో పనిచేసే డాక్టర్ ఒకరు మెరుగైన చికిత్స కోసం ఇండియాకు వెళితే మంచిది అని సలహా ఇచ్చాడు. అతడి సలహా ప్రకారం బిడ్డను తీసుకొని భర్తతో కలిసి ముంబైకి వచ్చింది మౌష్మి. అబ్బాయిని ఇంటికి తీసుకువెళ్లిన రోజును గుర్తు తెచ్చుకుంటే ఇప్పటికీ వణికిపోతుంది మౌష్మి. ‘ఇరవై ఏళ్ల క్రితం దుబాయ్‌లో వైద్యసదుపాయాలు అంత బాగాలేవు. శ్వాస తీసుకోవడానికి అవసరమైన ప్రత్యేక యంత్రాలు లేవు’ అని దుబాయ్‌లో ఆనాటి పరిస్థితులను గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. ముంబైలోని హాస్పిటల్లో కొన్నిరోజులు ఉన్న తరువాత వేదాన్షు పరిస్థితి మెరుగుపడింది. ఆశాదీపం ఏదో కనిపించి ఆ క్షణంలో ధైర్యం ఇచ్చింది. అయితే వైద్యులు మాత్రం... ‘నాలుగు–అయిదు సంవత్సరాలకు మించి బతకడు’ అని చెప్పారు. బలహీనమైన ఊపిరితిత్తుల వల్ల వేదాన్షు ఎన్నోసార్లు నిమోనియా బారిన పడ్డాడు. ‘ఇంటి నుంచి ఆస్పత్రి–ఆస్పత్రి నుంచి ఇంటికి’ అన్నట్లు ఉండేది పరిస్థితి. కొంత కాలం తరువాత మరో బిడ్డకు జన్మనిచ్చింది మౌష్మి. ఇది మౌష్మి జీవితాన్ని మరింత కష్టాల్లోకి నెట్టింది. డిప్రెషన్ అనే చీకట్లోకి తీసుకెళ్లింది. ‘అకారణంగా కోపం వచ్చేది. చీటికిమాటికి చిరాకు పడేదాన్ని. తలుపులు గట్టిగా వేసేదాన్ని. నేను డిప్రెషన్లో ఉన్నాను అనే విషయం అప్పుడు తెలియదు. ఇలా ఎందుకు చేస్తున్నాను? అని నా గురించి నేను ఆలోచించే పరిస్థితిలో లేను. ఆ సమయంలో నా ఫ్రెండ్ ఒకరు కౌన్సిలింగ్‌కు వెళ్లమని సలహా ఇచ్చారు’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. అయితే మందుల ప్రభావంతో ఆమె బరువు పెరిగింది. ఆ బరువు మోకాళ్లపై ప్రతికూల ప్రభావం చూపింది. ‘ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి’ అని చెప్పారు వైద్యులు. అలా తన ఫిట్నెస్ జర్నీ మొదలైంది. కొత్త జీవితానికి మొదటి అడుగు పడింది. తనకు ఇష్టమైన టెన్నిస్ ఆడడం మొదలు పెట్టింది. ఆడుతున్న సమయంలో తన మూడ్ చేంజ్ అవుతున్నట్లు, ఉత్సాహం వచ్చి చేరుతున్నట్లు అనిపించింది. జుంబా క్లాసులలో కూడా చేరి మరింత ఉత్సాహాన్ని పెంచుకుంది. మూడేళ్లపాటు డిప్రెషన్‌తో పోరాడి బయట పడిన మౌష్మి ఇద్దరు బిడ్డలను కంటి పాపల్లా చూసుకోవాలనుకుంది. ‘గత చేదు అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ప్రపంచంలోని బెస్ట్ మామ్ కావాలనుకున్నాను’ అని గతాన్ని గుర్తు తెచ్చుకుంటుంది మౌష్మి. మూడు సంవత్సరాలుగా తనను వెంటాడిన నిరాశానిస్పృహలు, విషాదం కోపం లాంటి వాటి నుంచి బయటపడిన తరువాత పిల్లలతో హాయిగా గడిపే కాలం, పిల్లలే నా ప్రపంచం అనే కల కన్నది. బైక్‌పై దేశాన్ని చుట్టి రావాలి... ఎత్తైన పర్వతశిఖరాలను అధిరోహించాలి అనేది తన కల. పీడకలలాంటి జీవితం నుంచి బయటపడ్డ మౌష్మి కపాడియా తన కలను నిజం చేసుకుంది. పర్వతారోహణకు సంబంధించి ఎన్నో సాహసాలు చేసింది. ఇంటికే పరిమితం అవుతాడనుకున్న వేదాన్షుకు ప్రపంచాన్ని చూపింది. ‘విషాదం తప్ప అతడికి తోడు ఏదీ లేదు’ అని ఇతరులు సానుభూతి చూపే సమయంలో ‘నిరంతరం ఆనందమే నా బలం’ అని ధైర్యంగా ముందుకువెళ్లేలా చేసింది. బిడ్డతో కలిసి 21 దేశాలకు వెళ్లి వచ్చిన మౌష్మి కపాడియా ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకుంది. సవాళ్లను అధిగమించేలా... వేదాన్ష్లో వయసుకు మించిన పరిణతి కనిపిస్తుంది. ఓటమికి తలవంచని వేదాన్షు నోటి నుంచి తరచుగా వచ్చే మాట ‘హ్యాపీ ఎబౌట్ ఎవ్రీ థింగ్ అండ్ శాడ్ ఎబౌట్ నథింగ్’ ‘జీవితం మన ముందు ఎన్నో సవాళ్లు పెడుతుంది. వాటిని అధిగమిస్తామా లేదా అనేదానిపైనే మనం ముందుకు వెళ్లే దారి నిర్ణయం అవుతుంది’ అంటాడు వేదాన్ష్. -
దేవుడా! ఇలాంటి కష్టం పగవాడికి కూడా వద్దు: వైరల్ లెటర్
ఈ భూప్రపంచంలో అమ్మను మించిన ప్రేమ దొరకదు. ఆ ప్రేమకు మరో ప్రత్యామ్నాయం లేదు. తన ప్రాణాలు పోతున్నా కూడా బిడ్డ క్షేమం గురించే ఆలోచిస్తుంది. ఈ విషయం అనేక సార్లు రుజువైంది. తాజాగా కేన్సర్‌తో చనిపోతూ తన కుమారుడికి రాసిన ఒక లేఖ ఇంటర్నెట్లో సంచలనంగా మారింది. పలువురి చేత కన్నీళ్లు పెట్టిస్తోంది. రెడ్డిట్ యూజర్ మాట్ గాల్డ్ కేన్సర్‌తో చనిపోవడానికి ముందు తన తల్లి రాసిన ఒక లేఖను పోస్ట్ చేశారు. చని పోతానని తెలిసి తన కొడుకుపై ప్రేమను, తన బాధను ఈ లేఖలో వ్యక్తం చేసింది ఆ మాతృమూర్తి. ‘‘కన్నా నేను చనిపోతానన్న బాధకన్నా, నిన్ను విడిచి వెళ్లాలన్న ఆలోచన నా ప్రాణాల్ని తోడేస్తోంది. నా తరువాత నిన్ను ఎవరు చూసకుంటారు అనేదే ఎక్కువ బాధగా ఉంది. ఏదో ఒకరోజు నీకు ఇది దొరుకుతుందనే ఆశతో ఈ ఉత్తరం వ్రాస్తున్నాను. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో నీకు తెలుసని ఆశిస్తున్నాను.. నువ్వు నా బంగారు కొండవి. మరే ఆదాయం రాదని తెలిసినా నాకోసం ఉద్యోగం మానేసి మరీ ఎంతో సేవ చేసావ్. నీతో గడిపిన ప్రతీ క్షణం చాలా అద్భుతం. ఎప్పుడూ నీతోనే రా..నాన్నా. ఆ పైనుంచి నిన్ను చూస్తూనే ఉంటాను కన్నా.!" అంటూ మాట్ గాల్డ్ చేసిన త్యాగాలకు ధన్యవాదాలు తెలుపుతూ ఆమె రాసిన లేఖ నెటిజన్లు భావోద్వేగానికి లోను చేసింది. ‘‘ప్రతిరోజూ అమ్మను మిస్ అవుతున్నా.. ఏడుపొస్తోంది. కానీ చిరునవ్వు మధ్య ఆ బాధనంతా దిగమింగుతున్నాను. ఎందుకంటే నాన్న కూడా కేన్సర్‌తో బాధపడుతూ ఐసీయూలో ఉన్నారు. ఆయన్ని చూసుకోవాలి’’ అంటూ మాట్ గాల్డ్ రెడ్డిట్ పోస్ట్ లో రాసుకొచ్చారు. దీంతో నెటిజన్లు సారీ బ్రో అంటూ కమెంట్ చేశారు. నిజంగా మీరు మంచి కొడుకు.. మీకు అంతా మంచి జరగాలని అని కొందరు, అమ్మ ప్రేమ ఎపుడూ మీతోనే... తల్లీ కొడుకుల అనుబంధం ఎప్పటికీ శాశ్వతమే అని మరొకరు వ్యాఖ్యానించారు. మీ కోసం ఆమె కన్న కలలతోపాటు మీ కలలు కూడా నిజం కావాలి అంటూ మరికొందరు యూజర్లు అతనికి ఓదార్పునిచ్చారు. -
తల్లీకొడుకులకు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం
తిరువనంతపురం: ఎవరైనా ప్రభుత్వం ఉద్యోగం సాధిస్తే ఆ కుటుంబంలో ఆనందానికి అవధులు ఉండవు. ఒక్కోసారి ఒకే ఇంట్లో ఇద్దరు, లేదా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగం సాధిస్తారు. కానీ, ఒకేసారి తల్లీకొడుకులకు ఉద్యోగం రావటం చూశారా? అవునండీ.. కేరళలో ఈ సంఘటన జరిగింది. మలప్పురమ్‌కు చెందిన బిందు అనే మహిళ, ఆమె కుమారుడు ఒకేసారి ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. బిందు తన కుమారుడు 10వ తరగతి చదువుతున్న సమయంలో అతడిని ప్రోత్సహించేందుకు పుస్తకాలు చదవటం ప్రారంభించారు. అదే ఆమెను కేరళ పబ్లిక్ సర్వీస్ కమిషన్(పీఎస్సీ) పరీక్షలవైపు మళ్లించింది. తొమ్మిదేళ్ల తర్వాత కుమారుడితో పాటు ఉద్యోగం సాధించారు. 42 ఏళ్ల బిందు.. లాస్ట్ గ్రేడ్ సర్వెంట్(ఎల్జీఎస్) పరీక్షలో 92వ ర్యాంకు సాధించారు. 24 ఏళ్ల ఆమె కుమారుడు లోవర్ డివిజనల్ క్లర్క్(ఎల్డీసీ) పరీక్షలో 38వ ర్యాంక్ సాధించాడు. ఈ విషయాన్ని ఓ టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు బిందు. కుమారుడిని ప్రోత్సహించేందుకు చదువు మొదలు పెట్టిన బిందు.. ఆ తర్వాత కోచింగ్ సెంటర్లో చేరారు. కుమారుడి డిగ్రీ పూర్తవగానే అతడిని సైతం కోచింగ్ సెంటర్లో చేర్పించారు. రెండు సార్లు ఎల్జీఎస్, ఒకసారి ఎల్డీసీ పరీక్ష రాసినా ఉత్తీర్ణత సాధించలేకపోయారు. నాలుగో సారి విజయాన్ని అందుకున్నారు. అయితే.. తన లక్ష్యం ఐసీడీఎస్ సూపర్వైజర్ పరీక్ష అని... ఎల్జీఎస్ బోనస్ అని పేర్కొన్నారు బిందు. గత 10 ఏళ్లుగా అంగన్వాడీ టీచర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇదీ చదవండి: Lucknow Hospital Video: బర్త్ డే పార్టీ పేరుతో ఆసుపత్రిలో విద్యార్థుల హల్చల్.. వీడియో వైరల్! -
కిరాతక దుశ్చర్య.. కూరతో భోజనం పెట్టలేదని..
జి.మాడుగుల(విశాఖ జిల్లా): నవమాసాలు మోసి, కని పెంచిన తల్లిని మద్యం మత్తులో ఓ యువకుడు కిరాతకంగా కొట్టి హత మార్చాడు. కూరతో కాకుండా రసంతో భోజనం పెట్టిందని గొడవకు దిగి గొడ్డలితో దాడి చేశారు. ఈ కిరాతక దుశ్చర్య జి.మాడుగుల మండలం వంతాల పంచాయతీ మారుమూల గ్రామమైన అడ్డులులో ఆదివారం అర్ధరాత్రి జరిగింది. చదవండి: రూ.లక్షల్లో బెట్టింగ్.. హార్స్ రేసుల్లాగా పావురాల రేస్.. ఇలా తీసుకొచ్చి.. చివరికి.. సీఐ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... గ్రామానికి చెందిన రేగం రాజులమ్మ, రామన్న దొర దంపతులు. వీరికి ముగ్గురు పిల్లలు. కుమార్తె, పెద్ద కుమారుడికి వివాహాలు జరిగాయి. చిన్న కుమారుడు మత్స్యలింగం, అర్జులమ్మ, రామన్న దొర కలిసి ఓ ఇంటిలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో మత్స్యలింగం పూటుగా మద్యం తాగి ఆదివారం అర్ధరాత్రి ఇంటికి చేరుకున్నాడు. భోజనం పెట్టమని తల్లి అర్జులమ్మ (60)ను కోరాడు. రసంతో అన్నం పెట్టడంతో తీవ్ర ఆగ్రహానికి గురయ్యాడు. కూరతో భోజనం పెట్టలేదని కోపగించుకుని తల్లితో గొడవకు దిగి కొట్టాడు. అడ్డుకున్న తండ్రి రామన్న దొరను బెదిరించడంతో ఆయన గ్రామంలోనే కొద్ది దూరంలో ఉన్న పెద్ద కొడుకు లక్ష్మణరావు ఇంటికి పరుగుతీశాడు. ఇంతలో మత్స్యలింగం గొడ్డలి వెనుక భాగంతో అర్జులమ్మ తలపై తీవ్రంగా కొట్టాడు. గాయపడిన ఆమె అక్కడిక్కడే మృతిచెందింది. పెద్దకొడుకు వద్దకు పారిపోయిన రామన్న సోమవారం ఇంటికి వెళ్లి చూసేసరికి రాజులమ్మ మృతిచెంది ఉంది. మత్స్యలింగం పరారయ్యాడు. రామన్నదొర సోమవారం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు సీఐ తెలిపారు. -
విషాదం: పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుని..
యశవంతపుర(కర్ణాటక): ప్రమాదశాత్తు చెరువులో పడి తల్లి, కుమారుడు మృతి చెందిన విషాద ఘటన దక్షిణ కన్నడ జిల్లా సుళ్య తాలూకా నెల్లూరు కేమ్రాజీ గ్రామంలో ఆదివారం జరిగింది. వివరాలు... మైల్కా ర్ నివాసి సంగీత (30), కుమారుడు అభిమన్య (4) రెండు రోజుల క్రితం మాపలకజెలోని పుట్టింటికి వచ్చారు. ఉదయం మెల్కార్‌కు వెళ్లాల్సి ఉండగా తల్లి కొడుకు విహారానికి చెరువు వద్దకు వెళ్లారు. ఈ క్రమంలో నాలుగేళ్ల చిన్నారి కాలుజారి చెరువులో పడ్డాడు. కొడుకును రక్షించే క్రమంలో సంగీత కూడా నీటిలో దిగి మునిగిపోయింది. అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకుని మృతదేహాలను వెలికితీశారు. పుట్టింటికి వచ్చి ప్రాణాలు పోగొట్టుకుందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. -
కడుపు కోత తీర్చిన కరోనా.. 13 ఏళ్ల తర్వాత..
సాక్షి,బళ్లారి(కర్ణాటక): కరోనా కష్టకాలం ఓ కుటుంబానికి కడుపుకోత తీర్చింది. 13 ఏళ్ల క్రితం వెళ్లిపోయిన కుమారుడు లాక్డౌన్ కారణంగా తిరిగి అమ్మ చెంతకు చేరిన ఘటన ఇది. వివరాల్లోకి వెళితే.. కొప్పళ జిల్లా కుషిగి తాలుకా జమలాపురం గ్రామానికి చెందిన గురుబసప్ప, పార్వతమ్మలు కుమారుడు దేవరాజ్ 13 సంవత్సరాల క్రితం పీయూసీ చదువుతుండగా.. కుటుంబ సమస్యలతో ఇంటి నుంచి వెళ్లిపోయాడు. దీంతో అప్పటి నుంచి అతని కోసం గాలిస్తూనే ఉన్నారు. అయితే, దేవరాజ్ మాత్రం బెంగళూరులో చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలం గడిపాడు. ఈ క్రమంలో లాక్డౌన్ ప్రకటించడంతో తల్లి కుటుంబ సభ్యలు గుర్తుకు వచ్చారు. దీంతో నేరుగా గ్రామానికి వచ్చాడు. ఊరి రూపురేఖలు మారిపోవడంతో ఓ ఆలయం ముందు ఉండగా చిన్ననాటి స్నేహితులకు ఈ సమాచారం రావడంతో వారు అక్కడికి చేరుకున్నారు. ఇదే సమయంలో దేవరాజ్ తల్లికి కూడా విషయం తెలియడంతో అక్కడికి చేరుకుని కుమారుడిని చూసి ఒక్కసారిగా తీవ్ర ఉద్వేగానికి లోనైంది. ఇన్ని సంవత్సరాల తరువాత కుమారుడు ఇంటికి రావడం ఎంతో ఆనందంగా ఉందని ఆ తల్లి తెలిపింది. -
గుంటూరులో విషాదం..
గుంటూరు ఈస్ట్: భర్త మృతి చెందడంతో మానసికంగా కుంగిపోయిన భార్య మతిస్థిమితంలేని కుమారుడితో పురుగుమందు తాగించి, తానూ తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పాతగుంటూరు స్టేషన్ పరిధిలో కలకలం రేపింది. ఎస్హెచ్ఓ సురేష్‌బాబు కథనం మేరకు.. తమ్మా రంగారెడ్డి నగర్ నాలుగో లైనులో నివసించే సయ్యద్ అహ్మద్ పూల వ్యాపారం చేస్తుంటాడు. అతనికి ముగ్గురు కుమారులు. పెద్ద కుమారుడు కరీముల్లా వివాహం చేసుకుని తల్లిదండ్రుల ఇంటి సమీపంలోనే వేరుగా నివసిస్తున్నాడు. రెండో కుమారుడు సుభానీ, మూడో కుమారుడు ఎస్థాని మానసికంగా ఎదగని కారణంగా తల్లిదండ్రుల వద్దే ఉంటున్నారు. మూడు నెలల క్రితం సయ్యద్ అహ్మద్ గుండె జబ్బుతో మృతి చెందాడు. భర్త మృతిని జీరి్ణంచుకోలేక భార్య చాంద్‌బీ మానసికంగా కుంగిపోయింది. ‘మీ నాన్న నన్ను పిలుస్తున్నాడు.. మీ నాన్న వద్దకు వెళ్తున్నా’ అంటూ కుమారులతో దిగులుగా చెప్పేది. దీంతో కరీముల్లా తల్లిని, ఇద్దరు తమ్ముళ్లను తన ఇంటికి తీసుకెళ్లి వారి పోషణ చూస్తున్నాడు. చాంద్‌బీ మూడో కుమారుడు ఎస్థానీని తీసుకుని బుధవారం తన ఇంటికి వెళ్లిపోయింది. కరీముల్లా, సుభానీ తాము పూలు విక్రయించే దుకాణానికి వెళ్లిపోయారు. రాత్రి 10 గంటల సమయంలో సుభానీ తల్లి నివసించే ఇంటికి వెళ్లగా ఆమె తలుపులు తీయలేదు. దీంతో పెద్దన్న కరీముల్లా వద్దకు వెళ్లి విషయం చెప్పాడు. కరీముల్లా తల్లి నివసిస్తున్న ఇంటికి వెళ్లగా తలుపు లోపల గడియపెట్టి ఉంది. పక్కన బలహీనంగా ఉన్న మరో తలుపును తెరచి లోపలకు వెళ్లి చూడగా చాంద్‌బీ, ఎస్థాని నురగలు కక్కుతూ అచేతనంగా నేలపై పడి ఉన్నారు. ఇద్దరినీ జీజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతూ వారు మృతి చెందారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కిరాతకం.. తల్లి మందలించిందని...
మండ్య: మొబైల్ ఫోన్ వ్యసనం ఓ యువకున్ని హంతకునిగా మార్చింది. ఎప్పుడూ ఫోనేనా, బుద్ధిగా చదువుకో, ఇంట్లో పనులు చేయవచ్చు కదా అని బుద్ధిమాటలు చెప్పిన తల్లిని అంతమొందించాడో తనయుడు. మొబైల్ మత్తులో ఏం చేస్తున్నాడో కూడా తెలియని క్రూరునిగా మారాడు. గత గురువారం మండ్యలోని విద్యా నగరలో ఇంట్లోనే ఒక మహిళ హత్యకు గురైంది. కత్తిపోట్లతో రక్తపుమడుగులో పడి ఉన్న మృతదేహం ఫోటోలు తీవ్ర కలకలం సృష్టించాయి. హతురాలిని శ్రీలక్ష్మి (45)గా గుర్తించారు. విచారణలో నేరం రట్టు ఇంత దారుణంగా ఎవరు చంపి ఉంటారని పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆమె కుమారుడు మను శర్మ (21)నే హంతకుడని శనివారం గుర్తించడంతో అందరూ నిశ్చేష్టులయ్యారు. తల్లి ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో చాకుతో పొడిచి ఇంటి నుంచి వెళ్ళియాడు. పోలీసులు ఇంటికి వచ్చి హత్యాస్థలిని పరిశీలిస్తున్న సమయంలో తిరిగి వచ్చిన మను శర్మ ఏమీ తెలియనివాడిలా నటించాడు. పోలీసులు కుటుంబ సభ్యులను పిలిపించి విచారణ చేపట్టారు. విచారణలో దొరికిపోయిన మనుశర్మ తానే తల్లీని హత్య చేసినట్లు ముందు ఒప్పుకున్నాడు. ఏం జరిగిందంటే మధుసూదన్, శ్రీలక్ష్మి దంపతుల చిన్న కుమారుడు అయిన మను శర్మ బీఎస్సి చివరి ఏడాది చదువుతున్నాడు. ఇతను ఎప్పుడూ మొబైల్ఫోన్లో లీనమయ్యేవాడు. యువతితో కూడా ఫోన్లో మాట్లాడేవాడు. ఇది మంచిది కాదు అని తల్లి మనుశర్మను మందలించేది. అతడు బయటకి వెళ్లకుండా కట్టడి చేసేది. గురువారం అతని కోసం స్నేహితుడు రాగా, బటయకు వెళ్ళవద్దని తల్లి హెచ్చరించింది. తరువాత తల్లీ కొడుకు మధ్య గొడవ మొదలైంది. ఆగ్రహంతో తల్లి అతని తలపైన గట్టిగా కొట్టడంతో మనుశర్మ వంటగదిలోకి వెళ్ళి చాకు తీసుకొని వచ్చి తల్లి మీద దాడికి దిగాడు. కత్తితో విచ్చలవిడిగా పొడిచి వెళ్లిపోయాడు. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. హత్య జరిగిన కొంత సమయానికి భర్త మధుసూదన్, మరో కుమారుడు ఆదర్శ వచ్చి చూడగా శ్రీలక్ష్మి మృతదేహం కనిపించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు పరిశీలన చేస్తున్న సమయంలో మను శర్మ వచ్చాడు. పోలీసుల విచారణలో చిక్కుముడి వీడింది. నిందితున్ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. -
యుపిఎస్ బ్యాటరీ పేలి తల్లికొడుకు మృతి
-
ఇటుకతో కొట్టి ఇద్దరు కొడుకులను చంపిన తల్లి
కోల్‌సిటీ(రామగుండం): ‘రాతి బొమ్మల్లోన కొలువైన శివుడా... రక్తబంధం విలువ నీకుతెలియదురా... నుదుటిరాతలు రాసే ఓ బ్రహ్మదేవా.. తల్లికొడుకుల ప్రేమ నీవు ఎరుగవురా’ అంటూ తన కొడుకు కోసం ‘తల్లి’డిల్లిన పాట ప్రతీతల్లి హృదయాన్ని కలిచి వేస్తుంది. పిల్లలు పుట్టాలని ఎందరో వ్రతాలు చేస్తున్నారు. మహాశివరాత్రికి జాగారం చేస్తున్నారు... పుట్టినబిడ్డ కాలికి రాయి తగితేనే విలవిల్లాడి పోతారు. కానీ గోదావరిఖనిలో ఓ అమ్మ... తన రెండు కనుపాపలను తనే పొడుచుకుంది. ఇటుకతో ఇద్దరు కొడుకులపై విచక్షణ రహితంగా దాడి చేసింది. తలలు పగిలి మెదడు బయటపడేలా కొట్టింది.. ‘అమ్మా.. ప్లీజ్ నొప్పిగా ఉందమ్మా... ప్లీజ్ కొట్టకమ్మా... అంటూ ప్రాధేయపడినా ఆ తల్లి మనసు కరుగలేదు. గోదావరిఖనిలో సోమవారం జరిగిన ఈ దారుణఘటన ప్రతీ ఒక్కరినీ కంటతడి పెట్టించింది. గోదావరిఖని సప్తగిరికాలనీకి చెందిన బద్రి శ్రీకాంత్–రమాదేవి దంపతులిద్దరూ ఉన్నత విద్యావం తులే. శ్రీకాంత్ ఎమ్మెస్సీ బీఈడీ చేయగా, రమాదేవి బీఎస్సీ బీఈడీ చదివింది. వీరి పెద్ద కొడుకు అజయ్‌కుమార్(10) 4వ తరగతి, చిన్న కొడుకు ఆర్యన్(6) ఎల్కేజీ చదువుతున్నారు. శ్రీకాంత్ స్థానిక రమేష్‌నగర్‌లోని ప్రభుత్వ మైనార్టీ గురుకుల పాఠశాలలో కాంట్రాక్ట్ పద్ధతిలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నాడు. రమాదేవి కొంత కాలం ప్రైవేట్టీచర్గా పనిచేసి, ఇప్పుడు ఇంట్లోనే ఉంటోంది. చికిత్స పొందుతూ మృతి.. తల పగిలి అపస్మారకస్థితిలో ఉన్న అజయ్‌కుమార్ చికిత్స ప్రారంభించేలోగా గోదావరిఖని ప్రభుత్వాసుపత్రిలో మృతి చెందాడు. కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్న చిన్న కొడుకు ఆర్యన్‌ను మెరుగైన చికిత్స కోసం కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఐదు గంటలు ప్రాణాలతో కొట్లాడి తుదిశ్వాస విడిచాడు. కన్నీరుపెట్టిన కాలనీ.. ఈ సంఘటన సప్తగిరికాలనీలో రెండు కుటుంబాలతోపాటు కాలనీ ప్రజలను కంటతడిపెట్టించింది. చిన్నారుల మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. అజయ్‌కుమార్, ఆర్యన్ మృతదేహాలను పక్కపక్కనే పెట్టిన ఈ దృశ్యం కుటుంబ సభ్యులతోపాటు, స్థానిక ప్రజలను కన్నీరు పెట్టించింది. సాయంకాలానికి అన్నదమ్ములిద్దరికి అంత్యక్రియలు పూర్తి చేశారు. అమ్మచేత అన్నం తినకుండానే కన్నుమూశారు సోమవారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయాన్నే గంగస్నానం చేసి వచ్చి సంతోషంగా అమ్మ చేత అన్నం తినాలని పిల్లలు సంతోషపడ్డారు. స్నానం చేసి కొత్త బట్టలు వేసుకోవాలని ఎదురుచూశారు. గురుకులంలో పనిచేసిన శ్రీకాంత్ ఆదివారం రాత్రి అక్కడే బస చేసి సోమవారం ఉదయం ఇంటికి పూజా సామగ్రితోపాటు పిల్లలకు అల్పాహారం, పండ్లు తీసుకువచ్చాడు. కానీ అప్పటికే ఇంట్లో జీవచ్ఛవాలుగా పడి ఉన్న కొడుకులిద్దరినీ చూసి గుండెలవిసేలా రోదించాడు. కనికరించని తల్లిమనసు.. పిల్లలిద్దరూ బయటకు వెళ్లకుండా గేటుకు తాళం వేసిన రమాదేవి కొడుకులపై ఒక్కసారిగా దాడి చేసింది. ఇటుకతో అజయ్‌కుమార్, ఆర్యన్ తలలపై విచక్షణారహితంగా కొట్టింది. ప్లీజ్ మమ్మీ.. నొప్పిగా ఉంది.. కొట్టకు మ మ్మీ.. అంటూ కొడుకులిద్దరూ ప్రాధేయపడు తూ దెబ్బలకు తట్టుకోలేక విలవిల్లాడిపో యారు. అప్పటికే తలలు పగిలి రక్తం కారుతున్నా పిల్లలను చూసినా ఆ తల్లి మనసు కనికరించలేదు. తలలు పగిలి కుప్పకూలారు. రక్తపు మడుగులో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న కొడుకులిద్దరిని తండ్రితోపాటు స్థానికులు గోదావరిఖని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కొడుకులను చంపిన ఆవేశం దంపతుల మధ్య కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. శ్రీకాంత్ తల్లిదండ్రులు, రమాదేవి తల్లిదండ్రులు కలిసి సప్తగిరికాలనీలో ఓ ఇంటిని కొనుగోలు చేసి శ్రీకాంత్–రమాదేవికి ఇచ్చారు. అయితే తండ్రితో చనువుగా ఉంటున్న ఇద్దరు కొడుకులు తనతోమాత్రం సరిగా ఉండడం లేదని పిల్లలపై రమాదేవి కోపం పెంచుకునేదని శ్రీకాంత్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నా డు. అదే ఆవేశం కొడుకుల ప్రాణంతీసింది. అమ్మా మాకెందుకీ శిక్ష! పెద్దపల్లి: అదిగో శివ నామస్మరణం.. ఇంటింటా శివరాత్రి సందర్భంగా ఉపవాస దీక్షలు.. తమ్ముడూ ఆర్యన్ లే.. నిన్నే కాదు అమ్మ నన్ను కూడా కొట్టింది.. నా తల పగిలి రక్తం కారుతోంది.. నాకేం వినిపించడం లేదు, కనిపించడం లేదు ఒక శివనామస్మరణ తప్ప.. జోల పాడిన అమ్మ మనకెందుకు మరణశిక్ష విధించింది.. నవమాసాలు మోసి కన్న మమ్ముల్ని తప్పటడుగులు వేసినప్పుడు కాలు జారి కింద పడితేనే విలవిల్లాడిన అమ్మ ఇటుకరాయితో నిన్ను బాదుతుంటే అడ్డం వచ్చిన నా తలపైనా కొట్టింది. లేరా తమ్ముడు అన్నయ్య అజయ్ శివాలయానికి వెళ్దాం.. శివపూజలు చేద్దాం.. అమ్మ మనసు మార్చమని వేడుకుందాం.. ఆగండి, మా తమ్ముడిని ఎటు తీసుకెళ్తున్నారు.. ఆస్పత్రి వద్దు మాకేం కాలేదు.. గోరుముద్దలు తినిపించిన అమ్మ కొట్టిన దెబ్బలు మమ్మల్నేం చేయలేవు.. ఎన్నో రోజులు ఉపవాసం ఉండి మాకు స్వీట్లు తినిపించిన అమ్మ ఇప్పుడు మమ్ముల్ని రాయితో కొట్టి రక్తం కళ్ల చూసింది.. ఊపిరి ఆడడం లేదు.. కనుచూపు కనిపించడం లేదు.. అదిగో డాక్టర్లు వచ్చి తమ్ముడిని, నన్నూ కోసి మూటగట్టి నాన్నకు అందజేస్తున్నారు. ఏడవకండి పండగ పూట మా కన్నీళ్లు మీకు శివరాత్రి జాగరణగా మార్చాయని తెలుసు. అందరినీ విడిచి.. ఈ లోకాన్ని వదిలి వెళ్లిపోతున్నాం. – అజయ్, ఆర్యన్ల ఆత్మఘోషకు అక్షరరూపం పోలీసుల అదుపులో నిందితురాలు రమాదేవిని వన్‌టౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే పిల్లలను విచక్షణారహితంగా కొట్టిన తర్వాత, రమాదేవి ఇంట్లోకి వెళ్లి గ్యాస్ లీక్ చేసి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నం చేసిందని రమాదేవి తండ్రి పాపయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. తన ఇద్దరి మనమళ్లను ఎందుకు కొట్టి చంపాల్సి వచ్చిందో అర్థం కావడం లేదని తెలిపాడు. సంఘటనాస్థలాన్ని పెద్దపల్లి డీసీపీ సుదర్శన్‌గౌడ్, గోదావరిఖని ఏసీపీ ఉమేందర్, వన్‌టౌన్ సీఐ పర్శ రమేశ్ పరిశీలించి కుటుంబసభ్యుల నుంచి వివరాలు సేకరించారు.శ్రీకాంత్ ఫిర్యాదు మేరకు హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
ఆర్థిక ఇబ్బందులతో తల్లీకొడుకు ఆత్మహత్య
సాక్షి, నల్గొండ: నల్గొండ జిల్లా మునుగోడు మండలం వెల్మకన్నెలో సోమవారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి తల్లీకొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను మారెమ్మ(58), యాదయ్య(38)గా గుర్తించారు. గత కొంత కాలంగా వీరు ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. దాంతో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకున్నట్లు చెబుతున్నారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మరణించడంతో వెల్మకన్నెలో విషాదఛాయలు అలుముకున్నాయి. -
కట్నం అడిగారు.. జైలుకెళ్లారు..
తణుకు(పశ్చిమగోదావరి జిల్లా): వరకట్నం కేసులో తణుకు కోర్టు తల్లీకొడుకులకు జైలు శిక్ష విధించింది. అదనపు కట్నం తీసుకురమ్మని, మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నారనే ఆరోపణలు రుజువు కావడంతో తల్లి, కొడుకులకు ఆర్నెల్లుపాటు జైలుశిక్ష విధిస్తూ తణుకు కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు. పోలీసుల వివరాల ప్రకారం తణుకు పట్టణానికి చెందిన తిరుబిల్లి రేఖరోహిణి బెంగళూరు పట్టణంలోని హౌరమావు గ్రామానికి చెందిన జోసఫ్ రాజేష్‌లకు ఆరేళ్లక్రితం వివాహం అయ్యింది. కొన్నాళ్ల తర్వాత అదనపు కట్నం తీసుకురావాలని వేధిస్తుండటంతో రేఖరోహిణి పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఏఎస్సై ఆర్.బెన్నిరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న బాధితురాలి భర్త జోసఫ్ రాజేష్, అత్త జోసఫ్ సెలీనాలను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కోర్టులో వాదోపవాదాలు అనంతరం తణుకు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి బి.శేషయ్య జోసఫ్ రాజేష్, జోసఫ్ సెలీనాలకు అర్నెల్లు జైలుశిక్షతోపాటు ఒకొక్కరికి రూ. 500 చొప్పున జరిమాన విధిస్తూ తీర్పు చెప్పారు. జరిమాన చెల్లించని పక్షంలో మరో నెల రోజుల పాటు జైలు శిక్ష అనుభవించాలని తీర్పుచెప్పారు.