- ఇన్‌లాండ్ లెటర్‌పై రూ.5
న్యూఢిల్లీ: పోస్టల్ శాఖకు నష్టాలు పెరుగుతున్నాయి. 2013-14 ఆర్థిక సంవత్సర నివేదిక ప్రకారం ఒక్కో పోస్టు కార్డుపై 7 రూపాయలు, ఇన్‌లాండ్ లెటర్‌పై రూ.5 నష్టాన్ని ఆ శాఖ భరిస్తోంది. కార్డు సగటు ఖర్చు రూ. 7.54 కాగా 50 పైసలకు, ఇన్‌లాండ్ లెటర్ ఖర్చు రూ. 7.49 కాగా రూ.2.50 కు అమ్ముతున్నారు. పోస్టు కార్డులు, లెటర్లు, బుక్‌పోస్టుల వల్లే అధిక నష్టాలు వస్తున్నాయి.
పార్సిల్స్, రిజిస్టర్‌పోస్టు, స్పీడ్‌పోస్టు, ఇన్సూరెన్స్, మనియార్డర్‌ల ద్వారా వచ్చిన ఆదాయమూ సగటు కంటే తక్కువగానే ఉంటోంది. 2013-14లో తమకు రూ.5,473.10 కోట్లు నష్టం వచ్చిందని పోస్టల్‌శాఖ తన వార్షిక నివేదికలో తెలిపింది. వివిధ డిపార్ట్‌మెంట్‌లు, మంత్రిత్వశాఖలనుంచి వసూలు చేసిన ఆదాయం రూ. 593 కోట్లు పోగా రూ. 5,473 కోట్లు నికర నష్టం వచ్చిందని తెలిపింది.