
సాక్షి, పులివెందుల : అధికార అండతో పులివెందులలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోయారు. రౌడీల్లా ప్రవర్తించారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీ అవినాష్ రెడ్డి చేసిన సవాల్‌ను స్వీకరించలేక అక్రమాలకు దిగారు. రాళ్లు, కర్రలతో దాడులకు పాల్పడ్డారు. ప్రజల్లో అలజడి సృష్టించారు. శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన పోలీసులు సైతం నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయారు.