పులివెందులలో టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి ప్రచారంలో స్వతంత్ర అభ్యర్థులు
బీటెక్ రవి ప్రచారంలో అభ్యర్థి అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి
టీడీపీ అభ్యరి్థకి ఎస్కార్ట్ తరహాలో వ్యవహరిస్తున్న
అక్కులగారి విజయ్‌కుమార్‌రెడ్డి మరో ఇద్దరిదీ ఇదే దారి
సాక్షి ప్రతినిధి, కడప: వారంతా తెలుగుదేశం పార్టీ మద్దతుదారులు. టీడీపీ చేపట్టే ప్రతి కార్యక్రమంలోనూ చురుగ్గా పాల్గొనే క్రియాశీలక కార్యకర్తలు. ఎన్నికల సంగ్రామంలో స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు, గుర్తింపు పొందిన పార్టీ అభ్యరి్థగా మరి కొందరు పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో టీడీపీ అభ్యర్థి కంటే మించి తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తున్నారు. ఈ తతంగం పులివెందుల నియోజకవర్గంలో తెరపైకి వచ్చింది. కలిసికట్టుగా ఒకే వాహనంలో, ఒకే గ్రామంలో టీడీపీ కోసం ప్రచారం కొనసాగిస్తున్న ఉదంతమిది.
👉పులివెందుల టౌన్‌కు చెందిన అక్కులుగారి విజయ్‌కుమార్‌రెడ్డి తెలుగుదేశం పార్టీలో క్రియాశీలక కార్యకర్త. పులివెందుల అసెంబ్లీ అభ్యర్థిగా రెవెల్యూషనరీ సోషలిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఎన్నికల గుర్తుగా పార మరియు స్టోకర్ రిటర్నింగ్ అధికారి కేటాయించారు. అయితే ఎక్కడా తన గుర్తు తెలియజేస్తూ ఎన్నికల్లో ఓటు వేయాలని అభ్యర్థించడం లేదు. పైగా టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి విజయం కోసం పనిచేస్తున్నారు. ఈనెల 3న అంబకపల్లి, మురారిచింతల గ్రామాల్లో ఎన్నికల ప్రచారానికి వెళ్తే బీటెక్ రవి కారుపై ఎస్కార్ట్ తరహాలో నిల్చొని గ్రామంలోకి ప్రవేశించారు.
అక్కడే ఉన్న బీటెక్ రవి సోదరుడు భరత్‌కుమార్‌రెడ్డి కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈయనతో పాటు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీలో ఉన్న దేవిరెడ్డి సంజీవరెడ్డి, గోకనపల్లె వరప్రసాదరెడ్డిలు కూడా టీడీపీ అభ్యర్థి విజయం కోసం పనిచేస్తున్నారు. సంజీవరెడ్డి టీడీపీ అభ్యర్థి బీటెక్ రవితో కలిసి స్వయంగా టీడీపీలో చేరికల్లో పాల్గొన్నారు. మురారిచింతల గ్రామంలో టీడీపీ ఎన్నికల ప్రచారం సైతం కలిసికట్టుగా చేపట్టారు. గోకనపల్లె వరప్రసాదరెడ్డి ఏకంగా టీడీపీ టోపి పెట్టుకొని ఎన్నికల ప్రచారం చేపట్టడం విశేషం. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్న ఇలాంటి స్వతంత్ర అభ్యర్థులపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment