
సైనికుడే ఆ హంతకుడు!
న్యూయార్క్: అమెరికాలోని లూసియానా రాష్ట్రంలోగల బాటన్ రూజ్ లో పోలీసు అధికారులపై కాల్పులు జరిపిన వ్యక్తి ఓ మాజీ సైనికుడని అమెరికా అధికారులు గుర్తించారు. ప్రాథమిక విచారణలో ఈ విషయం తెలిసిందట. అయితే, ప్రస్తుతానికి ఆ ప్రాంతంలో ఆందోళనకర పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ఈ విషయాన్ని అధికారికంగా చెప్పడంలేదు.
ముగ్గురు పోలీసు అధికారులను కాల్చి చంపిన వ్యక్తి అమెరికా నావికా దళానికి చెందిన గేవిన్ లాంగ్ అని విచారణ అధికారులు గుర్తించారు. ఇతడు ముస్సోరిలోని కాన్సాస్ నగరానికి చెందిన వ్యక్తి అని తెలిపారు. పోలీసులను చంపాలన్న కుట్రలో భాగంగానే అతడు ఈ కాల్పులకు పాల్పడినట్లు తెలుస్తోంది. అత్యవసర నెంబర్(911)కు కావాలని అతడే ఫోన్ చేసి పోలీసులను అక్కడికి రప్పించి కాల్పులు జరిపినట్లు చెబుతున్నారు.