అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు | Gunman opens fire in a nightclub in Cincinati | Sakshi
Sakshi News home page

అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు

Published Sun, Mar 26 2017 1:02 PM | Last Updated on Fri, Aug 24 2018 8:18 PM

అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు - Sakshi

అమెరికా నైట్‌క్లబ్‌లో కాల్పులు

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం రేపుతున్నాయి. అమెరికా సిన్సినాటీలోని ఓ నైట్‌క్లబ్‌లో శనివారం అర్ధరాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. నైట్‌క్లబ్‌లో ఆనందంతో కేరింతలు కొడుతున్న వారిపై ఓ సాయుధుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో ఒకరు మరణించగా, మరో 13 మంది గాయపడ్డారని స్థానిక అమెరికా మీడియా తెలిపింది.

సిన్సినాటీ నగరంలోని కెల్లోగ్‌ అవెన్యూలో ఉన్న కేమియో క్లబ్‌లో ఈ కాల్పులు చోటుచేసున్నాయి. ఈ కబ్ల్‌ నుంచి క్షతగాత్రులను ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement