
ఇద్దరు ఇంట్లో కలిసి ఉండగా పట్టుకున్న మహిళ భర్త
మొయినాబాద్(చేవెళ్ల): మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ గన్‌మెన్ అడ్డంగా దొరికిపోయాడు. మహిళ భర్తకు రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిన గన్‌మెన్.. అతడిని కాలుస్తానని సర్వీస్ గన్ తీయ డం తీవ్ర కలకలం రేపింది. స్థానికులు అడ్డుకుని నిందితున్ని పోలీసులకు అప్పగించారు. ఈ సంఘ టన మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ లో సోమవారం రాత్రి జరిగింది. సింగప్పగూడ గ్రామానికి చెందిన చాకలి రమేష్ ఏఆర్ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. ప్రస్తుతం రాచకొండ అడిషనల్ డీసీపీ శిల్పవల్లి వద్ద గన్‌మెన్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు.
కాగా, నిజాంపేట్ మేడిపల్లి గ్రామానికి చెందిన రాజు తన కుటుంబంతో మొయినాబాద్ మండలం హిమాయత్‌నగర్ గ్రామానికి వలస వచ్చాడు. రాజు భార్యది, రమేష్‌ది ఊరు ఒకటే కావడంతో ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం వివాహేతర సంబంధంగా మారింది. సోమవారం రాత్రి 8 గంటల సమయంలో ఇంటికి వచ్చిన రాజు తన భార్యతో రమేష్‌ను చూసి దాడిచేసే ప్రయత్నం చేశాడు. వెంటనే రమేష్.. కాల్చిచంపుతానంటూ తన వద్ద ఉన్న సర్వీస్‌గన్ తీసి రాజును బెదిరించాడు. గొడవకు చుట్టుపక్కలవారు వచ్చి రమేష్‌ను పోలీసులకు అప్పగించారు. కాగా రమేష్‌ను రాచకొండ సీపీ మహేష్ భగవత్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.