భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు | Serbia cafe killing: Gunman shoots wife and four others, injuring 20 | Sakshi
Sakshi News home page

భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు

Published Sat, Jul 2 2016 4:38 PM | Last Updated on Fri, Jul 27 2018 2:18 PM

భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు - Sakshi

భార్యతో పాటూ ఐదుగురిని కాల్చి చంపాడు

సెర్బియా:
సెర్బియాలో ఓ వ్యక్తి తన భార్యతో పాటూ ఐదుగురిని కాల్చిచంపాడు. ఈ సంఘటన రెంజనిన్ నగరంలోరి మకిజటో కెఫేలో శనివారం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో మరో 20 మందికి గాయాలయ్యాయి. క్షతగ్రాత్రుల్లో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు.

పోలీసులు తెలిపిన వివరాలు.. మకిజటో కెఫేకి వచ్చిన ఓ వ్యక్తి తన భార్య, ఆమె స్నేహితులతో ఉండటం చూశాడు. వెంటనే తిరిగి ఇంటికి వెళ్లి తన వెంట గన్ను తీసుకు వచ్చాడు. ఓ రౌండ్ గాల్లోకి కాల్పులు జరిపి తొలుత తన భార్యను కాల్చిచంపాడు. అనంతరం మరో మహిళపై కాల్పులు జరిపాడు. ఆ తర్వాత ఇష్టానుసారంగా పక్కన ఉన్న వారి పై కాల్పులకు తెగబడ్డాడు. దీంతో కేఫేలో అంతా గందరగోళం నెలకొందని ప్రత్యక్షసాక్షి ఒకరు చెప్పారు.

కాల్పులకు కారణాలు ఇంకా తెలియరాలేదు. కేఫేలోని సభ్యులు ఘటన అనంతరం సదరు వ్యక్తిని పట్టుకొని గన్ను లాక్కున్నారు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. లైసెన్స్ లేని గన్ని అక్రమంగా వాడాడని పోలీసులు తెలిపారు.



 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement