కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్
సాక్షి, హైదరాబాద్ : కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవంటూ ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఆయనకి అండగా నిలుస్తాన్నారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని తనకు ముందే సమాచారం అందిందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడానికి టీఆర్‌ఎస్ ఇలా కక్ష్యా పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు.
ఈ నెల 18, 19 తేదీల్లో ప్రగతి భవన్‌లో టీఆర్‌ఎస్ ముఖ్యుల సమావేశం జరిగిందని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, రేవంత్, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారంటూ సంపత్ ఆరోపించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను ఖండిస్తుందని.. రేవంత్ రెడ్డికి అండగా ఉంటుందని తెలిపారు.
టీఆర్‌ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయిందని. అడ్డు వస్తే దేవుడిని కూడా ఎదిరిస్తాం అనే స్థాయికి చేరారంటూ మండిడ్డారు. కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే దేవుడు కూడా క్షమించడని గుర్తు చేశారు. ఇన్ని రోజులు గన్‌మెన్‌లను ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం ఇప్పుడు గన్‌మెన్‌లను ఇస్తామంటున్నారు. అంటే దీని వెనక ఉన్న మతలబు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కల్లకుంట్ల ప్రభుత్వం ఉన్నంత వరకూ ప్రభుత్వం నుంచి తాను ఏం తీసుకోనని తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ ‘మా అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. కల్వకుంట్ల ఖాన్ దాన్ పాలనను అంతం చేసే వరకూ పోరాడుతూనే ఉంటానం’టూ ప్రతిజ్ఞ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment