MLA Sampat Kumar
-
‘అమ్మతోడు.. కల్వకుంట్ల పాలన అంతు చూస్తా’
సాక్షి, హైదరాబాద్ : కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయి. కానీ ఈ దాడులు కాంగ్రెస్ పార్టీని ఏం చేయలేవంటూ ఏఐసీసీ కార్యదర్శి, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రకటించారు. రేవంత్ రెడ్డిపై జరిగిన దాడులను ఖండిస్తూ ఆయనకి అండగా నిలుస్తాన్నారు. ఈ సందర్భంగా శనివారమిక్కడ గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డిపై కుట్ర జరుగుతోందని తనకు ముందే సమాచారం అందిందన్నారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురి చేయడానికి టీఆర్ఎస్ ఇలా కక్ష్యా పూరితంగా వ్యవహరిస్తోందంటూ ఆయన మండిపడ్డారు. ఈ నెల 18, 19 తేదీల్లో ప్రగతి భవన్లో టీఆర్ఎస్ ముఖ్యుల సమావేశం జరిగిందని తెలిపారు. అనంతరం సీఎం కేసీఆర్ పోలీస్ ఉన్నతాధికారులతో భేటీ అయ్యారన్నారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, రేవంత్, సంపత్‌లను ఓడించడానికి ఏమైనా చేయండి అని కేసీఆర్ పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారంటూ సంపత్ ఆరోపించారు. అందులో భాగంగానే రేవంత్ రెడ్డిపై దాడులు జరుగుతున్నాయన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ దాడులను ఖండిస్తుందని.. రేవంత్ రెడ్డికి అండగా ఉంటుందని తెలిపారు. టీఆర్ఎస్ నేతల్లో అహంకారం పెరిగిపోయిందని. అడ్డు వస్తే దేవుడిని కూడా ఎదిరిస్తాం అనే స్థాయికి చేరారంటూ మండిడ్డారు. కానీ లిమిట్స్ క్రాస్ చేస్తే దేవుడు కూడా క్షమించడని గుర్తు చేశారు. ఇన్ని రోజులు గన్మెన్లను ఇవ్వడానికి నిరాకరించిన ప్రభుత్వం ఇప్పుడు గన్మెన్లను ఇస్తామంటున్నారు. అంటే దీని వెనక ఉన్న మతలబు ఏంటి అని ఆయన ప్రశ్నించారు. కల్లకుంట్ల ప్రభుత్వం ఉన్నంత వరకూ ప్రభుత్వం నుంచి తాను ఏం తీసుకోనని తెలిపారు. ఈ సందర్భంగా సంపత్ ‘మా అమ్మ మీద ప్రమాణం చేస్తున్నాను. కల్వకుంట్ల ఖాన్ దాన్ పాలనను అంతం చేసే వరకూ పోరాడుతూనే ఉంటానం’టూ ప్రతిజ్ఞ చేశారు. -
‘కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారు’
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరు రాహుల్‌తో సమావేశమై తాజా పరిణామాలను వివరించారు. ఇరువురు ఎమ్మెల్యేలతో పాటు తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డిలు రాహుల్‌ను కలిసిన వారిలో ఉన్నారు. అనంతరం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల సభ్యత్వ రద్దు ఉదంతం సహా కోర్టు తీర్పును రాహుల్ గాంధీకి వివరించినట్టు తెలిపారు. హైకోర్టు తీర్పుతో రాష్ట్రంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు కాంగ్రెస్ చేసిన కృషిని రాహుల్ అభినందించారన్నారు. కోమటిరెడ్డిని ప్రత్యేకంగా అభినందించారని ఆయన ఈ సందర్బంగా తెలిపారు. ఏస్థాయిలోనైనా పోరాటం ఉధృతం చేయాలని చెప్పారన్నారు. అసలు సభను అగౌర పరిచింది టీఆర్ఎస్ పార్టీ అని.. అడ్డగోలుగా సభను అగౌరపరిచి నడపాలనుకున్నారని ఉత్తమ్ మండిపడ్డారు. ఆధిక్యం ఉందని ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరికాదని.. నియంతృత్వ ధోరణి పనికి రాదని హితవు పలికారు. సీఎం కేసీఆర్, స్పీకర్ మధుసూదనచారి వారి పదవులకు రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. రాహుల్ గాంధీ రెండురోజుల పాటు బస్ యాత్రలో పాల్గొంటారని తెలిపారు. పార్టీలో ఎలాంటి విభేదాలు లేవని, అంతా మీడియా సృష్టేనని ఆయన స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు శుభపరిణామమని తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి కుంతియా అన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం తీర్పును గౌరవించాలని ఆయన సూచించారు. రాహుల్ గాంధీతో భేటి అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్‌లు మీడియాతో మాట్లాడుతూ.. ‘నెలన్నర నుంచి రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు రాహుల్ తెలుసుకున్నారు. అన్ని తెలుసుకుని మా ఇద్దరిని అభినందించారు. రాహుల్ పిలుపు మేరకు ఢిల్లీ వచ్చి ఆయనతో సమావేశమయ్యాం. 45 నిమిషాల పాటు జరిగిన సుదీర్ఘ భేటీలో రాహుల్ ఇచ్చిన సందేశం మాలో ఉత్సాహాన్ని పెంచింది. కోర్టు తీర్పు స్ఫూర్తిగా అన్ని విషయాల్లో పోరాటం చేయండి.. మీ వెంట మేముంటామని రాహుల్ చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం పై పోరాటం కొనసాగిస్తూనే ఉంటాం. అదే విధంగా లాయర్ జంధ్యాల రవిశంకర్‌ను కూడా ఆయన అభినందనలు చెప్పారు. పార్టీని తెలంగాణలో అధికారంలోకి తీసుకు రావడానికి కృషి చేయాలని రాహుల్ సూచించారు. కేసీఆర్‌ను ఓడించి కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొస్తాం’ అని పేర్కొన్నారు -
రాహుల్‌తో కోమటిరెడ్డి, సంపత్ భేటీ
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం భేటీ అయ్యారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో వీరిద్దరితో రాహుల్ సమావేశం అయ్యారు. తాజా పరిణామాలను ఈ సందర్భంగా వివరించారు. అంతకు ముందు ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్ కుమార్ శుక్రవారం కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఓపీ రావత్‌ను కలిశారు. ఎమ్మెల్యేల అనర్హత విషయంలో తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును వివరించారు. సమావేశం అనంతరం మాట్లాడుతూ...‘అక్రమంగా తమ సభ్యత్వాన్ని రద్దు గురించి చాలా స్పష్టంగా ఎన్నికల కమిషన్‌కు వివరించాం. అసెంబ్లీకి, స్పీకర్‌కు సభ్యత్వాన్ని రద్దు చేసే అధికారం లేదు. టీఆర్ఎస్ ప్రభుత్వం కుట్రపూరితంగా రాత్రికి రాత్రి సభ్యత్వాలను రద్దు చేసి, ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేశారు. టీఆర్ఎస్ కుతంత్రాలను కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంది. ఈ కేసుకు సంబంధించి మొత్తం సమాచారన్ని లిఖితపూర్వకంగా ఎన్నికల కమిషన్‌కు ఇచ్చాం. టీఆర్ఎస్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది. ఆ పార్టీ అధికారంలోకి వచ్చాక 15 లక్షలమందిని వివిధ ప్రాంతాల్లో ఓటర్ల జాబితా నుంచి తొలగించింది. కక్ష సాధింపు కోసం సభ్యత్వాలను రద్దు చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు తీసుకు రావాలనే కేసీఆర్ చేసిన గుణాత్మక మార్పులు ఇవేనా. నీకు పోటీగా వస్తే వారి సభ్యత్వాన్ని రద్దు చేస్తావా?. హైకోర్టు తీర్పును కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించాం. సానుకూలంగా స్పందించింది.’ అని తెలిపారు. కోమటిరెడ్డి, సంపత్తో పాటు పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్ కూడా ఈసీని కలిసినవారిలో ఉన్నారు. -
చండీయాగం ఫలాలు దక్కాలంటే..జోగుళాంబ జిల్లా చేయాలి
- సీఎం కేసీఆర్‌కు ఎమ్మెల్యే డీకే అరుణ విజ్ఞప్తి - లేకుంటే అమ్మవారి ఆగ్రహానికి గురవుతారని హెచ్చరిక సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయుత చండీయాగం ఫలాలు దక్కాలంటే.. జోగుళాంబ జిల్లాగా గద్వాలను ప్రకటించాలని స్థానిక ఎమ్మెల్యే డీకే అరుణ కోరారు. గద్వాల కేంద్రంగా జోగుళాంబ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ ఎమ్మెల్యే డీకే అరుణ మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల మండలం జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్ జోగుళాంబ ఆలయం వరకు పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మంగళవారం స్థానిక జమ్ములమ్మ ఆలయంలో పూజలు నిర్వహించి, అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో కలసి పాదయాత్రను ప్రారంభించారు. మొదటిరోజు 14 కిలోమీటర్ల పాదయాత్ర గద్వాల నుంచి ఎర్రవల్లి చౌరస్తా వరకు సాగింది. ప్రజలనుద్దేశించి ఆమె మాట్లాడుతూ ఒక వ్యక్తి ప్రయోజనాల కోసం జిల్లాలను ఏర్పాటు చేసే ఆలోచన మానుకోవాలని కోరారు. అర్హత ఉన్న ప్రాం తాలను జిల్లా కేంద్రాలుగా చేయాలని సూచించారు. నడిగడ్డ ప్రజల త్యాగాలు, ఈ ప్రాంత వెనుకబాటు, వనరులను దృష్టిలో ఉంచుకొని జిల్లాను ఏర్పాటు చేయాలని కోరారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్‌కుమార్ మాట్లాడుతూ గద్వాల, అలంపూర్ నియోజకవర్గాలపై సీఎం కేసీఆర్ వివక్ష చూపుతున్నారని విమర్శించారు. ఎర్రవల్లి చౌరస్తాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బస్సులో డీకే అరుణ బస చేశారు.