మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చేశాడు | Pennsylvania shootings: Six dead, gunman on the run | Sakshi
Sakshi News home page

మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చేశాడు

Published Tue, Dec 16 2014 1:21 PM | Last Updated on Tue, Nov 6 2018 4:37 PM

మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చేశాడు - Sakshi

మాజీ భార్య సహా ఆరుగుర్ని కాల్చేశాడు

పెన్సిల్వేనియా: అమెరికాలోని పెన్సిల్వేనియాలో జరిగిన కాల్పుల్లో ఆరుగురు చనిపోయారు. విలియం స్టోన్‌ అనే సాయుధుడు తన మాజీ భార్యతో పాటు ఆమె కుటుంబ సభ్యులను కాల్చి చంపాడు. మృతుల్లో వృద్ధులు, చిన్నారులు కూడా ఉన్నారు. నిందితుడు దాగి ఉన్న ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు. నిందితుడిని లొంగిపోవాలని పోలీసులు హెచ్చిరించారు. అయితే విలియం స్టోన్ పోలీసుల కళ్ళుగప్పి అక్కడి నుంచి పరారయ్యాడు. అతని కోసం పోలీసులు ఇంకా గాలిస్తున్నారు. మరోవైపు  ప్రశాంతంగా ఉండే పెన్సిల్వేనియా పట్టణంలో కాల్పులు కలకలం రేపాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement