
కాలిఫోర్నియా : అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. ఉత్తర కాలిఫోర్నియాలోని మారు మూల ప్రాంతమైన థెహామా కౌంటీలో ఓ దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ట్రక్‌పై వచ్చిన దుండగుడు రాంచో థెహామా ఎలిమెంటరీ స్కూల్ గేట్‌ను ఢీకొట్టి స్కూల్‌పైకి కాల్పులు జరిపాడు. బుల్లెట్ల శబ్ధాలతో స్కూల్ ఆవరణ మారుమోగిపోయింది. భయాందోళనలతో విద్యార్థులు, టీచర్లు తరగతి గదుల్లోని డెస్కులు, బెంచ్‌ల కింద తలదాచుకున్నారు. అనంతరం ఇష్టానుసారంగా దుండగుడు కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో నలుగురు మృతిచెందగా, పదిమందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
ఆ తర్వాత పోలీసులకు దుండగుడికి మధ్య హోరాహోరి కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో దుండగుడిని మట్టుపెట్టారు. దుండగుడు కాల్పులు జరపడానికి కారణాలు తెలియాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment