న్యూఢిల్లీ: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ, రెస్టారెంట్లలో టేబుల్స్ బుకింగ్ తదితర సేవల్లో ఉన్న జొమాటో పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు ఇన్వెస్టర్ల నుంచి మంచి స్పందన వస్తోంది. ఐపీవో బుధవారం ప్రారంభం కాగా.. రెండో రోజైన గురువారం సాయంత్రం 5 గంటల వరకు కంపెనీ ఆఫర్ చేస్తున్న షేర్లతో పోలిస్తే 5 రెట్లు అధికంగా బిడ్లు దాఖలయ్యాయి. మొత్తం 71.92 కోట్ల షేర్లకు గాను 344.76 కోట్ల షేర్లకు (4.8 రెట్లు) దరఖాస్తులు వచ్చాయి.
మొదటి రోజే ఆఫర్ చేస్తున్న షేర్లకు పూర్తిగా బిడ్లు దాఖలు కావడం గమనార్హం. రిటైల్ ఇన్వెస్టర్ల కోసం 10 శాతం కోటా (12.95 కోట్ల షేర్లు) కేటాయించగా.. 34.88 కోట్ల షేర్లకు బిడ్లు వచ్చాయి. అంటే 4.7 రెట్ల అధిక స్పందన వచి్చంది. సంస్థాగత ఇన్వెస్టర్ల (క్యూఐబీ) కోటా 7 రెట్ల అధిక స్పందన అందుకుంది. శుక్రవారంతో ఐపీవో ముగియనుంది.
Comments
Please login to add a commentAdd a comment