
జీహెచ్‌ఎంసీకి కలిసొచ్చింది..
పాత నోట్లతో బిల్లుల చెల్లింపులు
ఒక్కరోజే రూ.50 కోట్ల ఆదాయం
ఈ నెల 14 వరకు అవకాశం...
సిటీబ్యూరో : పాత పెద్దనోట్ల రద్దు పథకం ఎవరికెలా ఉన్నా జీహెచ్‌ఎంసీకి మాత్రం ఆయాచిత వరంగా మారింది. అసలే ఖజానా లోటుతో సిబ్బంది జీతభత్యాలకు సైతం అల్లాడుతున్న జీహెచ్‌ఎంసీకి శుక్రవారం ఒక్కరోజే దాదాపు రూ.50 కోట్లు ఖజానాకు చేరారుు. దీంతో వచ్చేనెల జీతాల చెల్లింపులకు పెద్దగా ఇబ్బంది ఉండదని జీహెచ్‌ఎంసీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నారుు. గత కొంతకాలంగా వివిధ కారణాలతో జీహెచ్‌ఎంసీ ఆర్థిక ఇబ్బందుల్లో పడటం తెలిసిందే. సెప్టెంబర్ నుంచి జీతాల చెల్లింపుల సమయానికి ఎలాగోలా నెట్టుకొస్తున్నారు. ఈనెల గడిస్తే.. డిసెంబర్ ఒకటోతేదీ నాటికి జీతాలు ఎలా చెల్లించాలా అని ఆందోళనలో ఉన్న ఉన్నతాధికారులకు పెద్దనోట్ల రద్దును పురస్కరించుకొని స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన ఫీజులకు పాతనోట్లు అనుమతించే అవకాశం ఇవ్వడం కొత్త ఆశలు రేకెత్తించింది. వారు ఊహించినట్లుగా శుక్రవారం ఒక్కరోజే రూ. 100 కోట్లు రాకపోరుునప్పటికీ భారీ మొత్తమే ఖజానాకు చేరింది. ఇక దినవారీ ఆదాయం ఎలాగూ రానుండటంతో వచ్చేనెల జీతాలకు ఇబ్బందులుండవని అధికారులు లెక్కలు వేస్తున్నారు.
హమ్మయ్య.. !
జీహెచ్‌ఎంసీకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు గ్రాంట్లు రాకపోవడం.. మరోవైపు జీహెచ్‌ఎంసీ ఖజానా నుంచే ఆర్టీసీకి రూ. 330 కోట్లు చెల్లించడం, రూ. 1200 లోపు వారికి ఆస్తిపన్ను మినహారుుంపునివ్వడం తదితర కారణాలతో గతంలో రూ. 800కోట్ల మిగులు నిధులతో ఉన్న జీహెచ్‌ఎంసీ ఖజానా దివాళా తీసింది. గత రెండు మూడు నెలలుగా జీతాల చెల్లింపులకు సైతం పలు ఇబ్బందులు పడుతున్నారు. . పరిస్థితిని ప్రభుత్వం దృష్టికి తేవడంతో జీహెచ్‌ఎంసీకి గత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రావాల్సిన గ్రాంట్లలో రూ. 145 కోట్లు రావడంతో నవంబర్ జీతాల చెల్లింపుల గండం గట్టెక్కారు. ఇక డిసెంబర్లో జీతాలను ఎలా చెల్లించాలో తెలియక కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ఈ పథకం ద్వారా భారీ ఆదాయం వచ్చింది.
14 వరకు అవకాశం
రద్దరుున రూ. 500, 1000 నోట్లతో వివిధరకాల పన్నులు, ఫీజులు చెల్లించే ఆవకాశాన్ని ఈనెల 14 వరకు పొడిగించినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఆస్తిపన్ను, నల్లాబిల్లు, ట్రేడ్ లెసైన్సులు, తదితర ప్రభుత్వ బిల్లుల్ని పాత పెద్ద నోట్లతో చెల్లించుకోవచ్చునన్నారు. మీసేవ కేంద్రాలు, జీహెచ్‌ఎంసీ సిటిజెన్ సర్వీస్సెంటర్లలో ఈ పన్నులు స్వీకరిస్తారని పేర్కొన్నారు.