డెహ్రాడూన్: ఉత్తరాఖండ్ ఆర్థిక మంత్రి, బీజేపీ నేత ప్రేమ్‌చంద్ అగర్వాల్ నడిరోడ్డుమీద ఓ వ్యక్తిపై దాడి చేశాడు. మంత్రి అనుచరులు కూడా అతడిని చితకబాదారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కాంగ్రెస్ నేతలు సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే..
మంత్రి ప్రేమ్‌చంద్ అగర్వాల్ రిషికేశ్ పట్టణంలో తన కారులో వెళ్తున్నారు. ఈ క్రమంలో రోడ్డుపై ట్రాఫిక్ ఎక్కువగా ఉండటంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఇంతలో సురేంద్రసింగ్ నెగీ అనే వ్యక్తి తన బైక్‌తో మంత్రి వాహనాన్ని ఢీకొట్టాడు. దీంతో, కారు నుంచి కిందకు దిగిన మంత్రి ప్రేమ్‌చంద్.. నేగిపై సీరియస్ అయ్యారు. అనంతరం, నేగిపై చంపచళ్లుమనిపించారు. ఈ క్రమంలో వారి మధ్య వాగ్వాదం పెరిగింది.
ఇంతలో, మంత్రి సిబ్బంది.. నేగిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ దాడిపై మంత్రి స్పందించారు. నేగి.. నన్ను అసభ్య పదజాలంతో తిట్టడంతో నా సిబ్బంది దాడి చేశారని చెప్పుకొచ్చారు. ఇదిలా ఉండగా.. ఈ దాడి ఘటనపై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధ్యతాయుత పదవిలో ఉన్న మంత్రి ఇలాగేనా ప్రవర్తించేది? అని కాంగ్రెస్ మండిపడింది. మంత్రి వెంటనే రాజీనామా చేయాలని, లేదా సీఎం ఆయన్ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేసింది.
Uttarakhand Cabinet Minister Premchand Agarwal fighting with youth in Rishikesh, then later his bodyguards also beat up the youth! pic.twitter.com/GxvNzuLk1O
— Yash (@Yashfacts28) May 2, 2023
ఇది కూడా చదవండి: బీజేపీ అడ్డాపై కాంగ్రెస్ కన్ను
Comments
Please login to add a commentAdd a comment