అందుకే ఆ యాప్స్‌పై నిషేధం | Report Chinese Apps TikTok WeChat To Be Banned In US From Sunday | Sakshi
Sakshi News home page

ఆనాటి నుంచి యూఎస్‌లో టిక్‌టాక్‌ బంద్‌

Published Fri, Sep 18 2020 7:18 PM | Last Updated on Fri, Sep 18 2020 7:48 PM

Report Chinese Apps TikTok WeChat To Be Banned In US From Sunday - Sakshi

వాషింగ్టన్‌: చైనీస్‌ యాప్‌లు టిక్‌టాక్‌, వీచాట్‌పై నిషేధం విధిస్తున్నట్లు అమెరికా తెలిపింది. జాతీయ భద్రతా కారణాల దృష్ట్యా ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు శుక్రవారం వెల్లడించింది. ఆదివారం నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని, ఇకపై ఎవరూ ఈ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసే వీల్లేదని పేర్కొంది. ఈ మేరకు కామర్స్‌ సెక్రటరీ విల్బర్‌ రోస్‌ ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ చైనీస్‌ కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో నడిచే కంపెనీలకు చెందిన ఈ యాప్‌లను ఉపయోగించడం వల్ల జాతీయ భద్రతకు ప్రమాదం పొంచి ఉందని, అమెరికా ఆర్థిక వ్యవస్థ, విదేశాంగ విధానం తదితర అంశాలపై ప్రభావం చూపుతాయనే కారణంగా వీటిని నిషేధిస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా అమెరికా- చైనాల మధ్య దౌత్య, వాణిజ్య యుద్ధం ముదిరిన నేపథ్యంలో డ్రాగన్‌ దేశ యాప్‌లు, కంపెనీలపై ఉక్కుపాదం మోపేందుకు అగ్రరాజ్యం సిద్ధమైన సంగతి తెలిసిందే.(చదవండి: మళ్లీ యూఎస్ వీక్‌- ఐపీవోకు టిక్‌టాక్‌)

ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన టిక్‌టాక్‌ను అమెరికా సంస్థకు విక్రయించాలని, లేనిపక్షంలో దాన్ని నిషేధిస్తామని అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇదివరకే హెచ్చరించారు. దీంతో ఈ వీడియో షేరింగ్‌ యాప్‌ అమెరికా హక్కులు సొంతం చేసుకునేందుకు తొలుత మైక్రోసాఫ్ట్ ఆసక్తి చూపినా చర్చలు ఫలించలేదు. దీంతో ఒరాకిల్‌ రంగంలోకి దిగింది. టిక్‌టాక్‌ మాతృసంస్థ బైట్‌డ్యాన్స్‌తో చర్చలు జరిపింది. అయితే ఈ కొనుగోలు ఒప్పందాన్ని ఆమోదించేందుకు తాను సిద్దంగా లేనని ట్రంప్ గురవారం వెల్లడించారు. చైనా కంపెనీ బైట్‌డాన్స్‌కు మెజారిటీ వాటా, ఒరాకిల్ సంస్థకు మైనారిటీ వాటా ప్రకారం కుదరనున్న ఒప్పందానికి తాను వ్యతిరేకమని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఈ మేరకు ఆదేశాలు వెలువడటం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement