
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్– లోన్ అసిస్ట్
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రుణం తీసుకోవాలనుకుంటున్నారా? పర్సనల్ లోన్, వెహికల్ లోన్, బిజినెస్ లోన్ ఏదైనా కావొచ్చు. రుణ అర్హత తెలుసుకోవాలని ఉందా? అయితే ఇంకేం ‘హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్– లోన్ అసిస్ట్’ యాప్‌ను ఉపయోగించి చూడండి. దీని ద్వారా బ్యాంక్ ఆఫర్ చేసే అన్ని రకాల లోన్ల వివరాలు పొందొచ్చు. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
♦ యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్.
♦రుణం తీసుకోవాలనుకుంటున్నవారు యాప్ నుంచే రుణ అర్హత తెలుసుకోవచ్చు. ఇన్‌స్టంట్ అప్రూవల్ కూడా పొందొచ్చు.
♦పర్సనల్ లోన్, హోమ్ లోన్, కార్ లోన్, టూవీలర్ లోన్, బిజినెస్‌లోన్, గోల్డ్ లోన్ వంటి పలు రుణాలకు సంబంధించిన వివరాలు, వాటికి ఏ ఏ డాక్యుమెంట్లు అవసరమో కూడా తెలుసుకోవచ్చు.
♦మీరు ఒకవేళ ఇదివరకే బ్యాంక్ నుంచి రుణం తీసుకుంటే.. ఆ రుణానికి సంబంధించిన వివరాలు, పేమెంట్ సమాచారాన్ని పొందొచ్చు.
♦ఈఎంఐ కాలిక్యులేటర్, ఎక్స్‌పెన్స్ ట్రాకర్ వంటి టూల్స్ సౌలభ్యం ఉంది.
♦అవసరమైన సాయం కోసం కస్టమర్ కేర్‌తో మాట్లాడవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment