వ్యక్తిగత రహస్యాలను తస్కరిస్తున్న యాప్స్!
వాషింగ్టన్: నిమిషాల్లో పనులవుతున్నాయని అందరం యాప్‌లను తెగ వినియోగించుకుంటున్నాం. కానీ అవి ఎంత వరకు సురక్షితమో ఒక్కసారి ఆలోచించండి. రెగ్యులర్‌గా వాడే యాప్‌లు మన వ్యక్తిగత వివరాలను తస్కరించే అవకాశం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేగాక ఆన్‌లైన్లో జరిపే లావాదేవీలపై జాగ్రత్త అవసరమని హెచ్చరిస్తున్నాయి.
ఆండ్రాయిడ్ ఫోన్లలో యాప్స్ ఎంత వరకు సేఫ్ అనేదానిపై పరిశోధకులు అధ్యయనాన్ని జరిపారు. ఇందుకోసం దాదాపు 300పైగా యాప్‌లతోపాటు మన ఫోన్‌లోకి వైరస్‌లను పంపే మరో 9,994 మాల్వేర్ యాప్‌లను శాస్త్రవేత్తలు పరిశోధించారు. అయితే ఈ యాప్‌లలో ఎక్కువశాతం వ్యక్తిగత సమాచారాన్ని సేకరిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయమై వర్జినియా యూనివర్శిటికి చెందిన అసిస్టెంట్ ఫ్రోఫెసర్ గాంగ్ వాంగ్ మాట్లాడుతూ.. ఫేస్‌బుక్ , వాట్సప్ వంటి యాప్‌ల ద్వారా కాల్స్ చేసుకోవద్దని హెచ్చరించారు.