టెక్నాలజీ ఎంత వేగంగా అభివృద్ధి చెందుతుందో.. సైబర్ నేరగాళ్లు కూడా అంతకంటే వేగంగా అడుగులు వేస్తున్నారు. గత సంవత్సరం గూగుల్ సంస్థ వినియోగదారుల భద్రత కోసం ఆధునిక ఫీచర్స్ పరిచయం చేసింది. గూగుల్ ప్లేస్టోర్‌లోని యాప్స్ యూజర్ల నుంచి ఎటువంటి డేటా సేకరిస్తున్నాయనే వివరాలు డేటా సేఫ్టీ అనే ఒక సెక్షన్‌లో తప్పకుండా వెల్లడించాల్సి ఉంది. అయితే దీనిని కూడా కొంత మంది హ్యాకర్లు హ్యాక్ చేసినట్లు సమాచారం. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
'ప్రాడియో' అనే మొబైల్ సైబర్ సెక్యూరిటీ కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. కొందరు హ్యాకర్లు యూజర్ల డేటా దొంగలించడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నట్లు, ఆ సమాచారం కొన్ని చైనా సంస్థలకు చేరవేస్తున్నట్లు తెలిసింది.
నిజానికి చైనాకు చెందిన వాంగ్ టామ్ అనే డెవలపర్ డిజైన్ చేసిన 'ఫైల్ రికవరీ అండ్ డేటా రికవరీ', 'ఫైల్ మేనేజర్' అనే రెండు యాప్స్ యూజర్ల డేటాని దొంగలిస్తున్నట్లు తెలిసింది. ఈ యాప్స్ రియల్ టైమ్ యూజర్ లొకేషన్, మొబైల్ కంట్రీ కోడ్, నెట్‌వర్క్ ప్రొవైడర్ పేరు, సిమ్ ప్రొవైడర్ వంటి వివరాలను సేకరిస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ఈ రెండు యాప్‌లను దాదాపు 10 లక్షల కంటే ఎక్కువమంది మంది డౌన్‌లోడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
(ఇదీ చదవండి: ఐఆర్‌సీటీసీ ఈ-టికెట్ & ఐ-టికెట్ గురించి మీకు తెలుసా?)
ఇప్పటి వరకు ఈ యాప్స్ డౌన్‌లోడ్ చేసుకున్న యూజర్లు వెంటనే తొలగించాలని అధికారిక వర్గాలు చెబుతున్నాయి. కానీ ఈ యాప్‌లను సృష్టించిన సంస్థ మాత్రం తాము నిబంధనలను ఉల్లఘించలేదని, దానికి అనుకూలంగానే ఉన్నట్లు వెల్లడించింది. కానీ ఇలాంటి యాప్‌ల విషయంలో తప్పకుండా జాగ్రత్త వహించాలని సైబర్ సెక్యూరిటీ సంస్థ వెల్లడించింది. ఇలాంటి సంఘటనలు వెలుగులోకి రావడం ఇదే మొదటి సారి కాదు, గతంలో కూడా చాలానే వెలుగులోకి వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment