ఆటోమొబైల్ పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న చైనా ఎప్పటికప్పుడు కొత్త వాహనాలను ఆవిష్కరించడంలో బిజీగా ఉంది. ఇందులో భాగంగానే ఈ సంవత్సరంలో ఫిబ్రవరిలో 'ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్' సూపర్ సోనిక్ హై స్పీడ్ ట్రైన్ (లో వాక్యూమ్ ట్యూబ్ హైపర్‌లూప్ స్టైల్ మాగ్లెవ్ అల్ట్రా హై-స్పీడ్ ట్రైన్)ను టెస్ట్ చేసింది.
ఏరోస్పేస్ సైన్స్ అండ్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఈ హైస్పీడ్ ట్రైన్‌ను టెస్ట్ చేయడం ఇదే మొదటిసారి. చూడటానికి ట్రైన్ మాదిరిగా ఉన్నప్పటికీ వేగంలో విమానానికి ఏ మాత్రం తీసిపోని విధంగా ఉంటుంది. మొదటి దశలో దీనిని 2 కిమీ దూరం టెస్ట్ చేశారు. టెస్టింగ్ సమయంలో ఈ ట్రైన్ స్పీడ్ 623 కిమీ/గం వేగాన్ని తాకింది.
2012లో జపాన్ నిర్మించిన L0 సిరీస్ మాగ్లెవ్.. ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన రైలుగా రికార్డు క్రియేట్ చేసింది. దీని టాప్ స్పీడ్ గంటకు 602 కిమీ. కాగా ఇప్పుడు చైనా నిర్మిస్తున్న ట్రైన్ ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన ట్రైన్‌గా సరికొత్త రికార్డ్ క్రియేట్ చేయడానికి సిద్ధమవుతోంది.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈ ట్రైన్‌కు చక్రాలు ఉండవు. చక్రాలు లేకుండా ఎలా నడుస్తుందనుకుంటున్నారా? ఇది ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ శక్తితో ట్రాక్‌పై గాలిలో తేలియాడుతూ నడుస్తుంది. దీంతో పట్టాలు, చక్రాలమధ్య ఘర్షణ అనే సమస్యే ఉండకపోవడంతో గరిష్ట వేగాన్ని సులభంగా అందుకోగలదు.
సూపర్ సోనిక్ హై స్పీడ్ ట్రైన్ ఎయిరో డైనమిక్స్ సూత్రాలకు అనుగుణంగా ప్యాసింజర్ల కోసం రైక్లెన్డ్ సీట్లును పొందుతుంది. ఈ ట్రైన్ గరిష్ట వేగం గంటకు 1000 కిమీ. కాబట్టి ఈ వేగంథియో వూహాన్ నుంచి బీజింగ్ చేరుకోవడానికి కేవలం 30 నిముషాలు మాత్రమే పడుతుందని తెలుస్తోంది.
ఈ ట్రైన్ మీద సోలార్ ప్యానెల్ ఏర్పాటు చేశారు. దీని ద్వారా ట్రైన్‌కు అవసరమైన పవర్ లభిస్తుంది. ప్రస్తుతం ఈ రైలును 623 కిమీ వేగంలో మాత్రమే టెస్ట్ చేశారు. దీనిని పూర్తిగా అభివృద్ధి చేశాక గంటకు 2000 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది సమాచారం. ఈ ట్రైన్ కోసం చైనా ఎంత ఖర్చు చేసిందనే విషయం అధికారికంగా వెల్లడించలేదు.
Comments
Please login to add a commentAdd a comment